Hin

19th sep 2024 soul sustenance telugu

September 19, 2024

కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తుంది?

మనమందరం ఆధ్యాత్మిక శక్తులము లేదా ఆత్మలము. మనం ఈ ప్రపంచ నాటకంలో వివిధ రకాల చర్యలను చేస్తాము. మనమందరం దేహ అభిమాన ప్రభావంతో ప్రపంచ నాటకంలో చాలా మంచి చర్యలు మరియు కొన్ని ప్రతికూల చర్యలను కూడా చేశాము. మనలో కొందరికి మన చర్యల గురించి ఎక్కువ అవగాహన ఉంటుంది మరియు కొందరికి తక్కువ అవగాహన ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? ప్రపంచ నాటకంలో మన వేర్వేరు జన్మలలోకి వచ్చినపుడు మన మనస్సు, బుద్ధి, మరియు సంస్కారాలను ప్రభావితం చేసిన వివిధ రకాల అనుభూతులను పొందాము. ఫలితంగా, జీవితం గురించి, జీవిత పరిస్థితుల గురించి, సానుకూలత, స్వచ్ఛత, మంచితనం, ఆత్మ సాక్షాత్కారం మరియు భగవంతుడు గురించి మన నమ్మకాలు కాలక్రమేణా మారాయి. అలాగే, మనమందరం వివిధ జన్మలలో వివిధ రకాల సమాచారాలకు, విభిన్న సంబంధాలకు, జీవితంలోని విభిన్న దృశ్యాలకు గురయ్యాము, ఇవి మన స్మృతిని వివిధ మార్గాల్లో ప్రభావితం చేసి  మన ఆలోచనలు, నమ్మకాలకు ఈ రోజు ఇటువంటి ఆకారాన్ని ఇచ్చాయి. అందుకే ఈ రోజు కొంతమంది తమ ప్రతి చర్య పట్ల ఎక్కువ జాగ్రత్తగా ఉంటారు, మరికొందరు దాని గురించి అంత జాగ్రత్తగా ఉండరు. కానీ కర్మ సిద్ధాంతం స్పష్టంగా ఉంటుంది. శాంతి, ఆనందం, ప్రేమ, సంతోషం, స్వచ్ఛత, శక్తి మరియు జ్ఞానం వంటి దైవిక ధర్మాలు మరియు ఆత్మిక స్మృతి  యొక్క ప్రభావంతో చేసే చర్యలు మనకు మరింత ఆనందాన్ని ఇచ్చి  మన జీవితాల్లో మరింత మెరుగైన, సానుకూల పరిస్థితులను ఆకర్షిస్తాయి. అలాగే దైహిక స్మృతిలో యొక్క ప్రభావంతో చేసే చర్యలు మరియు కామము, కోపం, దురాశ, మొహం, అహం, అసూయ, ద్వేషం మరియు మోసం వంటి దుర్గుణాలు మనకు దుఃఖాన్ని ఇస్తాయి, మన జీవితంలో మరింత ప్రతికూల పరిస్థితులను ఆకర్షిస్తాయి.

ప్రపంచ నాటకంలో భగవంతుడు మాత్రమే పాత్ర పోషిస్తారు మరియు తన పాత్రను పోషిస్తున్నప్పుడు, వారు నిరంతరం ఆత్మిక స్మృతిలో ఉంటారు. వారు మానవ ఆత్మల వలె తన కర్మల ఫలాలను పొందరు  ఎందుకంటే వారు ప్రపంచ నాటకంలో అస్సలు మారని జ్ఞాన, గుణ మరియు శక్తులకు స్థిరమైన మహాసాగరం. వారు  శాశ్వతమైనవారు, మానవ ఆత్మలకు మరియు ప్రకృతికి నిరంతరం ఇచ్చేవారు. ఎవరి నుండి లేదా ప్రకృతి నుండి ఎప్పుడూ ఏమీ తీసుకోరు. ప్రపంచ నాటకం స్వర్ణ మరియు వెండి యుగాలలో మానవ ఆత్మలు ఆత్మిక స్మృతిలో ఉంటారు మరియు అదే ప్రపంచ నాటకం రాగి మరియు ఇనుప యుగాలలో దైహిక స్మృతిలో ఉంటారు. అందుకే మొదటి రెండు యుగాలలో దుఃఖం ఉండదు . దుఃఖం రాగి యుగంలో ప్రారంభమవుతుంది మరియు ప్రపంచ నాటకం రాగి యుగం నుండి  ఇనుప యుగం  ముగింపుకు వచ్చినప్పుడు పెరుగుతుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

[drts-directory-search directory="bk_locations" size="lg" style="padding:15px; background-color:rgba(0,0,0,0.15); border-radius:4px;"]

రికార్డు

16th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మెడిటేషన్ ని మీ ఔషధంగా చేసుకొని ఆ ఔషధాన్ని ప్రతి రోజు తీసుకోండి మెడిటేషన్ మన మనస్సును మరింత శక్తివంతంగా చేసి

Read More »
15th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు రోజంతా మీ ఆలోచనలను జాగ్రత్తగా పరిశీలించుకోండి   మన భావోద్వేగ ఆరోగ్యం అనేది ముఖ్యంగా మన ఆధ్యాత్మిక ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది.

Read More »
14th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనమందరం మానవాత్మలం అనగా మొదట ఆత్మలం, ఇది మన ఆధ్యాత్మిక గుర్తింపు. మనం మన భౌతిక శరీరం ద్వారా మన పాత్రను

Read More »