Hin

26th june 2025 soul sustenance telugu

June 26, 2025

జీవితంలో విజయం సాధించడానికి మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోవడం (పార్ట్ 3)

జీవితంలోని నెగెటివ్ దృశ్యాలు మీపై ప్రభావం చూపనివ్వకండి 

చాలాసార్లు మన జీవితంలో ఉత్సాహం తగ్గిపోతుంది, ఎందుకంటే మనం నెగటివ్ దృశ్యాలను చూస్తూ వాటి ప్రభావానికి లోనవుతాం. నెగటివ్ దృశ్యాలు మన మనస్సులో నెగటివిటీని తీసుకురావద్దు అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి, ఎందుకంటే మన ఆత్మ శక్తి తగ్గిన క్షణం నుండి మనలో అనుమానాలు, భయాలు మొదలయ్యి  మన ఉత్సాహం తగ్గిపోతుంది. అప్పుడు మనకు ముందుకు సాగడం కష్టం అనిపిస్తుంది మరియు జీవితం యొక్క మార్గం స్పష్టంగా కనిపించదు. ఇది జరగకుండా ఉండాలంటే, ఉదయాన్నే ఒక దృఢమైన సంకల్పాన్ని సృష్టించి మనలో నింపుకొని మనం మన మనస్సులో దీర్ఘకాలిక పాజిటివిటీని అనుభవం చేసుకోవాలి. రోజంతా ఆ సంకల్పాన్ని బలంగా ఉంచాలి. రాత్రి అయ్యే సరికి, ఆ రోజు మన సంకల్ప బలాన్ని 1 నుండి 10 స్కేల్ లో అంచనా వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నెగటివ్ పరిస్థితులు వచ్చినా మన ఉత్సాహం స్థిరంగా ఉంటుంది, త్వరగా తగ్గిపోదు. మనం భయాలు, ఆందోళనలు లేకుండా ముందుకు సాగగలుగుతాము.

 

పాజిటివ్ వ్యక్తులతో సంబంధం పెట్టుకుని పాజిటివిటీని అనుభూతి చేయాలి

ఉత్సాహం అనేది ఒక శక్తి – ఇది మన నుండి ఇతరులకు ప్రసరిస్తుంది, కొన్నిసార్లు మనం ఇతరుల నుండి కూడా గ్రహిస్తాము. కాబట్టి మనం ఎప్పుడూ పాజిటివ్ ఆలోచనలు ఉన్నవారితోనే సంబంధం పెట్టుకోవాలి. మన పని గురించి ఎవరో నెగటివ్‌గా మాట్లాడినప్పుడు మన ఉత్సాహం తక్కువవుతుంది. ఇది మన కుటుంబ సభ్యులు, కార్యాలయ సహచరులు, స్నేహితులు, మీడియా వ్యక్తులు లేదా ఎవరైనా కావచ్చు. ఒకవైపు మనం ఇతరులకు ప్రేరణ కలిగించాలి, మరొకవైపు మనం నెగటివ్ మాటలు మాట్లాడే వారినుండి మన మనసును కాపాడుకోవాలి. అలా ఎలా చేయాలి? ఎవరైనా మన ముందుకు జీవితం గురించి నెగటివ్ ఆలోచనలతో వస్తే, మన పాజిటివ్ ఆలోచనలు చెప్పి, వాళ్ల ఆలోచనలనే మార్చాలి. అలాగే మన జీవితంలో లేదా ఇతరుల జీవితాల్లో ఉన్న పరిస్థితే అయినా, దాని గురించి నెగటివ్‌గా మాట్లాడకుండా ఉండాలి. ఎప్పుడూ మన కోసం, ఇతరుల కోసం కూడా పాజిటివ్ మాటలు మాట్లాడాలి, పాజిటివ్ ఆలోచనలు మరియు భావాలే పెట్టుకోవాలి.

రికార్డు

16th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మెడిటేషన్ ని మీ ఔషధంగా చేసుకొని ఆ ఔషధాన్ని ప్రతి రోజు తీసుకోండి మెడిటేషన్ మన మనస్సును మరింత శక్తివంతంగా చేసి

Read More »
15th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు రోజంతా మీ ఆలోచనలను జాగ్రత్తగా పరిశీలించుకోండి   మన భావోద్వేగ ఆరోగ్యం అనేది ముఖ్యంగా మన ఆధ్యాత్మిక ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది.

Read More »
14th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనమందరం మానవాత్మలం అనగా మొదట ఆత్మలం, ఇది మన ఆధ్యాత్మిక గుర్తింపు. మనం మన భౌతిక శరీరం ద్వారా మన పాత్రను

Read More »