Hin

2nd feb 2024 soul sustenance telugu

February 2, 2024

లోపల మరియు వెలుపల విజయాన్ని సృష్టించండి

మీరు ఎంత విజయవంతమయ్యారు అనే దానిపై మీరు ఈ రోజు ఆత్మపరిశీలన చేసుకుంటే, మీరు ఏ అంశాలను చూస్తారు – మీరు సాధించినవి, మీ ఆస్తులు మరియు హోదాలు? …లేదా మీరు మీ స్వాభావికమైన మంచి లక్షణాలను మరియు సద్గుణాలను లెక్కించారా? మనము ఎల్లప్పుడూ విజయం కోసం బయట అవకాశాల కోసం చూస్తాము. కానీ విజయం అంటే నేను అనగా ఒక చైతన్య జీవిగా “నేను ఎవరిని?” అని కేవలం నా పనులు మాత్రమే కాదు. శాంతి, ప్రేమ మరియు ఆనందం వంటి  సుగుణాలను  ఉపయోగించిన ప్రతిసారీ, మనం విజయవంతులమే. మనము సహకరించిన ప్రతిసారీ, దయ చూపిన ప్రతీ సారి లేక మంచి సంబంధాలు ఏర్పరచుకున్న ప్రతీ సారి మనం విజయవంతులమే. మనం ఏదో సాధించలేకపోయాం కాబట్టి విఫలమయ్యాం అని ముద్ర వేసుకోకూడదు. విచారం, అసంతృప్తి, భయం మరియు నిందలు విజయానికి అడ్డంకులు. అంతేకాకుండా, మన మెదడు మరియు శరీరం దానిని వాస్తవంగా అంగీకరిస్తాయి తద్వారా వైఫల్యాలు రిపీట్ అవుతాయి. మనం అంతర్గతంగా విజయం సాధించినప్పుడు, మనం సరిగ్గా ఆలోచించగలము, మాట్లాడగలము మరియు  ప్రవర్తించగలము. మన అంతర్గత శక్తి మన కోరికలకు అనుగుణంగా మారి భౌతిక విజయాన్ని సృష్టిస్తుంది. “నేను శక్తివంతమైన జీవిని. నేను చేయాలనుకున్నది ఏదైనా చేయగలను. నా విజయం ఖాయం.” అని నమ్మి పలకండి.

 

విజయం అనే పదం గురించి మనందరికీ మన స్వంత నమ్మకాలు మరియు నిర్వచనాలు ఉన్నాయి. మనలో చాలా మంది విజయం  ఆనందాన్ని ఇస్తుందని భావించాము, ఎందుకంటే మనము ఎల్లప్పుడూ మన విజయాలలో ఆనందం కోసం వెతికాము. కాబట్టి, నేను విజయవంతమైన కార్పొరేట్ ప్రొఫెషనల్‌గా ఉండాలనుకుంటున్నాను అని మనతో మనం మాట్లాడుకున్నాము, నా ఖాతాలో ఇంత  మొత్తం ఉన్నప్పుడు నన్ను నేను విజయవంతంగా పరిగణిస్తాను  …. అని అనుకున్నాము. అర్హత, హోదా, సంబంధాలు, శారీరక ఆరోగ్యం, సామాజిక హోదా, గుర్తింపు, బ్యాంక్ బ్యాలెన్స్, ఆస్తి మొదలైన వాటి ఆధారంగా మనము విజయాన్ని చూసాము. విజయం రెండు విధాలు – ఒకటి బాహ్యమైన అంశాలలో, రెండు మన భావోద్వేగ స్థిరత్వం, భావోద్వేగ సౌలభ్యం, ఆనందం మరియు సంతృప్తి పరంగా విజయం. బయట విజయం సాధిస్తే లోపల కూడా సంతోషంగా ఉంటామని లేదు. కానీ మనం సంతోషంగా ఉన్నప్పుడు, మనం ఎల్లప్పుడూ సంతృప్తిగా ఉంటాము. ఈ శక్తి మనకు బయట విజయవంతం కావడానికి సహాయపడుతుంది. కాబట్టి ఈరోజు, మీరు సమర్ధత గురించి మీకు ఉన్న పరిమిత నమ్మకాలను వదిలివేయండి. మీ ఆశావాద అభిప్రాయాలు మరియు అంతర్గత శక్తి విజయాన్ని సృష్టించేందుకు అనుకూలమైన వ్యక్తులను మరియు పరిస్థితులను ఆకర్షిస్తుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

9th sep 2024 soul sustenance telugu

గందరగోళం కాకుండా స్పష్టత కలిగి ఉండండి

శాంతి మరియు స్థిరత్వంతో కూడిన జీవితాన్ని గడపడానికి స్పష్టత కలిగి ఉండటం కీలకం. కానీ ఎలా ఉండాలి, ఏం చేయాలి లేదా ఏ దిశలో అడుగు పెట్టాలి అని మనం తరచుగా ఆలోచిస్తూ ఉంటాము.

Read More »
8th sep 2024 soul sustenance telugu

గణేష్ చతుర్థి యొక్క దివ్యత మరియు ఆధ్యాత్మికత (పార్ట్ 2)

శ్రీ గణేషుని పెద్ద ఉదరము ఇముడ్చుకునే శక్తిని సూచిస్తుంది. వ్యక్తుల బలహీనతలు మరియు వారి తప్పుడు చర్యల గురించి మనం ఇతరులతో మాట్లాడకూడదు. శ్రీ గణేషుని చేతిలో గొడ్డలి, తాడు మరియు కమలం చూపిస్తారు,

Read More »
7th sep 2024 soul sustenance telugu

గణేష్ చతుర్థి యొక్క దివ్యత మరియు ఆధ్యాత్మికత (పార్ట్ 1)

ఈ సంవత్సరం గణేష్ చతుర్థిని సెప్టెంబర్ 7 నుండి 17 వరకు జరుపుకుంటారు. శ్రీ గణేషుని జననం యొక్క నిజమైన అర్ధాన్ని మనం అర్థం చేసుకుంటాము. శ్రీ పార్వతీ దేవి స్నానం చేయాలనుకొని గేటు

Read More »