Hin

19th may 2024 soul sustenance telugu

May 19, 2024

కోల్పోయిన స్వర్గాన్ని తిరిగి పొందడం (పార్ట్ 3)

పగలు రాత్రి చక్రం మరియు నాలుగు ఋతువుల చక్రం గురించి మనందరికీ తెలుసు. పగలు తర్వాత ఎల్లప్పుడూ రాత్రి, ఆ తర్వాత పగలు అనుసరించబడతాయి. నాలుగు కాలాలు  ఎల్లప్పుడూ ప్రతి సంవత్సరం రిపీట్ అవుతాయి. అదే విధంగా, ప్రపంచంలో సంతోషపు పగలు గతంలో ఉండేది. ఆ తర్వాత దుఃఖపు రాత్రి వచ్చింది. నిజానికి ప్రపంచం కూడా నాలుగు దశలను దాటింది – ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మరియు రాత్రి. ప్రపంచం ఈ దశల గుండా వెళుతున్న కొద్దీ, దుఃఖం పెరుగుతూ ఆనందం తగ్గుతూ వచ్చింది. వాస్తవానికి, ప్రపంచ చరిత్రలో మొదటి రెండు దశలు,  పూర్తి ఆనందంగా ఉన్నాయి. ఇది వ్రాయబడని చరిత్ర, భగవంతునికి మాత్రమే తెలిసిన నిజమైన జ్ఞానం. ఈ రెండు దశలను స్వర్గం అని అంటారు లేదా తరచుగా మానవాళికి పగలుగా సూచిస్తారు. చివరి రెండు దశల్లో ప్రతికూల కర్మలు జరుగుతూ మానవ ధర్మాల పతనం అకస్మాత్తుగా కాకపోయినా క్రమంగా జరిగింది. ఈ రెండు దశలను తరచుగా నరకం లేదా మానవాళికి రాత్రి అని అంటారు.

ఆత్మలు పునర్జన్మలను తీసుకుంటూ, వారు తమ అసలైన ఆధ్యాత్మిక గుర్తింపును మరచిపోయారు. బదులుగా భౌతిక శరీరాన్ని తమ గుర్తింపుగా పరిగణించడం ప్రారంభించారు. ఈ తప్పుడు గుర్తింపు ఆత్మలను వివిధ రకాల బలహీనతలు లేదా ప్రతికూల వ్యక్తిత్వ లక్షణాల ప్రభావంలోకి వచ్చేలా చేసింది. నేను ఆత్మను అని మరచి నేను ఉంటున్న ఈ శరీరాన్నే నేను అనుకునే తప్పుడు నమ్మకం ఏర్పడింది. ఈ విధంగా మనం పాపం, దుఃఖంలోకి  రావడం ప్రారంభించి, ఇప్పడు మానవాళికి రాత్రి యొక్క చివరిలోకి  వచ్చాము. నేడు, అపారమైన సాంకేతిక పురోగతి ఉన్నప్పటికీ, ప్రపంచంలో మానసిక , శారీరిక, సంపద, సంబంధాలు మరియు బాధ్యతల దుఃఖం చాలా ఉంది. పాపం కూడా దాని గరిష్ట స్థాయికి చేరుకుంది. అలాగే, ఈరోజు ప్రపంచంలోని చాలా మంది మనం ఇంత కన్నా దిగజారలేమని భావిస్తున్నారు. ఈ సమయంలో భగవంతుడు ప్రపంచాన్ని మార్చడంలో మరియు మానవాళికి పగలును తిరిగి తీసుకురావడంలో తన పాత్రను నిర్వహిస్తున్నారు ఎందుకంటే కాల చక్రం దానంతటదే రిపీట్ అవుతుంది. పగలు తర్వాత రాత్రి మళ్లీ రాత్రి తర్వాత పగలు వస్తాయి. బ్రహ్మా కుమారీల లక్ష్యం కూడా ఇదే – ప్రపంచాన్ని మార్చడం,  ప్రపంచాన్ని జీవించడానికి అందమైన, సంతోషకరమైన స్థానంగా  మార్చడం మరియు కోల్పోయిన స్వర్గాన్ని తిరిగి పొందడం.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

22nd june2024 soul sustenance telugu

మీ మనస్సు ఒక బిడ్డ వంటిది

మనస్సు మన బిడ్డలాంటిది. మనం మన బాధ్యతలను నిర్వర్తిస్తున్నప్పటికీ, మీలో ఉన్న ఈ బిడ్డ  శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలి. మనం దానిని ప్రేమించాలి, పాలన చేయాలి మరియు ఓదార్చాలి. మనుష్యులు తమ మనస్సుపై నియంత్రణ

Read More »
21st june2024 soul sustenance telugu

మనుష్యుల వైబ్రేషన్లను అనుభూతి చెందడం ప్రారంభించండి

మీరు ఎవరినైనా కలిసినప్పుడు, మీ దృష్టి ఎటు వెళుతుంది? ఒకటి: వారి రూపం మరియు వస్త్రాలు పై మీ దృష్టి వెళుతుంది. రెండు: వారి మాటలు మరియు చేతల పై దృష్టి వెళుతుంది. ఇపుడు

Read More »
20th june2024 soul sustenance telugu

పోటీ పడటం మానండి… ఈ క్షణాన్ని ఆస్వాదించండి (పార్ట్ 4)

మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు సమతుల్య మనస్సును ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం. కోపం, ఆవేశం, అహం లేదా దురాశ మన ఆలోచనలలో అసమతుల్యతను సృష్టించవచ్చు. మనల్ని మనం మనలాగే అనుభవం చేసుకున్నప్పుడు మరియు

Read More »