Hin

22nd-oct-2023-soul-sustenance-telugu

October 22, 2023

కలలను వాస్తవాలుగా మార్చుకోవడం (పార్ట్ 2)

నిన్నటి సందేశాన్ని కొనసాగిద్దాం. దేనిపైన అయితే మనం శ్రద్ధ వహిస్తున్నామో, దేనినైతే మనం సృష్టించాలనుకుంటున్నామో దాని గురించి మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఏ సందేహాలు లేకుండా మన మనసులో ఆ విషయం స్పష్టంగా ఉండాలి. ఉదాహరణకు, మానసికంగా నేను బలంగా అవ్వాలి అని మనం అనుకుంటే అందుకు దేనిని ఆశించాలో, దేనిని ఆశించకూడదో కూడా తెలుసుకోవాలి, అందుకు మనమే బాధ్యత వహిస్తూ తదనుగుణంగానే ఎంపికలు చేసుకుంటూ ఉండాలి. పువ్వును చూడండి, తనను తాను అందంగా తయారు చేసుకునే ప్రక్రియలో అది తన రంగును ఎంతో శ్రద్ధగా ఎంచుకుంటుంది. దాని రేకులను జాగ్రత్తగా ఒకదాని ప్రక్కన మరొక దానిని ఏర్పాటు చేసుకుంటుంది. తాను సంపూర్ణ సౌందర్యాన్ని పొందిన తర్వాతే కనిపించాలనుకుంటుంది, అందుకే ఒక చక్కని రోజున, సూర్యోదయం సమయాన, తన సౌందర్యంతో అది అందరికీ కనిపిస్తుంది. అదే విధంగా, అంతర్గతంలో మన మనసుకు మనం చేసే తయారీలు అందమైన వాస్తవాలను  సాకారం చేస్తాయి. మన కలలపై మనకు నమ్మకం ఉండాలి. ఇతరులను అంగీకరిస్తూ వారితో సర్దుకుపోతూ ఉండాలి మరియు మన ఆంతరిక ఆధ్యాత్మిక వ్యక్తిత్వాన్ని కూడా పెంపొందించుకుంటూ ఉండాలి. లేకపోతే, ఒక సమయం వచ్చేసరికి మనం బాగా అలసిపోయి, ఒంటరిగా అయిపోయినట్లుగా అనిపిస్తుంది.  కనుక వినయంతో కూడిన సత్యత, నిర్భయత మరియు ఇతరులను బేషరుతుగా అంగీకరిస్తూ వారితో కలిసి ఉండటం కూడా చాలా ముఖ్యం.

 

మానవాత్మకు తన కలపై దృష్టిపెట్టగల సామర్థ్యం అపారంగా ఉంది. మనకున్న సానుకూలత మరియు ఆంతరిక శక్తి ఆధారంగా మనకు ఏది సాధ్యమో, ఏది సాధ్యం కాదో ఈ సృష్టి నాటకం మనకు చూపిస్తుంది. ఇక భగవంతుడు కూడా ప్రతి అడుగులో మనతోటే ఉంటారు. ఆత్మలమైన మనం, మన కలలను సాకారం చేసుకునే పనిలో ఉండాలి. గతాన్ని మనసులో పెట్టుకుని రేపటి గురించి నిర్ణయించుకోవద్దు. ఆధ్యాత్మికత అంటే దేహ అభిమానం నుండి ఆత్మ అభిమానిగా అవ్వడం. ఆధ్యాత్మికత అంటే భగవంతుడిని అన్వేషించడం కాదు, వారిని లోతుగా అర్థం చేసుకుని, వారితో కనెక్ట్ అయి స్వయాన్ని దివ్య స్వరూపంగా తయారు చేసుకోవడం. ఈ విధంగా ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మనం అనుభూతి చెందుతూ, సానుకూల సృష్టికి మూలం మనలోనే ఉందని అర్థం చేసుకున్నప్పుడు ఈ అవగాహనే శక్తిగా మారి మన ఆలోచనలను, కలలను సాకారం చేస్తుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

20th march 2025 soul sustenance telugu

సంబంధాల్లో కలిగే బాధ నుండి విముక్తిని పొందడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితంలోని వివిధ రంగాలలో వేర్వేరు సంబంధాలలోకి వచ్చినప్పుడు, కొన్నిసార్లు మన అంతర్గత ప్రపంచంలోకి మరొక ఆత్మను అనుమతించినప్పుడు, మనల్ని వారు అర్థం

Read More »
19th march 2025 soul sustenance telugu

జీవితంలోని వివిధ దృశ్యాలలో సాకులు చెప్పడం మానుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలా మంది మన విశ్వసనీయతను కాపాడుకోవడానికి, ఇతరులపై లేదా పరిస్థితులపై నిందలు వేయడానికి సాకులు చెబుతారు. కొన్నిసార్లు మనకు, మన

Read More »
18th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు అంతర్గత బలం యొక్క సానుకూల సంస్కారాలను సృష్టించడానికి, మనం ముందుగా పట్టుదల యొక్క మొదటి అడుగు వేయాలి. పట్టుదల అంటే నేను

Read More »