Hin

18th may 2024 soul sustenance telugu

May 18, 2024

కోల్పోయిన స్వర్గాన్ని తిరిగి పొందడం (పార్ట్ 2)

ప్రపంచ చరిత్రలోకి తిరిగి వెళ్దాం. మనం రికార్డ్ చేసిన చరిత్ర గురించి మాత్రమే మాట్లాడుకోవటం లేదు. ప్రపంచంలోని మన చరిత్ర పుస్తకాల్లో లేని ఆ క్షణాల గురించి మాట్లాడుకుందాం. ఆ క్షణాల గురించి పూర్తిగా చాలా ఖచ్చితంగా తెలిసిన వారు ఎవరు? మనలో ఎవరూ లేరు ,ఆ సమయంలో ఈ ప్రపంచంలో పాత్రను అభినయించకుండా చూసిన వారు మాత్రమే. భగవంతుడు ఆ సమయాన్ని చూసారు. ప్రపంచంలో జరిగిన ఆ సన్నివేశాల్లో మనం పాత్ర పోషించడం చూసారు. ఆ సమయాన్ని  ప్రపంచంలోని వివిధ మతాలు మరియు దేశాలలో వివిధ పేర్లతో – పారడైస్, హెవెన్, స్వర్గం, జన్నత్ అని అంటారు. మన రికార్డులో ఉన్న చరిత్రకు ముందు ఈ ప్రపంచం ఉండి ఉంది.  అది మానవుల యొక్క ఏడు ప్రాథమిక గుణాలు – శాంతి, సుఖం , ప్రేమ, ఆనందం, స్వచ్ఛత, శక్తి మరియు సత్యత సంపన్నత ఉన్న ప్రపంచం. అలాగే, మానవ ఆత్మలు ఈ గుణాలతో నిండి ఉన్నందున, ప్రతికూల చర్యలు చేయనందున వారు ఎప్పుడూ దుఃఖాన్ని అనుభవించలేదు. పేదరికం, అనారోగ్యం యొక్క జాడ లేకుండా సంపద మరియు ఆరోగ్యం కూడా పూర్తి సానుకూలతతో ఉన్న ప్రపంచం ఇది.

ఇది భగవంతునిచే సృష్టించబడిన ప్రపంచం. అందుకే భగవంతుడిని హెవెన్లీ గాడ్ ఫాదర్ అని కూడా అంటారు. వారు సృష్టించిన ప్రపంచాన్ని హెవెన్ అని అంటారు. ఈ ప్రపంచంలో, మానవుల మధ్య పూర్తి ఐక్యత మరియు ప్రేమ ఉండేది . ఎటువంటి యుద్ధాలు,  ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడూ జరగలేదు. ప్రకృతి పూర్తిగా స్వచ్ఛంగా ఉండడమే దీనికి కారణం. అలాగే, ప్రకృతిలోని పంచ తత్వాలతో తయారైన భౌతిక శరీరాలు చాలా అందంగా, స్వచ్ఛంగా ఉండటమే కాకుండా ఎలాంటి వ్యాధి లేదా అనారోగ్యం ఉండేది కాదు. జంతువులు కూడా పూర్తి సామరస్యంతో  మరియు శాంతితో జీవించాయి. అలాగే, ఈ ప్రపంచంలో జనాభా చాలా తక్కువగా ఉండేది, అందరూ పవిత్రంగా ఉండేవారు. ఇది ఎన్నడూ అంతగా చెప్పుకోబడని, వ్రాయబడని చరిత్ర. ఇది మన గ్రంథాలలో లేదా శాస్త్రాలలో మాత్రమే ప్రస్తావించబడింది.

(సశేషం…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

[drts-directory-search directory="bk_locations" size="lg" cache="1" style="padding:15px; background-color:rgba(0,0,0,0.15); border-radius:4px;"]

రికార్డు

9th july 2025 soul sustenance telugu

ఆరోగ్యకరమైన వర్క్-లైఫ్ బ్యాలన్స్ ను సాధించడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితం ఒక ప్రవాహంవంటిది, కనుక, మనం మన బాధ్యతల ప్రాధాన్యతలను మారుస్తూ ఉండాలి, మనకు మద్దతు ఇచ్చే జీవితంలోని అన్ని అంశాల

Read More »
8th july 2025 soul sustenance telugu

ప్రేమను ఆపేక్షలతో సమానం చేయకండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన స్వభావాలు, విలువలు, లక్ష్యాలకు అనుగుణంగానే ఇతరులు ప్రవర్తించాలని మనం సాధారణంగా కోరుకుంటాం. ఎవరైనా మన అంచనాలకు తగ్గట్లుగా ఉంటే, వారు

Read More »
7th july 2025 soul sustenance telugu

గతాన్ని వదిలేసేందుకు 7 పద్ధతులు (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సరిదిద్దుకోవటం – ఆత్మలో జ్ఞాపకాలు ఆత్మపై ముద్రలు వంటివి. కొన్ని ముద్రలు లోతైనవి, కొన్ని కాకపోవచ్చు. గత నెగిటివ్ అనుభవాలు ఆత్మపై

Read More »