HI

15th mar 2024 soul sustenance telugu

March 15, 2024

కర్మలలో ఆత్మిక స్థితి (పార్ట్ 1)

జీవితం అంటే కర్మలు చేయడం, ప్రతి పనికీ దాని ప్రాముఖ్యత ఉంటుంది, ఒక్కోసారి కర్మలు (పని) చేసేటప్పుడు సర్దుకుపోవాల్సి వస్తుంటుంది. ఉదా. ఈ ఉదయం, షుమారు రెండు గంటల పాటు జరగబోయే ఒక మీటింగు ఉంది, ఆ తర్వాత మీ ప్రాజెక్టుపై మీరు పని చేయాల్సి ఉంది, అది మీ ఆఫీసులో చాలా కాలంగా పెండింగులో ఉన్న పని. ఆ తర్వాత మీరు చేయాల్సిన కొన్ని ఫోన్ కాల్స్ ఉన్నాయి. ఇలా ఒక పని తర్వాత మరొకటి, రోజుల తరబడి జరుగుతూనే ఉంటుంది. దీన్నే యాక్షన్ ఓరియెంటెడ్ (కర్మల ధ్యాస) అంటారు. నేను చాలా కష్టపడి పని చేస్తూనే ఉంటాను – విజయం సాధించాలి, నా సంబంధాలలో ప్రేమ, గౌరవం నిలవాలి, అలాగే నా మనసు కూడా ప్రశాంతంగా, తృప్తిగా ఉండాలని అనుకుంటాము. ఇవన్నీ చేస్తున్నప్పటికీ, నా శారీరక ఆరోగ్యం కూడా బాగుండాలి, నా జీవితంలోని  ఇతర క్షేత్రాలు కూడా బాగుండాలి. నా కోసం నేను గడపడం కూడా మర్చిపోకూడదు.

ఇలా, అనేక పనుల జాబితా ఒక్కోసారి మనల్ని అలసిపోయేలా చేస్తుంటాయి. పైన వివరించినది ఒక ఉద్యోగి యొక్క సాధారణ రోజు. మీరు గుర్తించేలోపే రోజు మొదలవుతుంది, పూర్తయిపోతుంది కూడా, ఫ్రీ టైమ్ ఉండనే ఉండదు. ఈరోజుల్లో, అందరి జీవితాలలో చేరిన మరో అంశం – ప్రయాణ సమయం. ఇవి కాక, ఆహారము, విశ్రాంతి, నిద్ర వంటి విషయాలు, నా నుండి అందరూ ఏమి ఆశిస్తున్నారో గమనించుకోవడం, వారి డిమాండ్లను తీర్చడం, తృప్తిపరచడం కూడా ఉంటాయి. ఇవన్నీ ఉండగా కూడా ఒక్కటి మాత్రం శాశ్వతంగా ఉంటుంది – నేను, ఆత్మను. నాలో ఉన్న ఆత్మిక ఖజానాలైన శాంతి, ప్రేమ, ఆనందం, శక్తులతో స్వయాన్ని స్థిరంగా, బలంగా ఉంచుకునే ఉపాయాన్ని ఆధ్యాత్మికత నేర్పింది. నా చుట్టూ ఉన్నది ఎప్పటికీ మారుతూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది, కానీ నేను మాత్రం స్థిరంగా ఉన్నాను. అంటే నేను ఒకే పాజిటివ్ స్థితిలో ఎప్పటికీ ఉంటాను. నేను ప్రతిస్పందించను, కేవలం స్పందిస్తాను. నేను కర్మ చేస్తాను కానీ కర్మల ధ్యాసలోనే ఉండను. నేను కర్మలు చేస్తూ ఆత్మిక స్థితిలో ఉంటాను…

 (సశేషం)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

19th april 2024 soul sustenance telugu

విజయానికి 8 మెట్లు (పార్ట్ 3)

విజయానికి మార్గం ప్రధాన మార్పులతో నిండి ఉంటుంది, దానిలో ప్రయాణీకులుగా మనం స్వీకరించగలగాలి మరియు మార్పులు మనలను ప్రతికూలంగా ప్రభావితం చేయకుండా ఎదుర్కోగలగాలి. ఆత్మిక బలం లేకపోవడం, మార్పులను ప్రతికూలంగా చూసే ధోరణి కారణంగా

Read More »
18th april 2024 soul sustenance telugu

విజయానికి 8 మెట్లు (పార్ట్ 2)

ఒక నిమిషం పాటు మీరు ఏమి ఆలోచిస్తున్నారో ఆపివేసి, మీ జీవితంలోని కొన్ని ముఖ్యమైన సంబంధాలను కోల్పోవడాన్ని మీరు పట్టించుకోనంతగా లక్ష్యం ముఖ్యమా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అలాగే, ఈ ప్రక్రియలో నేను

Read More »
17th april 2024 soul sustenance telugu

విజయానికి 8 మెట్లు (పార్ట్ 1)

మనమందరం ఉదయం నుండి రాత్రి వరకు చేసే వివిధ చర్యలతో నిండిన జీవితాన్ని గడుపుతున్నాము. వ్యక్తిగత, వృత్తిపరమైన, సామాజిక లేదా ఆర్థిక రంగాలలో ప్రతి చర్య నేను ఆశించిన దానిని సాధించాలనే ఉద్దేశ్యం లేదా

Read More »