Hin

26th feb 2024 soul sustenance telugu

February 26, 2024

కృత్రిమత్వం మరియు తారుమారుని అధిగమించండి

మనం సంతోషంగా ఉండటానికి ఇతరులను సంతోషపెట్టాలని నమ్ముతూ, మన తప్పులను దాచుకోవాలని, మనల్ని మనం పరిపూర్ణంగా చూపించుకోవాలని చూస్తాము. అలా చేస్తున్నప్పుడు మన వాస్తవికతను మరియు చిత్తశుద్ధిని కోల్పోతాము. సత్యంగా ఉండాలని మరియు మన మనస్సులో ఉన్నదాన్ని తెలియజేయాలని కోరుకుంటాము కానీ కొన్నిసార్లు విఫలమవుతాము. ఇతరలను మెప్పించడం కోసం మనం నటించడం లేదా తారుమారు చేస్తూ ఉంటాము. ఇతరులను మోసం చేయడం కంటే మనల్ని మనం మోసం చేసుకుంటాం.

 

  1. మీ ప్రవర్తనల్లో కృత్రిమత్వం ఉందా అని చెక్ చేసుకోండి. లోపల బాధ పడుతూ బయటకు చిరునవ్వు నవ్వుతూ ఉంటారా? మీ వ్యక్తిత్వానికి అనుగుణంగా లేని విధంగా మిమ్మల్ని మీరు చూపించుకుంటున్నారా? లేదా మీరు – నేను ఇలా చెప్పాలా లేదా వద్దా … అని ఆలోచిస్తున్నారా? కృత్రిమత్వం మీ అంతర్గత శక్తిని బాగా క్షీణింపజేస్తుంది.

 

  1. మీ మాటలు మీ భావాలకు భిన్నంగా ఉన్న ప్రతిసారీ, మీరు మీ అంతర్గత శక్తిని క్షీణింపజేస్తున్నారు. మీరు మీ ఆలోచనలను అణచివేసి, సరిగ్గా ఉన్న పదాలను మాట్లాడతారు. పదాల స్థాయిలో కాకుండా కానీ వాటిని నాణ్యమైన మాటలుగా చేయడానికి మీ ఆలోచనలను మార్చుకోండి.

 

  1. స్వచ్ఛత, పరిపూర్ణత గల మీ నిజ స్వభావాన్ని అర్థం చేసుకొని గుర్తించడానికి ప్రతి ఉదయం మెడిటేషన్ మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అధ్యయనం చేయండి. ప్రతి పరస్పర చర్యలో, మీరు సరైన ఆలోచనలను సృష్టిస్తారని వాగ్దానం చేసుకోండి. అప్పుడు మీరు మీ సత్యత లో ఉండే శక్తిని పెంచుకుంటారు.

 

  1. మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి మరియు మీరు చెప్పేది చేయండి. మీరు మీరుగా ఉన్నప్పుడు, మీరు ఇతరులను వారిలాగే అంగీకరిస్తారు. జీవితం సరళంగా మారుతుంది మరియు సత్యాన్ని జీవించడానికి మీరు తేలికగా భావిస్తారు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

7th dec 2024 soul sustenance telugu

పాత్ర-ప్రేరేపిత ఒత్తిడిని నివారించండి – ఇది ఒక పాత్ర మాత్రమే

చాలా పాత్రలు పోషించవలసి ఉన్నందున, మనం ఒత్తిడిని సహజంగా అంగీకరించాము. పాత్ర అభిమానం మన పదవి, విజయాలు మరియు వయస్సు ఆధారంగా ప్రదర్శించేలా చేస్తుంది. మనం కొన్నిసార్లు మన పాత్రలు, సంబంధాలు మరియు పదవుల

Read More »
6th dec 2024 soul sustenance telugu

అందమైన, స్వేచ్ఛాయుతమైన ప్రపంచాన్ని సృష్టించుకుందాం

వివిధ దేశాల నుండి వచ్చిన, వివిధ భాషలు మాట్లాడే, వివిధ మతాలను అనుసరించే, జీవితంలోని వివిధ రంగాలలో వివిధ రకాల చర్యలను నిర్వహించే కోట్లమంది మానవులతో నిండిన ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. భగవంతుడు మన

Read More »
5th dec 2024 soul sustenance telugu

ప్రతి కర్మపై ధ్యాస పెట్టడం

మన ప్రతి ఆలోచన, మాట మరియు చర్య మనం ప్రపంచానికి పంపే శక్తి, ఇది మన కర్మ. పరిస్థితులు, వ్యక్తుల ప్రవర్తనలు అనేవి తిరిగి వచ్చే శక్తి, ఇది మన విధి. ప్రతి కర్మ

Read More »