Hin

22nd feb 2024 soul sustenance telugu

February 22, 2024

క్షమించే ప్రపంచాన్ని తయారు చేద్దాం (పార్ట్ 3)

కోపాగ్ని ఉన్న ఇంటిలో నీటి కుండలు కూడా ఎండిపోతాయని భారతదేశంలో ఒక సామెత ఉంది. కోపం మానవ స్పృహలో ఉన్న చాలా కోరికల యొక్క సేకరణ కారణంగా మనల్ని క్షమించనివ్వకుండా నిరోధించడానికి ఇవ్వబడిన పేరు. క్షమించే వాతావరణాన్ని సృష్టించడంలో రెండవ దశ ఏమిటంటే మన మనస్సులోని భావోద్వేగాలను ప్రేమతో నింపడం మరియు సూక్ష్మమైన కోరికల భావోద్వేగాలను శాంతింపజేయడం. ఇది మనం ఎక్కడ ఉన్నా చేయవచ్చు. మన జీవితంలో ఉన్న అనేక కోరికలు లేని ప్రపంచాన్ని ఊహించుకోండి – నాకు అవసరం, నాకు కావాలి, నా స్వంతం, నేను ఆశిస్తున్నాను, నాదే ఒప్పు, నేను అసూయపడతాను – ఇవి స్వచ్ఛమైన ఆత్మిక ప్రేమ యొక్క శక్తిని కాల్చే సూక్ష్మ మంటలు. ఆత్మిక ప్రేమ మనలో సహజంగానే ఉంటుంది, ఎందుకంటే మనం ప్రేమ సాగరుడైన భగవంతుని పిల్లలం.

కాబట్టి ఉదయాన్నే నిద్రలేచి, ఈ ప్రేమ సాగరునికి శుభోదయంతో రోజును ప్రారంభించడం, హృదయపూర్వక సంభాషణ, వారితో లోతైన ప్రేమపూర్వక కలయిక, సంపూర్ణ విశ్వంతటిలోనే అత్యంత  స్వచ్ఛమైన ప్రేమతో నన్ను నింపుకోవడం, వివిధ అహం-ఆధారిత భావోద్వేగాల నుండి నా మనస్సుని శుభ్రపరిచే మార్గాన్ని సుగమం చేస్తుంది. అలాగే, క్షమించే గుణంగా మారడానికి దోహదపడుతుంది. ఎందుకంటే నేను నా మనస్సుని భగవంతుని ప్రేమతో ఎంత ఎక్కువగా నింపుకుంటానో, అంత ఎక్కువగా నేను ఆత్మిక ప్రేమతో మరింత సుసంపన్నంగా, మధురంగా, వినయంగా అవుతాను. అంతగా మారిన నేను , అందరి హృదయాలను గెలుచుకోగలుగుతాను, నా చుట్టూ ప్రేమ మరియు క్షమించే వాతావరణాన్ని సృష్టించగలను.

(సశేషం…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

17th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 5)

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు భారతదేశంలోని వివిధ నగరాలు, పట్టణాలు మరియు గ్రామాలలోని అన్ని బ్రహ్మా కుమారీల కేంద్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా 120 కి పైగా దేశాలలో ఉన్న కేంద్రాలలో నిర్వహించబడుతుంది. ఈ

Read More »
16th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 4)

ప్రపంచ నాటకం యొక్క తదుపరి 2 యుగాలు అనగా తదుపరి 2500 సంవత్సరాలలో స్వర్గంలో దైవిక మానవుల చేతనంలో ఉన్న దేవతలు,  ఆత్మిక స్మృతి  నుండి శారీరిక స్మృతికి  మారినప్పుడు, వారు స్వయాన్ని దేవి

Read More »
15th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 3)

ఆత్మ మరియు భగవంతుని జ్ఞానాన్ని పంచుకున్న తరువాత, బ్రహ్మా కుమారీల 7 రోజుల పరిచయ కోర్సు ప్రపంచ నాటకం అంటే ఏమిటి మరియు అది 4 యుగాలతో ఎలా రూపొందించబడిందో మనకు బోధిస్తుంది –

Read More »