Hin

16th Mar 2024 Soul Sustenance Telugu 1

March 16, 2024

కర్మలలో ఆత్మిక స్థితి (పార్ట్ 2)

చేయాల్సిన పనుల జాబితా చాలా ఉంటే, వ్యక్తిగత జీవితంలో కావచ్చు, వృత్తిలో కావచ్చు, ఇంకెందులోనైనా కావచ్చు, నన్ను నేను స్థిరంగా ఎలా పెట్టుకోవాలి? నేను ఎవరిని? భౌతిక అద్దంలో కనిపించే నా భౌతిక రూపమే నేను అనుకుంటున్నాను. అది కాకుండా, నా విద్య, యోగ్యత, వ్యక్తిత్వం, నైపుణ్యాలు మొదలైన వాటిని నేను అనుకుంటున్నాను. ఇది మన భౌతిక పరిచయం. కానీ, ఈ భౌతిక శరీరం లోపల, శరీరాన్ని నడిపించేది ఆంతరిక శక్తి, దానినే ఆత్మ అంటారు. సర్వ గుణాలు మరియు శక్తులకు మూలము ఆత్మ. ఆత్మలో భాగమైన మనసులో ఈ గుణాలను, శక్తులను నేను అనుభూతి చెందుతున్నాను అంటే నేను ప్రశాంతంగా, సంతృప్తిగా ఉన్నానని అర్థం. కానీ జరుగుతున్నదేమిటంటే, మనం మన పనులను ప్రారంభించినప్పుడు, మన ఆత్మతో మనం కనెక్షన్‌ను కోల్పోతున్నాము. మనం భౌతిక స్థాయిలో పని చేస్తూ, మనలోని ఆధ్యాత్మిక సత్తాను గుర్తించడం లేదు.

 

ఈ గుణాలు మరియు శక్తులను నా స్మృతిలోకి తీసుకువచ్చి, తర్వాత వాటిని నా కర్మలలోకి తీసుకురావాలంటే ఒక సులభమైన పద్ధతి ఉంది – నేను శాంత స్వరూప ఆత్మను, నేన ప్రేమ స్వరూప ఆత్మను, నేను శక్తిశాలి ఆత్మను అని స్వయానికి గుర్తు తెప్పించుకుంటూ ఉండటం. ఈ స్మృతి మనల్ని అలా తయారు చేస్తుంది. వీటినే పాజిటివ్ సంకల్పాలు అంటారు. ఎంతగా నేను ఈ గుణాలు మరియు శక్తులను కర్మలలోకి తీసుకువస్తానో అంతగా నా కర్మలు పద్ధతిగా అవ్వడమే కాక నేను వాటిలో అతిగా మునిగిపోను. నేను కర్మలను సరిగ్గా చేస్తాను, ఎందుకంటే నా మనసు ఏకాగ్రతతో, సంపూర్ణంగా ఉంది. దీనినే ఆత్మిక స్థితి అంటారు. కర్మల ధ్యాసకన్నా ఇది చాలా ఉన్నతమైన మానసిక స్థితి.

 (సశేషం)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

[drts-directory-search directory="bk_locations" size="lg" cache="1" style="padding:15px; background-color:rgba(0,0,0,0.15); border-radius:4px;"]

రికార్డు

18th May 2025 Soul Sustenance Telugu

భగవంతుడు మనతో ఉన్న అనుభూతిని పొందడం వల్ల కలిగే 5 లాభాలు (పార్ట్ 5)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు భగవంతుడు మనతో ఉన్నప్పుడు, మనం మంచిని ప్రసరింపజేస్తాము మనం ఇతరులకు ఎంత మంచిని ప్రసరింపజేస్తాము అనేది మానవ జీవితంలో చాలా ముఖ్యమైన

Read More »
17th May 2025 Soul Sustenance Telugu

భగవంతుడు మనతో ఉన్న అనుభూతిని పొందడం వల్ల కలిగే 5 లాభాలు (పార్ట్ 4)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు భగవంతుడు మనతో ఉన్నప్పుడు, మన అంతర్గత శక్తులు పెరుగుతాయి మానవ ఆత్మలకు ఒక సార్వత్రిక అవసరం ఆధ్యాత్మిక శక్తి, ఇది నేడు

Read More »
16th May 2025 Soul Sustenance Telugu

భగవంతుడు మనతో ఉన్న అనుభూతిని పొందడం వల్ల కలిగే 5 లాభాలు (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు భగవంతుడు మనతో ఉన్నప్పుడు, జీవితానికి మరింత ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజు మనం మన జీవితాన్ని వివిధ రకాలుగా ఆస్వాదిస్తున్నాము. ఐదు

Read More »