కాలమే ఉపశమనాన్ని అందించలేదు

September 12, 2023

కాలమే ఉపశమనాన్ని అందించలేదు

మనం దుఃఖం, బాధ, వియోగం, వైఫల్యం లేదా ఏదైనా నిరాశతో బాధపడినప్పుడల్లా, ‘కాలం అన్ని గాయాలను నయం చేస్తుంది’ – అని అందరూ చెప్తూ ఉంటారు. కానీ, ఇది వాస్తవం కాదు.  సమయం ఒక బాహ్య అస్తిత్వం, మన భావాలు మనలో అంతర్గతంగా ఉండేవి. కాలం అనేది ఒక బాహ్య అస్తిత్వం, అది మన మనసులోకి చేరి మన భావాలను మార్చలేదు. కాలం గడిచే కొద్ది మనకి ఎందుకు ఉపశమనం కలుగుతుందంటే, మనము జ్ఞానాన్ని పొంది, జరిగిన దాని గురించి పరిశీలించుకొని ఇతరులతో మాట్లాడుతాము, జీవిత మార్గాలను అర్థం చేసుకుంటాము, మానసికంగా బలపడతాము ఇక చివరకు, జరిగిన దానిని అంగీకరిస్తాము. మనకు మనమే ఉపశమనాన్ని అందించుకోగలము, కాలం కాదు. నయం కావడానికి సమయం కోసం ఎదురుచూడకుండా, మానసిక గాయాలను నయం చేయడంలో వ్యక్తిగత బాధ్యత వహించాలని మన మనసుకు బోధించడానికి ఈ క్షణం కేటాయిద్దాం. మనం పట్టుకొని ఉన్న బాధ, అసౌకర్యాన్ని వదిలేయడానికి ఈ పాజిటివ్ సంకల్పాన్ని ప్రతి రోజు రిపీట్ చేద్దాము. ఇబ్బందికరమైన ఎమోషన్స్ ని  ఎదుర్కోవటం నేర్చుకుంటారు, ఇంకా జ్ఞానమనే సాధనంతో దాన్ని వెంటనే తగ్గించుకోగలుగుతారు. ఇది మిమ్ముల్ని నిలకడగా చేస్తుంది. 

పాజిటివ్ సంకల్పం –

నేను ఒక శక్తివంతమైన జీవిని. నాకు నా మనసు తో చక్కని సంబంధం ఉంది… ప్రతి పరిస్థితి లో నేను దాన్ని సంతోషంగా, స్థిరంగా ఉంచుకుంటాను. ఈరోజు నాకు ఎలా అనిపించిందో చూసుకుంటాను… గతం గురించి ఏదయినా బాధ… ఏదయినా నష్టం … వైఫల్యం … దుఃఖం … ఏదయినా తీరని కోరిక … నేను అనుభవం చేసుకుంటున్నానా … దానితో నా మనసు శాంతిగా లేక సంతోషంగా ఉండటం లేదు… నాకు తెలుసు కొందరు నాకు అన్యాయం చేశారు… పరిస్థితులు సవాలు చేసేవిలా ఉన్నాయి … కానీ నేను గతంలోని గాయాలు మానడానికి కాలం కోసం వేచి ఉండను… కాలం నయం చేయగలిగేది కాదు … నన్ను నేను ఎప్పుడు నయం చేసుకోవాలి అనేది నేను ఎంచుకుంటాను… నాకు ఇప్పుడు నయం కావాలని నిర్ణయం తీసుకుంటాను … ఇలా అర్థం చేసుకోవడంతో… ఎవరూ నన్ను గాయపరచలేరు… అందరు వారి దృష్టికోణం ప్రకారంగా వ్యవహరిస్తారు. పరిస్థితులు ఎలా ఉండాలో అలానే  ఉన్నాయి. నేను బాధను సృష్టించుకున్నాను…  ఇది నా గత కర్మ ఖాతా… ఆ కర్మ చేసేటప్పుడు నా భాగ్యం లో ఆ దృశ్యాన్ని రాసుకున్నాను… అది అయిపోయింది. బాధను సృష్టించుకున్నందుకు, నన్ను నేను క్షమించుకుంటాను… అది అయిపో యింది … అది అయిపోయింది. నా భావోద్వేగాలకు నేను మాస్టర్ ని… నేను ఎల్లప్పుడూ ఎంచుకునే మాస్టర్ ని … నా మనసులో ఎవరు,ఏమి ఉండాలో … ప్రతి పరిస్థితిలో నా ప్రతి భావాలను నేను ఎంచుకుంటాను. గతంలో సృష్టించుకున్న బాధను దాటుకొని వెళ్తాను… ఈ రోజు నుండి ఇది ఒక కొత్త కర్మల ఖాతా… శాంతి మరియు సంతోషం తో కూడినది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

29th-sept-2023-soul-sustenance-telugu

పరిశీలన శక్తిని ఉపయోగించడం

మన జీవితం ఎలా జీవించాలనే మాన్యువల్‌తో రాదు. ప్రతిరోజూ మనం ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.  మనకు ఉన్నతమైన వివేకం మరియు సరైన పరిశీలన శక్తి ఉండాలి. పరిశీలన శక్తి అంటే తప్పు ఒప్పులను,

Read More »
28th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 4)

మూడవ అద్దం మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యల అద్దం – మీ గురించి మరియు ఇతరుల గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఏమి ఫీల్ అవుతున్నారో ఇతరులకు కనిపించదు కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది.

Read More »
27th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 3)

గత రెండు రోజుల సందేశాలలో, అంతర్గత అందానికి మొదటి అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం గురించి మేము వివరించాము. రెండవ అద్దం మెడిటేషన్ యొక్క అద్దం – మెడిటేషన్ యొక్క నిశ్చలత

Read More »