Hin

21st-oct-2023-soul-sustenance-telugu

October 21, 2023

కలలను వాస్తవాలుగా మార్చుకోవడం (పార్ట్ 1)

మన కలలు మరియు ఆకాంక్షలను చిన్న విత్తనాలతో పోల్చుకుందాం. అవి బయటి ప్రపంచానికి కనిపించవు. అవి ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి. మీకున్న కలల గురించి మీకు మాత్రమే తెలుసు ఎందుకంటే అవి ఇతరులెవ్వరి వద్ద ఉండవు. విత్తనాలు భూమి లోతుల్లో నిద్రిస్తూ ఉంటాయి. ఆ విత్తనాలలో దేనినైనా వ్యక్తి వాస్తవంలోకి తీసుకురావలన్న కోరికతో ఎంచుకునేంతవరకు అవి అలాగే ఉంటాయి. తర్వాత, ఒకసారి ఎంచుకోబడ్డ ఆ చిన్ని విత్తనం నెమ్మదిగా పెరిగి ఒక చిన్న కొమ్మను సూర్యుని వైపుకు పంపుతుంది. అదే విధంగా, ఈ ప్రపంచంలో నేడు ఉన్న ప్రతిదీ మొదట మన మనస్సులలో సృష్టించబడింది. మన మనస్సులలో, మన అంతర్గత ప్రపంచంలో ఆలోచనలను సృష్టించే కళను చాలా జాగ్రత్తగా మరియు సరిగ్గా నేర్చుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే, బాహ్య ప్రపంచంలో జరిగేది కొన్నిసార్లు మనం ఆశించే లేదా కోరుకునే దానికి మరియు మనం కలలు కనే వాటికి చాలా భిన్నంగా ఉంటుంది.

వ్యవస్థీకృత మనస్సు అనేది అనవసరమైన మార్పులకు దూరంగా, పాజిటివ్‌గా సృష్టించబడిన, స్వచ్ఛమైన ఆలోచనలతో నిండి ఉంటుంది. అలాంటి మనస్సు మన మొత్తం వ్యవస్థను నిర్వహిస్తుంది. అప్పుడు మన భౌతిక, మానసిక మరియు భావోద్వేగ శక్తులన్నీ ఒకే దిశలో నడుస్తాయి. ఆ దిశ మనం నెరవేర్చుకోవాలనుకుంటున్న కలల వైపే ఉండాలి. అంతే కాక, భగవంతుడిపై విశ్వాసం ఉండటం కూడా చాలా ముఖ్యం. ఏదైనా సాధించాలన్న ఆలోచన దృఢంగా ఉన్నాకానీ సాధించే మార్గంలో వచ్చే కష్టాల గురించి మనం ఒక్కోసారి అతిగా ఆలోచిస్తూ  ఉంటాము. ఇలా అతిగా ఆలోచించడము మన మార్గానికి అడ్డుగా నిలిచి అంతర్గత సంఘర్షణకు దారి తీస్తుంది. ఒక కల గురించి మనం సృష్టించే శక్తివంతమైన తరంగాలే పాజిటివ్ ఆలోచనగా అవుతాయి. మన కలలు అనేక విభాగాలలో ఉండువచ్చు – వ్యక్తిగతం, ఉద్యోగం, సామాజికం, భావోద్వేగం లేక ఆధ్యాత్మికం. ఈ వివిధ కలలను నెరవేర్చుకునే మార్గంలో ఆందోళన, భయంతో కూడిన అనవసరమైన మరియు నెగిటివ్ ఆలోచనలను కట్టడి చేసేది –  అమితమైన విశ్వాసం మరియు దృఢ సంకల్పం. ఈ పాజిటివ్ ఆలోచనల శక్తియే విజయానికి మూలం.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

18th feb 2025 soul sustenance telugu

భగవంతుడు సర్వోన్నతుడైన తండ్రి మరియు తల్లి

ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో మత సంప్రదాయాలలో, భగవంతుడిని ఎల్లప్పుడూ పురుషుడిగా సూచిస్తారు. కానీ, ఆత్మకు లింగం లేదు, అది పురుష లేదా స్త్రీలింగం కాదు. అలాగే భగవంతుడిని అనగా పరమ ఆత్మ యొక్క లింగం

Read More »
17th feb 2025 soul sustenance telugu

చక్కటి సంబంధాలను బలపరుచుకోవడానికి అహంకారాన్ని త్యాగం చేయడం (పార్ట్ 3)

ప్రతి సంబంధంలో ఆ సంబంధం ఎలా ఉన్నా కూడా ఎదుటి వారిని ముందు ఉంచే వ్యక్తి సంబంధాన్ని నడిపిస్తాడని గుర్తుంచుకోండి. ఎదుటి వ్యక్తిని ముందు ఉంచడం అంటే కొన్ని సమయాల్లో మీరు ఒక నిర్దిష్ట

Read More »
16th feb 2025 soul sustenance telugu

చక్కటి సంబంధాలను బలపరుచుకోవడానికి అహంకారాన్ని త్యాగం చేయడం (పార్ట్ 2)

మీరు మరొక వ్యక్తిని కలిసినప్పుడల్లా, మీరు మీలాగే ఉండాలి అని నిర్ధారించుకుంటూ, అదే సమయంలో ఎదుటి వ్యక్తిని కూడా వారిని వారిలానే ఉండనివ్వడం ద్వారా మీరు వారికీ ఒక స్వేచ్చని కలిపిస్తారు. దాని అర్థం

Read More »