Hin

23th dec 2024 soul sustenance telugu

December 23, 2024

కర్మ సంబంధాల చక్రం (పార్ట్ 1)

ఆలోచనలు, మాటలు మరియు చర్యల రూపంలో మనం ప్రపంచంలోకి పంపే శక్తి కర్మ. ఇది మనం షూట్ చేసే బాణం లాంటిది, అది లక్ష్యాన్ని తాకి, ఆపై మన వద్దకు తిరిగి వస్తుంది. తిరిగి వచ్చే శక్తి మన విధి, అనగా మన ఆరోగ్యం, మన వృత్తి, మన సంబంధాలు, ప్రతిరోజూ మనకు వచ్చే పరిస్థితులు. చాలా తరచుగా మనం ప్రతి ఒక్కరి పట్ల ఎల్లప్పుడూ మంచిగా ఉన్నప్పటికీ, మనకు ఎందుకు మంచి జరగడం లేదని భావిస్తాము. మనం కర్మ సిద్ధాంతాన్ని ప్రశ్నించడం ప్రారంభిస్తాము, అది న్యాయంగా అనిపించదు. కర్మ యొక్క సిద్ధాంతం ఒక ఆధ్యాత్మిక సిద్ధాంతం, అనగా ఆత్మకు వర్తించే ఒక చట్టం. కర్మను చేసినది నేను ఆత్మనే, శరీరం కాదు. ఆత్మ ఒక ప్రయాణంలో ఉంటుంది, శరీరం అనేది కర్మ చేయడానికి ధరించే శారీరక వస్త్రం వంటిది. ప్రతి వస్త్రంలో మనం ఇతర ఆత్మలను కలుస్తాము, వారితో కర్మ సంబంధాలను కలిగి ఉంటాము. సమయం గడిచేకొద్దీ, వారు మరియు మనము వస్త్రాలను మార్చుకుంటాము, కానీ అవ్వి దుస్తులు మాత్రమే అని గుర్తుంచుకోండి. కర్మ సంబంధం ఆత్మల మధ్య ఉంటుంది, ఆ సంబంధం కొనసాగుతుంది. 

మనం ఈ రోజు ఒక స్నేహితుడిని కలుసుకుని, ఒక బలమైన వాదన అయ్యి, ఆ సమావేశం అప్రియమైన రీతిలో ముగిసిందని అనుకుందాం. మనం ఒక వారం తరువాత ఇద్దరూ వేరే దుస్తులు ధరించి, మళ్ళీ కలుస్తాము. ఈ రెండవ సమావేశం మునుపటి వాదన ద్వారా ప్రభావితమవుతుంది, కాబట్టి ఇది మంచి విధంగా ప్రారంభం కాదు. మనం ఒకరితో ఒకరు బాగా మాట్లాడకపోవచ్చు. వచ్చే నెలలో మనం మళ్ళీ కలుస్తాము, మనం ఒకరితో ఒకరు అస్సలు మాట్లాడకపోవచ్చు. ప్రతి సమావేశం తదుపరి సమావేశానికి కొనసాగుతుంది. మనలో ఎవరైనా ఇప్పుడు ఈ సంఘర్షణను అంతం చేయాలని నిర్ణయించుకుని, మర్యాదపూర్వకమైన సంభాషణను ప్రారంభిస్తే, సమావేశం యొక్క నాణ్యత మారుతుంది తద్వారా అది ముందుకు సాగుతుంది. ఇది కర్మ సంబంధాల నిరంతర చక్రం. 

(సశేషం…)

రికార్డు

28th march 2025 soul sustenance telugu

సోషల్ మీడియా లైక్‌లు ముఖ్యమా?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఆధారిత సమాజంలో, మనం పోస్ట్ చేసే దానిపై ప్రజల ఆమోదం పొందడం మన స్వీయ-విలువ మరియు కీర్తికి కొలమానంగా

Read More »
27th march 2025 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు

Read More »
26th march 2025 soul sustenance telugu

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను చాలా బిజీగా ఉన్నాను…నాకు సమయం లేదు అని తరచుగా అంటూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వం మనల్ని సమయానికి ప్రాధాన్యత ఇవ్వనివ్వదు.

Read More »