Hin

19th-oct-2023-soul-sustenance-telugu

October 19, 2023

కోపాన్ని అణిచివేస్తున్నారా? అసలు దానిని సృష్టించకండి

మన అసలైన స్వభావం కోపం కాదు. పరిస్థితులు మనకు అనుకూలించనప్పుడు పదేపదే కోపంగా ఉండటం ద్వారా, మనం దానిని ఖచ్చితమైన ప్రతిచర్యగా చేసుకుంటాము. మనము దానిని వ్యక్తపరుస్తాము, తిరస్కరిస్తాము లేదా ఉత్తమంగా అణిచివేస్తాము. కోపం అలవాటుగా మారింది, అయితే శుభవార్త ఏమిటంటే, మనం దశల వారీ విధానాన్ని తీసుకొని ముందుగా నియంత్రించవచ్చు తరువాత దానిని అంతం చేయవచ్చు.

  1. సహనం మరియు శాంతి వలె కోపం మన ఎంపిక. మనం అధికార వ్యక్తులతో లేదా సీనియర్‌లతో కోపాన్ని ఎన్నుకోము కానీ ఇతరులపై కోపంగా ఉండే స్వేచ్ఛను మనము ఇచ్చుకుంటాము. ప్రతిఒక్కరితో ఓపికగా ఉండటానికి ప్రతిరోజూ ఉదయం మెడిటేషన్ చేయండి.
  2. ప్రారంభంలో మనం ప్రతిస్పందించడానికి టెంప్ట్ అవ్వచ్చు, కానీ మన కోపాన్ని వ్యక్తం చేయకూడదు. మనం కోపాన్ని బయటకు తెచ్చినప్పుడు, అవతలి వ్యక్తి కూడా అలాగే స్పందిస్తారు. ఆపై మనం మరింత ప్రతిస్పందిస్తాము మరియు అవతలి వ్యక్తి కూడా అలాగే స్పందిస్తారు. కోపం యొక్క పరిమాణం రెట్టింపు అవుతుంది.
  3. మనకు మనం చెప్పుకుందాము. నేను శక్తివంతుడను. వారు చేసిన దానికి కారణం ఉందని నేను అర్థం చేసుకున్నాను. నన్ను నేను రక్షించుకోవడానికి మరియు వారికి సాధికారమివ్వడానికి నేను వారితో సహనం మరియు అంగీకారాన్ని ఉపయోగిస్తాను. ఇది అణచివేయడం కాదు, మీరు కోపాన్ని బయట అంతం చేసినప్పుడు, క్రమంగా అది లోపల కూడా అంతమవుతుంది.
  4. అంగీకారం, అర్థం చేసుకోవటం మరియు ప్రశాంతత యొక్క వైబ్రేషన్స్ తో కరెక్షన్స్ ఇవ్వడానికి ఒక వ్యక్తిని గుర్తించండి. మీ అంతర్గత స్థిరత్వం మీకు మరియు వారికి ఎలా ప్రయోజనం చేకూరుస్తుందో గమనించండి. ఒకసారి మీరు ఒక వ్యక్తితో సహనాన్ని ఎంచుకుంటే, రేపు మరో 2 వ్యక్తులతో అదే పునరావృతం చేయండి, ఆపై ఆలా పెంచుకుంటూ వెళ్ళండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

23rd jan 2025 soul sustenance telugu

పరీక్షలను ఎదుర్కోవడంలో విజయానికి 8 సూత్రాలు (పార్ట్ 3)

పరీక్షలను ఎదుర్కొంటున్నప్పుడు, చదివే సమయంలో దృష్టి కేంద్రీకరించే మీ సామర్థ్యాన్ని మరియు ఏకాగ్రతని ఎల్లప్పుడూ తనిఖీ చేయండి. నేను అధ్యయనం పూర్తి చేయడానికి లేదా నా కోర్సులో ఒక అధ్యాయాన్ని సవరించడానికి చాలా సమయం

Read More »
22nd jan 2025 soul sustenance telugu

పరీక్షలను ఎదుర్కోవడంలో విజయానికి 8 సూత్రాలు (పార్ట్ 2)

పరీక్షల సమయంలో  లేదా జీవితంలో ఏదైనా సవాలును ఎదుర్కొంటున్నప్పుడు స్థిరంగా ఉండటానికి చాలా ముఖ్యమైన మార్గం అంతర్గత శాంతి, శక్తి , స్థిరత్వంతో నిండిన కొన్ని సానుకూల ఆలోచనలను చేస్తూ రోజులో కొన్ని సార్లు

Read More »
21st jan 2025 soul sustenance telugu

పరీక్షలను ఎదుర్కోవడంలో విజయానికి 8 సూత్రాలు (పార్ట్ 1)

మనమందరం మన ముందు ఎల్లప్పుడూ వివిధ రకాల సవాళ్లతో మన జీవితాలను గడుపుతాము. మనమందరం ఏదో ఒక సమయంలో ఎదుర్కొనే సవాళ్లలో లేదా మన పిల్లలు ఎదుర్కొనే అత్యంత ముఖ్యమైన సవాళ్లలో ఒకటి పాఠశాల

Read More »