Hin

కార్యాలయంలో నిజాయితీ

November 6, 2024

కార్యాలయంలో నిజాయితీ

మీ కార్యాలయంలో నిజాయితీ అనేది కేవలం ఒక పద్ధతి మాత్రమే కాదు, విజయం మరియు సంతుష్టతలకు రహస్యం కూడా. నిజాయితీని విలువైనదిగా భావించే ఉద్యోగికి విజయం, నమ్మకం లభిస్తాయి. మన నిజాయితీ విషయంలో రాజీ పడితే మన విశ్వాసం, స్వీయ-విలువ మరియు సామర్థ్యం కూడా రాజీపడతాయి.

  1. పనిని నివారించడానికి అబద్ధం చెప్పడం, ఇంటర్నెట్ సర్ఫింగ్ చేయడం, స్టేషనరీని దుర్వినియోగం చేయడం, తప్పులను కప్పిపుచ్చుకోవడం లేదా వేరొకరి శ్రమకు క్రెడిట్ పొందడం వంటి నిజాయితీ లోపాన్ని మీ కార్యాలయంలో మీరు చూశారా?
  2. నిజాయితీ మీ అసలైన గుణం. కాబట్టి, నిజాయితీ లేని చర్యలు అంటే మీరు మీ అసలైన స్వభావానికి వ్యతిరేకంగా వెళ్తున్నారని అర్థం. మీ మనస్సాక్షి స్వచ్చంగా లేనప్పుడు, మీరు అసౌకర్యంగా భావిస్తారు మరియు ప్రశాంతంగా ఉండలేరు. స్వల్పకాలిక లాభాల కోసం నిజాయితీ లేని చర్యలు ప్రమాదకరం కానట్లుగా లేదా చిన్నవిగా అనిపించవచ్చు, కానీ అవి మీ భావోద్వేగ ఆరోగ్యం, మనోబలంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.
  3. కొన్నిసార్లు మీరు మీ కార్యాలయంలో నిజాయితీగా ఉండటంలో అడ్డంకులు లేదా ఇబ్బందులను ఎదుర్కోవచ్చు.  ఉదా. మీరు చేసిన పొరపాటు గురించి తెలియజేయడానికి లేదా అనైతిక పద్ధతులకు వ్యతిరేకంగా మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి ధైర్యం అవసరం. ఇతరులు నిజాయితీ లేనివారైనా ధైర్యాన్ని కోల్పోవద్దు. దారిలో వచ్చే ప్రలోభాలు, అడ్డంకులు ఉన్నప్పటికీ, ఎప్పటికైనా నిజాయితీగా ఉండటమే సరైన మార్గం.
  4. మీ ప్రతి చర్య మరియు సంభాషణలో నిజాయితీగా ఉండేందుకు ధ్యానం చేయండి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అధ్యయనం చేయండి. మీరు ఉన్నత నైతిక ప్రమాణాలను నిర్దేశించుకున్నప్పుడు, మీరు మీ ఆఫీసులో నిజాయితీ మరియు చిత్తశుద్ధి అనే సుగుణాల అలల ప్రభావాన్ని సృష్టిస్తారు, మీతో పనిచేసే ప్రతి ఒక్కరూ ఆ అలల నుండి ప్రయోజనం పొందుతారు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

30th april 2025 soul sustenance telugu

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితంలోని వివిధ లక్ష్యాలను సాధించేటప్పుడు మనం ఎంత వినయంగా మరియు నిజాయితీగా ఉన్నాము అనేదే మన విజయం. నమ్రత అన్నింటికంటే గొప్ప

Read More »
29th april 2025 soul sustenance telugu

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు విజయం అంటే మన జీవతపు క్వాలిటి పెరగడం. మనం ఖరీదైన కారు,  ఖరీదైన బట్టలు కొనుగోలు చేసి  గర్వపడతాము. కొన్నిసార్లు ఈ

Read More »
28th april 2025 soul sustenance telugu

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనమందరం మనకు మరియు ఇతరులకు సాధ్యమైనంత ఉత్తమమైన రీతిలో ప్రయోజనం చేకూర్చే పనులు చేసే ప్రత్యేకమైన వారము. ఉద్యోగంలో, మార్కెట్‌కు వెళ్లేటప్పుడు,

Read More »