Hin

17th mar 2024 soul sustenance telugu 1

March 17, 2024

కర్మలలో ఆత్మిక స్థితి (పార్ట్ 3)

మనం కొన్నిసార్లు కర్మల ధ్యాసలో ఉండిపోతాము, కర్మలు చేయించేది అంతరంలో ఉన్న ఆత్మ అన్న విషయాన్ని మర్చిపోతున్నాము. చేతులు పనులను చేస్తున్నట్లుగా కనిపిస్తుంది, చెవులతో వింటాము, కళ్ళతో చూస్తాం అనుకుంటాము, కానీ గుర్తుంచుకోండి, కర్మలు సమతుల్యంగా ఉండాలన్నా, పాజిటివ్ మరియు పావర్‌ఫుల్ స్థితి ఉండాలన్నా, ఉపరామ స్థితి ఉండాలన్నా ఒక్క విషయాన్ని మర్చిపోకూడదు. చేతులు, నాలుక, కళ్ళు, చెవులు అన్నీ ఆత్మ నియంత్రణలో అనగా నా నియంత్రణలో ఉంటాయి. నేను ఫలానా Mr. లేక Ms కాదు. నేను ధరించిన ఈ శరీరం అనే వస్త్రం పేరు అది. నిజమైన నేను ఒక అదృశ్య శక్తిని, ఆధ్యాత్మిక సత్తాను, అభౌతికమైన కాంతిని – ఆత్మను.

ఈ విధమైన ఆత్మిక స్థితితో, నేను ఉపరామంగా ఉంటూ నేను చేసే పనులను, మాటలను చూస్తాను. పనులలో మునిగిపోయి చింతలోకి రాకూడదు. కొన్నిసార్లు పనులు సరిగ్గా జరగకపోవచ్చు, వ్యక్తులు మనపట్ల నెగిటివ్‌గా ఉండవచ్చు, మన శరీరం ఆరోగ్యంగా ఉండకపోవచ్చు. చేయాల్సిన పనులు చాలా ఉండవచ్చు. ఒక్కోసారి ఇవన్నీ జరుగుతాయి. అయితే మనం ఆత్మ అభిమాని స్థితిలో ఉంటే, ఆత్మ స్మృతిలో ఉంటే, మన ఆత్మిక గుణాలు, శక్తులను గుర్తుంచుకుంటే, మనం ప్రశాంతంగా, నియంత్రణలో ఉంటాము. కనుక, కష్టపడండి, ప్రేమ మరియు సంతోషాలు నిండిన చక్కని సంబంధాలను కలిగి ఉండండి, ప్రతి క్షేత్రంలో ఎదుగుతూ ఉండండి. అలాగే, అంతర్ముఖంగా మరియు ఉపరామంగా ఉండటంలో సమతుల్యతను పాటించండి. ఇదే సంతృప్తికి, ఒత్తిడిలేని జీవితానికి ముఖ్యము. ఇటువంటి జీవితం ప్రశాంతతతో, ఆత్మ గౌరవంతో నిండి ఉంటుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

14th jan 2025 soul sustenance telugu 2

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 2)

మనలాగే, భగవంతుని ఆధ్యాత్మిక రూపం కూడా భౌతిక కళ్ళకు కనిపించని ఉన్నతోన్నతమైన జ్యోతిర్బిందువని తెలుసుకున్న తరువాత, ఎలా మనం భగవంతుడిని అర్థం చేసుకొని వారితో ఎలా అనుసంధానించగలము అనేదానికి బ్రహ్మా కుమారీల 7 రోజుల

Read More »
13th jan 2025 soul sustenance telugu 3

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 1)

మనమందరం భగవంతుడి నుండి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకుంటూ ప్రతిరోజూ ధ్యానాన్ని అభ్యసించే ఆధ్యాత్మిక విద్యార్థులం. ధ్యానం అంటే భగవంతునితో ఆధ్యాత్మిక అనుసంధానం. ఆధ్యాత్మిక జీవితంలోని ఈ రెండు అంశాలతో  అనగా ఆధ్యాత్మిక జ్ఞానం మరియు

Read More »
12th jan 2025 soul sustenance telugu

మనం మంచితనపు వైబ్రేషన్లను కలిగి ఉన్నామని తెలిపే 5 గుర్తులు

  మనమందరం ప్రపంచంలో మంచి ఆత్మలం. ఈ ప్రపంచ నాటకంలో ప్రతి ఒక్కరికీ మంచితనాన్ని ప్రసరింపజేసే పాత్ర మనది. మంచితనపు వైబ్రేషన్ అంటే  మనం ఎక్కడికి వెళ్లినా, ఎవరితో సంభాషించినా ప్రతి ఒక్కరూ మన

Read More »