Hin

4th jan 2025 soul sustenance telugu

January 4, 2025

కోపాన్ని అధిగమించడం – విజయానికి 5 ఉపాయాలు (పార్ట్ 2)

  1. నేను అనంతమైన శాంతి మరియు ప్రేమకు మూలం అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి – మనమందరం శాంతి మరియు ప్రేమకు మంచి వనరులం. వీటిని మనం సదా అనుభవం చేసుకుంటూ ఇతరులతో పంచుకోవచ్చు. అలాగే, శాంతి, ప్రేమ ఉన్న చోట, వివిధ రకాల వ్యక్తులు మరియు పరిస్థితులను సహించే శక్తి మనలో ఉంటుంది. ఇది హింసాత్మకంగా స్పందించే బదులు ప్రశాంతంగా, ఓపికగా ఉండటానికి సులభతరం చేస్తుంది. ఎవరినైనా ద్వేషించడం, వారి వెనుక లేదా వారి ముందు ఎవరికైనా వ్యతిరేకంగా మాట్లాడటం అనేది శాంతి మరియు ప్రేమ లేకపోవడాన్ని ప్రతిబింబిస్తుంది. వాటితో మనం అనాదిగా నిండి ఉన్నాము , కానీ మనం దానిని మరచిపోతాము. ఈ క్రింది ధృవీకరణతో మీ రోజును ప్రారంభించండి: నేను జ్యోతిర్బిందువును, శాంతి మరియు ప్రేమతో నిండిన ఆత్మను. నేను నా ఆధ్యాత్మిక రూపాన్ని, నుదిటి మధ్యలో మెరిసే నక్షత్రంగా విజువలైజ్  చేస్తున్నాను. నేను ఈ మధురమైన ప్రకాశాన్ని ప్రపంచానికి ప్రసరింపజేస్తున్నాను. ఈ ధృవీకరణను రోజంతటిలో చాలాసార్లు మీకు మీరే రిపీట్ చేసుకోండి. నెమ్మదిగా కోపాన్ని, హింసాత్మక ప్రతిస్పందనలను సృష్టించే వ్యక్తిత్వం వ్యక్తులు మరియు పరిస్థితులకు మధురమైన, మరింత వినయపూర్వకమైన ప్రతిస్పందనలగా మార్చబడుతుంది. 

 

  1. క్షమించండి మరియు మరచిపోండి – మీరు ఎప్పుడైనా మరొక వ్యక్తి యొక్క ప్రతికూల చర్యల గురించి ఆలోచిస్తూ, మీ మనస్సులో వారి వివిధ రూపాలను సృష్టించుకుంటూ రోజంతా గడిపారా, ఇవన్నీ ప్రతికూలంగా ఉండటమే కాకుండా అంతర్గతంగా మిమ్మల్ని బాధిస్తాయి. మీ హృదయంలో అలాంటి బాధ ప్రతి అడుగులోనూ కోపానికి మూలంగా మారి, మీ మనస్సును హింసాత్మకంగా చేస్తుంది.  మీకు మరియు ఇతర వ్యక్తులకు సంబంధించిన పరిస్థితులలో ఈ రకమైన కోపం బయటపడవచ్చు, అది కోపానికి కారణమైన వ్యక్తి కానవసరం లేదు. క్షమించడానికి, మరచిపోవడానికి భావోద్వేగ బలం అవసరం. కోపంతో ప్రతిస్పందించకుండా ప్రేమతో ప్రతిస్పందించడం అనేది చర్యలో కూడా క్షమించినట్టు. క్షమించడం అంటే బేషరతుగా ప్రేమించడం. మరచిపోవడం అంటే తనకు తానే ప్రయోజనం పొందడం. ఎందుకంటే మరచిపోకపోవడం వల్ల కలిగే మనస్సులోని హింస అనేది మనస్సు, శరీరం మరియు సంబంధాలకు విపరీతమైన హాని కలిగిస్తుంది. మీరు క్షమించినప్పుడు మాత్రమే మీరు మరచిపోగలరు. క్షమించడానికి, ప్రతి ఒక్కరి అసలైన వ్యక్తిత్వం శాంతి మరియు ప్రేమ అని గుర్తుంచుకోండి. ఎవరిదైనా ప్రతికూల వ్యాఖ్య లేదా చెడు కర్మ అనేది వారు సంతరించుకొన్న ప్రతికూల సంస్కారం యొక్క ఫలితం. ఇది తాత్కాలికమైనది మరియు అవతలి వ్యక్తి దానిని తొలగించడానికి ప్రయత్నిస్తున్నాడని గుర్తుంచుకోండి.

 

(సశేషం…)

రికార్డు

16th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మెడిటేషన్ ని మీ ఔషధంగా చేసుకొని ఆ ఔషధాన్ని ప్రతి రోజు తీసుకోండి మెడిటేషన్ మన మనస్సును మరింత శక్తివంతంగా చేసి

Read More »
15th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు రోజంతా మీ ఆలోచనలను జాగ్రత్తగా పరిశీలించుకోండి   మన భావోద్వేగ ఆరోగ్యం అనేది ముఖ్యంగా మన ఆధ్యాత్మిక ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది.

Read More »
14th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనమందరం మానవాత్మలం అనగా మొదట ఆత్మలం, ఇది మన ఆధ్యాత్మిక గుర్తింపు. మనం మన భౌతిక శరీరం ద్వారా మన పాత్రను

Read More »