Hin

5th jan 2025 soul sustenance telugu

January 5, 2025

కోపాన్ని అధిగమించడం – విజయానికి 5 ఉపాయాలు (పార్ట్ 3)

  1. నేనే కరెక్ట్ అనే భావాన్ని విడిచిపెట్టండి – కోపంతో నిండిన సంబంధాలకు అత్యంత ముఖ్యమైన కారణాలలో ఒకటి, నేను సరైనవాడిని, అవతలి వ్యక్తి తప్పు అనే అహంభావం. అహంకారం ఎంత ఎక్కువగా ఉంటే, కోపం కూడా అంత ఎక్కువగా ఉంటుంది. చాలా తరచుగా కుటుంబంలో లేదా కార్యాలయంలో చాలా మూడీగా ఉండి, ఎల్లప్పుడూ ఇతరులపై అరుస్తూ,  వారిని తప్పుగా చూసే వ్యక్తులు చాలా అహంభావులు. అలాగే, కోపం యొక్క చాలా సాధారణ మరియు ప్రతికూల రంగుల్లో ఒకటి వ్యంగ్యం – వ్యక్తుల చర్యలపై వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం, నేను అనుకున్నది మరియు చేసేదే ఉత్తమమైనది, సరైనది అని ఎల్లప్పుడూ ఆలోచించడం. మరోవైపు, తన అహంభావాన్ని త్యాగం చేసే వ్యక్తి, అవతలి వ్యక్తి నిజంగానే కొన్ని తప్పులు చేసినప్పటికీ, పరస్పర చర్యలలో చాలా మధురంగా మరియు దయతో ఉంటాడు. ఇతరులను అతిగా విమర్శించకుండా అమాయకులుగా చూడటానికి చాలా సులభమైన పద్ధతి ఏమిటంటే మనం ప్రతిరోజూ కలిసే ప్రతి వ్యక్తిలో కనీసం ఒక ప్రత్యేకతను చూడటం. ఈ రకమైన సానుకూల దృష్టి మనల్ని కోపం నుండి విముక్తి చేస్తుంది. చాలా ప్రతికూల పరిస్థితులలో కూడా మనం వ్యక్తులను సానుకూలంగా చూస్తాము మరియు వారి లోపాలు, బలహీనతలపై దృష్టి పెట్టము.
  2. కోపం లేకుండా ఉండటానికి ఒత్తిడి లేకుండా ఉండండి – జీవితం అనేక రకాల ప్రతికూల పరిస్థితులు, మలుపులతో నిండి ఉంటుంది. ఇవి కొన్ని సమయాల్లో మనల్ని అస్థిరంగా చేస్తూ ఒత్తిడికి గురిచేస్తాయి. ఒత్తిడి ప్రధానంగా మన మనస్సులో అనేక సార్లు వచ్చే ఎందుకు, ఏమి, ఎప్పుడు, ఎలా అనే ప్రశ్నల వల్ల వస్తుంది. మనస్సు ప్రశ్నలతో మరియు పరిష్కరించని సమస్యలతో ఎంత ఎక్కువగా నిండి ఉంటే, అంత ఎక్కువగా మనస్సు విషపూరిత పదాలు మరియు చర్యల రూపంలో  స్పందిస్తుంది. సమస్యలు ఎల్లప్పుడూ ఉంటాయి, కానీ వాటికి మనం వశమైనందు వలన మరియు అవి సరైన సమయంలో, సరైన పద్ధతిలో పరిష్కరించబడటానికి వేచి ఉండటంలో అసహనం కోపానికి దారితీస్తుంది. చాలా సందర్భాల్లో కోపం అనేది ఒత్తిడికి ఒక రూపం మాత్రమే, ఇది ఎప్పటికప్పుడు బయట పడుతుంది. మెడిటేషన్ యొక్క అభ్యాసం ఫలితంగా వచ్చే సానుకూల ఆలోచనలు మనస్సు యొక్క ఒత్తిడిని పరిష్కరించే పద్ధతులు.  కోపం నుండి విముక్తి అనేది ఒత్తిడి నుండి విముక్తిని ద్వారానే వస్తుంది.

రికార్డు

23rd june 2025 soul sustenance telugu

ప్రతిరోజును ఫిర్యాదు లేని రోజుగా చేసుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు ఒక వ్యక్తి లేదా పరిస్థితి గురించి మనం చివరిసారిగా ఎప్పుడు ఫిర్యాదు చేసాము? చాలా కాలమయ్యి ఉండకపోవచ్చు… నిన్ననే కావచ్చు. మన

Read More »
22nd june 2025 soul sustenance telugu

పరమ గురువు అయిన పరమాత్మ నుండి దీవెనలు తీసుకోవడానికి 5 మార్గాలు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు పరమాత్మునితో సైలెంట్ అపాయింట్‌మెంట్‌తో మీ రోజును ప్రారంభించండి – ప్రతిరోజూ తెల్లవారుజామున, మిమ్మల్ని మీరు ఒక ఆత్మగా భావించి పవిత్రమైన నిశ్శబ్ద

Read More »
21st june 2025 soul sustenance telugu

ప్రశంసలు మరియు విమర్శలలో స్థిరత్వం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు ప్రశంసలు మన అహంభావాన్ని పెంచితే, విమర్శించినప్పుడు మనం ఖచ్చితంగా కలత చెందుతాము. ప్రశంసలు లేదా విమర్శల వల్ల ప్రభావితం కాకుండా మనం

Read More »