Hin

21st feb 2024 soul sustenance telugu

February 21, 2024

క్షమించే ప్రపంచాన్ని తయారు చేద్దాం (పార్ట్ 2)

క్షమాపణ కోపాన్ని తగ్గించే లేపనం అని మనందరికీ బాగా తెలుసు. కానీ క్షమించడానికి, రెచ్చగొట్ట బడినప్పుడు అవసరమైన మొదటి, ప్రధానమైన శక్తి నా కఠినమైన భావోద్వేగాలకు ఫుల్-స్టాప్ పెట్టగలగటం. వివిధ వ్యక్తిత్వాలతో పరస్పర చర్య చేస్తున్నప్పుడు మరియు పనులలో బిజీగా ఉన్నప్పుడు, ఆలోచనలు విస్తరించి భావోద్వేగాల నదిలా ఏర్పడుతుంది. ప్రతి గంటకు ఒక నిమిషం, నా భావోద్వేగాల నియంత్రణ, ఆ ఆలోచనల విస్తారానికి ఒక ఆనకట్టను నిర్మించడం లాంటిది. గంట క్రితం చర్య ప్రతికూలంగా, సంఘర్షణతో ఉన్నప్పుడు, పరిస్థితి మరింత దిగజారుతుంది. కాబట్టి, ప్రతి గంటలో , ఒక నిమిషం మెడిటేషన్, మనస్సును శాంతితో నింపుతుంది. సులభంగా క్షమించడానికి మనస్సును మొదట ఇలా తయారు చేసుకోవాలి. మీరు రచించగల కొన్ని ఆలోచనలను సూచిస్తున్నాము – నేను శాంతి స్వరూపాన్ని, భృకుటి మధ్యలో ఉన్న అందమైన బంగారు-తెలుపు నక్షత్రాన్ని. నేను నా చుట్టూ శాంతి కిరణాలను వ్యాప్తి చేస్తాను. నేను శాంతి సాగరుడు అయిన పరమాత్మ సంతానాన్ని. నా కుటుంబంలో, కార్యాలయంలో మరియు ప్రపంచంలోని వారందరూ కూడా శాంతి సాగరుని పిల్లలే, వారి స్వభావం మొదట శాంతియుతంగా ఉంటుంది. మనమందరం కలిసి, సమిష్టిగా, మన ఇంట్లో, కార్యాలయంలో మరియు విశ్వమంతటా శాంతి వాతావరణాన్ని సృష్టించాలి, తద్వారా మనమందరం క్షమించే ప్రపంచాన్ని సృష్టించగలము.

ఈ విధంగా ప్రతిరోజూ 15 నిమిషాల శాంతిని (ప్రతి గంటకు ఒక నిమిషం) జమ చేసుకోవటం చాలా విలువైనది. మీకు ఈ 15 నిమిషాలు మీ మనస్సులో నిర్మించుకోవాల్సిన ఆనకట్ట యొక్క ఇటుకలు.  ఇవి  కఠినమైన భావోద్వేగాలను అదుపులో ఉంచుతాయి. ఒక నెలపాటు మానస్పూర్వకంగా, స్వపరివర్తన కొరకు దృఢమైన సంకల్పంతో దీన్ని ప్రయత్నించండి. ఈ శాంతి-ఇటుక మీ భావోద్వేగాలను నియంత్రించడమే కాకుండా భావోద్వేగ నదీ యొక్క మూలాలకు ఉపశమనం కలిగిస్తూ భావోద్వేగ ప్రవాహ వేగాన్ని నిదానపరుస్తుంది. ఉదాహరణకు, కోపము అనే సంస్కారాన్ని పరివర్తన చేసి క్షమించే సంస్కారాన్ని తెస్తుంది. ఎందుకంటే శాంతి సంకల్పాలు మన ఎమోషన్లను కొద్ది కాలం వరకు శాంతితో నింపడమే కాకుండా బహు కాలానికి మన సంస్కారాలను శాంతియుతంగా చేస్తాయి

(సశేషం…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

18th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 6)

బ్రహ్మా కుమారీలకు  కొత్తగా వచ్చినవారు అడిగే ఒక సాధారణ ప్రశ్న ఏమిటంటే, మనం కేవలం ధ్యానం మాత్రమే ఎందుకని నేర్చుకోలేము? ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వివరించే 7 రోజుల కోర్సు యొక్క వివిధ సెషన్లకు మనం

Read More »
17th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 5)

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు భారతదేశంలోని వివిధ నగరాలు, పట్టణాలు మరియు గ్రామాలలోని అన్ని బ్రహ్మా కుమారీల కేంద్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా 120 కి పైగా దేశాలలో ఉన్న కేంద్రాలలో నిర్వహించబడుతుంది. ఈ

Read More »
16th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 4)

ప్రపంచ నాటకం యొక్క తదుపరి 2 యుగాలు అనగా తదుపరి 2500 సంవత్సరాలలో స్వర్గంలో దైవిక మానవుల చేతనంలో ఉన్న దేవతలు,  ఆత్మిక స్మృతి  నుండి శారీరిక స్మృతికి  మారినప్పుడు, వారు స్వయాన్ని దేవి

Read More »