Hin

2nd june2024 soul sustenance telugu

June 2, 2024

కఠిన  పరిస్థితుల కోసం జ్ఞానం- (నథింగ్ న్యూ) కొత్తేమీ కాదు 

చాలా సార్లు కొత్త ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు, ఇది మునుపటి పరిస్థితుల కంటే చాలా కష్టంగా అనిపించి, ఈసారి పరిస్థితిని అధిగమించడం సులభం కాదని మనకు అనిపిస్తుంది.  ఎందుకు అలా ఉంటుంది?  అలాగే, మన మనస్సు రాబోయే వైఫల్యాల ఆలోచనలతో నిండిపోతుంది. మనపై, జీవితంపై మరియు భగవంతునిపై మనకున్న విశ్వాసం చెదురుతుంది. అకస్మాత్తుగా జీవితం చీకటితో నిండినట్లు అనిపిస్తుంది. మన జీవితంలో ఆ పరిస్థితి రాకముందు ఉన్నంత సంతోషంగా మనం ఉండము. అలాగే, మనం ఇతరులతో ఉత్సాహంగా సంభాషించము, కొన్నిసార్లు మన ఆరోగ్యం, వ్యక్తిగత మరియు వృత్తిపరమైన పని కూడా ప్రతికూలంగా ప్రభావితమవుతుంది. దీనికి పరిష్కారం ఏమిటి? ఇలాంటి  ప్రతికూల పరిస్థితుల నుండి మనం ఎలా నేర్చుకొని, మనల్ని మనం శక్తివంతం చేసుకొని,   భయపడకుండా నేర్చుకున్న దానిని ఎలా ఉపయోగించుకోవాలి?  అలాగే, ఈ సానుకూల మరియు శక్తివంతమైన మానసిక స్థితిని స్థిరంగా ఎలా ఉంచుకోవచ్చు? 

అలాంటి పరిస్థితుల్లో గుర్తుంచుకోవడానికి భగవంతుడు ఇచ్చిన జ్ఞానం ‘(నథింగ్ న్యూ)కొత్తేమీ కాదు’. కొత్తేమీ కాదు అంటే గతంలో ఎన్నో కష్టతరమైన ప్రతికూల పరిస్థితులను దాటిన అనుభవంతో నేను నా మనసును నింపుకున్నాను. ఆ అనుభవం ఆధారంగా ఈ పరిస్థితి నాకు కొత్త కాదు. భగవంతుని సహాయంతో, నేను వాటిని ఎలా దాటానో నాకు తెలుసు. ఇప్పుడు కూడా అలాగే దాటుతాను. నేను మళ్ళీ నా చర్యలను రిపీట్ చేస్తున్నాను. ఫలితం ఖచ్చితంగా సానుకూలంగా ఉందని నాకు ముందే తెలుసు. ఈసారి కూడా భగవంతుడు నాకు సహాయం చేస్తాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. సానుకూల తుది ఫలితం నుండి నన్ను వేరు చేసే ఏకైక విషయం సమయం. సహనం విజయానికి మార్గం. నేను ఆ దారిలో వెళ్తూ, దారిలో వచ్చే పరిస్థితి యొక్క వివిధ దశల గురించి బాధపడను. కొన్ని దశలు అనుకూలంగా ఉండవచ్చు,  కొన్ని అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. కానీ నా గత అనుభవం ఆధారంగా, ప్రతి దశ దాటిపోతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. నేను భగవంతుని స్మరణలో, సహనం యొక్క మార్గంలో మాత్రమే ముందుకు సాగాలి.  నేను భగవంతుని ఎంత ఎక్కువ స్మరిస్తే భగవంతుని సహాయాన్ని అంతగా పొందుతాను. పరిస్థితిని పరిష్కరించే పూర్తి బాధ్యత వారిదే. పరిస్థితి వచ్చినప్పుడు భగవంతుని మార్గదర్శకత్వం ప్రకారమే నేను పని చేస్తున్నాను. పరిస్థితుల యొక్క అన్ని అంశాల గురించి నా కంటే బాగా వారికి తెలుసు. వారు చాలా వివేకవంతులు కాబట్టి నాకు ఏది ఉత్తమమో వారికి తెలుసు. నేనెప్పుడూ విజేతనే, మళ్లీ విజయాన్నే పొందుతాను.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

16th feb 2025 soul sustenance telugu

చక్కటి సంబంధాలను బలపరుచుకోవడానికి అహంకారాన్ని త్యాగం చేయడం (పార్ట్ 2)

మీరు మరొక వ్యక్తిని కలిసినప్పుడల్లా, మీరు మీలాగే ఉండాలి అని నిర్ధారించుకుంటూ, అదే సమయంలో ఎదుటి వ్యక్తిని కూడా వారిని వారిలానే ఉండనివ్వడం ద్వారా మీరు వారికీ ఒక స్వేచ్చని కలిపిస్తారు. దాని అర్థం

Read More »
15th feb 2025 soul sustenance telugu

చక్కటి సంబంధాలను బలపరుచుకోవడానికి అహంకారాన్ని త్యాగం చేయడం (పార్ట్ 1)

సంబంధాలు జీవితానికి ప్రాధమిక నిధి, కానీ సంబంధంలో ఏ వ్యక్తిలోనైనా అహం పెరిగినప్పుడు అవి తప్పుడు మార్గంలో వెళ్తాయి. వ్యక్తులు ఎల్లప్పుడూ వినయపూర్వకమైన వారితో సంతృప్తి చెందుతారని మీరు కనుగొంటారు. అలాగే అహంకారం లేని

Read More »
14th feb 2025 soul sustenance telugu

విశ్వసించండి. ఇక మీరు విజయం సాధిస్తారు

మీరు మీ పెద్ద లేదా చిన్న లక్ష్యాల గురించి చాలా ఉత్సాహంగా ఉంటూ వాటిని చేరుకోవడానికి చాలా కష్టపడ్డారా… కానీ ఎక్కడో ఒక చోట విజయం సందేహాస్పదంగా అనిపించిందా? అది ఫలితాన్ని ఎలా ప్రభావితం

Read More »