Hin

6th jan 2025 soul sustenance telugu

January 6, 2025

కృతజ్ఞతతో కూడిన డైరీ రాయడం

మనమందరం మన జీవితంలో అనేక అందమైన ప్రాప్తులతో ఆశీర్వదించబడ్డాము. ఈ ప్రాప్తులను పొందినందుకు మనం సంతోషిస్తూ విశ్వానికి మరియు మన చుట్టూ ఉన్న అందరికీ వారు మనల్ని ఆశీర్వదించినందుకు మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలుపుతాము. మనం భగవంతునికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాము. ఎందుకంటే వారిని స్మరించుకోవడం ఈ ప్రాప్తులను పొందడానికి మరియు వాటిని అనుభవించడానికి మనకు సహాయపడింది. ప్రాప్తులు జీవితం యొక్క చిన్న మైలురాళ్ళు మరియు మంచి విషయాలు. ఇవి కొన్నిసార్లు వాటంతట అవే కలుగుతాయి మరియు కొన్నిసార్లు కొంత ప్రయత్నంతో కలుగుతాయి. అవి భౌతికమైనవి కావచ్చు అలాగే భౌతికం కానివి కావచ్చు. కృతజ్ఞత డైరీ అనేది ఒక చిన్న డైరీ, దానిని మనం పెట్టుకుని మన జీవితంలోని మంచివాటిని  ప్రతిరోజూ అందులో వ్రాసుకోవచ్చు. మనం ప్రతిరోజూ 3-5 విషయాలు వ్రాయవచ్చు, నాకు ఆనందాన్ని ఇవ్వడానికి, నా జీవితంలో ఈ రోజు జరిగిన వాటి గురించి కూడా. అది భగవంతుడు నాకు బహుమతిగా ఇచ్చినవి కావచ్చు, నాకు సన్నిహితుడైన వ్యక్తి నాకు ఇచ్చినవి కావచ్చు లేదా ప్రకృతి నాతో పంచుకున్నవి కావచ్చు.

 

అలాగే, నేను ఎప్పటికప్పుడు నా కృతజ్ఞతా డైరీని చూసుకుంటూ ఉండాలి. నేను ఒక నెల క్రితం, ఒక సంవత్సరం క్రితం లేదా కొన్ని సంవత్సరాల క్రితం వ్రాసిన దాని పాత పేజీలను చదవాలి. ఎందుకంటే జీవితం యొక్క మంచితనం గురించి మనం ఎంత ఎక్కువగా తెలుసుకుంటూ దానిని మనం మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటామో, అంతగా మన వద్ద ఉన్న దాని గురించి మనం సంతోషంగా ఉంటూ మన వద్ద లేని దాని గురించి అసంతృప్తిగా ఉండము. జీవితం కొన్నిసార్లు మనకు కష్టమైన మరియు ప్రతికూల పరిస్థితులను ఇస్తుంది. అప్పుడు మనం కొన్నిసార్లు నిరాశకు గురవుతూ విచారంగా ఉంటూ ఉండవచ్చు, కానీ మన కృతజ్ఞత డైరీ మనం ఎంత అదృష్టవంతులమో గుర్తు చేస్తుంది. మనందరికీ ఎన్నో ఉన్నందున జీవితం ఎంత అందంగా ఉందని మన హృదయంలో లోతుగా అనుభవం చేస్తూ చిరునవ్వుతో ఉండటం గుర్తు చేస్తుంది. ప్రతి వ్యక్తి మంచి వారు, ప్రతి పరిస్థితి అది ప్రతికూలమైనప్పటికీ అది ప్రయోజనకరంగా ఉంటుంది కావున అదీ మంచిదే, జీవితంలోని ప్రతి క్షణం అందంగా ఉంటుంది. తప్పకుండా, మన అతి ప్రియమైన వారైన భగవంతుడు చాలా అందంగా ఉంటారు. ఎందుకంటే వారు సదా మనతో మంచిగా, ఉదారభావం మరియు దయ కలిగి ఉంటారు.

రికార్డు

16th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మెడిటేషన్ ని మీ ఔషధంగా చేసుకొని ఆ ఔషధాన్ని ప్రతి రోజు తీసుకోండి మెడిటేషన్ మన మనస్సును మరింత శక్తివంతంగా చేసి

Read More »
15th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు రోజంతా మీ ఆలోచనలను జాగ్రత్తగా పరిశీలించుకోండి   మన భావోద్వేగ ఆరోగ్యం అనేది ముఖ్యంగా మన ఆధ్యాత్మిక ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది.

Read More »
14th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనమందరం మానవాత్మలం అనగా మొదట ఆత్మలం, ఇది మన ఆధ్యాత్మిక గుర్తింపు. మనం మన భౌతిక శరీరం ద్వారా మన పాత్రను

Read More »