Hin

20th feb 2024 soul sustenance telugu

February 20, 2024

క్షమించే ప్రపంచాన్ని తయారు చేద్దాం (పార్ట్ 1)

క్షమించే ప్రపంచాన్ని తయారు చేయాలని పరమాత్మ మన నుండి ఆశిస్తున్నారు, ఆ ప్రపంచంలో ఎవ్వరూ ఎవ్వరినీ విమర్శించరు, ఇతరుల పొరపాట్లపై, బలహీనతలపై ప్రతికూల దృష్టిని ఉంచరు. వ్యక్తులలో భిన్న స్వభావాలు, అలవాట్లు ఉన్నప్పటికీ ఈ విశ్వంలో సంపూర్ణ శాంతి మరియు సామరస్యం ఉంటాయి.

ఆధ్యాత్మిక జ్ఞానం మరియు అవగాహన ఆధారంగా, క్షమించడంలో ఉన్న వివిధ రంగుల గుణాలను, వాటిని సరిపోలే అనుభవయుక్త కర్మలను మీ ముందు ఉంచుతున్నాము –

ఔదార్యము – ఇతరులు చేసిన పొరపాట్లను మర్చిపోవడం

నిష్కాపట్యత – ఇతరులను అంగీకరించడం

కృతజ్ఞత – ఆశీర్వాదాలు ఇవ్వండి ఆశీర్వాదాలు తీసుకోండి

ప్రేమ – విమర్శా రహితంగా ఉండటం

సహనము – ఇతరుల బలహీనతలపై కఠిన దృష్టి లేకుండా ఉండటం

అంగీకరించడం – ఇతరుల సుగుణాలను ధారణ చేయడం

ఇవ్వడం – ఇతరులను సుగుణాలతో నింపడం

ఈ వివిధ సుగుణాల అనుభూతిని పొందడం అంటే, క్షమించడంలోని ఈ వివిధ రంగులను ధారణ చేయడం, ఇందుకోసం మనలో శాంతి, ప్రేమ మరియు సత్యత కావాలి. ఈ మూడు శక్తులు కలిపి క్షమించడం అనే లేపనంగా అవుతాయి, ఇవి మనలో నిండి ఉన్న కోపంతో కూడిన ఆలోచనలు, భావాలు మరియు భావోద్వేగాలను నయం చేసి తద్వారా మనలోని అశాంతియుత మాటలను, చేతలను కూడా నయం చేస్తాయి.

(సశేషం…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

20th march 2025 soul sustenance telugu

సంబంధాల్లో కలిగే బాధ నుండి విముక్తిని పొందడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితంలోని వివిధ రంగాలలో వేర్వేరు సంబంధాలలోకి వచ్చినప్పుడు, కొన్నిసార్లు మన అంతర్గత ప్రపంచంలోకి మరొక ఆత్మను అనుమతించినప్పుడు, మనల్ని వారు అర్థం

Read More »
19th march 2025 soul sustenance telugu

జీవితంలోని వివిధ దృశ్యాలలో సాకులు చెప్పడం మానుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలా మంది మన విశ్వసనీయతను కాపాడుకోవడానికి, ఇతరులపై లేదా పరిస్థితులపై నిందలు వేయడానికి సాకులు చెబుతారు. కొన్నిసార్లు మనకు, మన

Read More »
18th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు అంతర్గత బలం యొక్క సానుకూల సంస్కారాలను సృష్టించడానికి, మనం ముందుగా పట్టుదల యొక్క మొదటి అడుగు వేయాలి. పట్టుదల అంటే నేను

Read More »