Hin

Maanasika alasatanu adhigaminchdaaniki 5 chitkaalu (part 1)

November 9, 2024

మానసిక అలసటను అధిగమించడానికి 5 చిట్కాలు (పార్ట్  1)

మనం బిజీగా ఉంటూ చేయవలసిన పనులు చాలా ఉన్న వేగవంతమైన జీవనశైలి మనలో చాలా మందికి ఉంది. అయినప్పటికీ మనందరికీ క్రమం తప్పకుండా మౌనం మరియు అంతర్ముఖత అవసరం. కాబట్టి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవలసిన మంచి ప్రశ్న ఏమిటంటే, నేను ఆలోచనలతో నిండిన మనస్సును ఇష్టపడుతున్నానా లేదా తక్కువ ఆలోచనలతో వాటి మధ్య ఎక్కువ ఖాళీలు ఉన్న మనస్సును ఇష్టపడుతున్నానా? ఒకప్పుడు, ఒక దేశం నుండి మరొక దేశానికి కాలినడకన ప్రయాణించే వ్యక్తుల సమూహం ఉండేది. వారు చాలా బరువులు తమ భుజంపై మోసేవారు. అది అలసిపోయే ప్రయాణం. వారు తమ గమ్యస్థానానికి చేరుకునే సమయానికి, చాలా శక్తిని కోల్పోయి వారి ఉత్సాహం కనిష్ట స్థాయికి చేరుకునేది. వారి పని వస్తువులను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తీసుకెళ్లడం. తక్కువ శారీరక బరువుతో ఉన్న జీవితాన్ని ఎవరు కోరుకోరు? అదే విధంగా, మన భావోద్వేగ వాహకాలు మన ఆలోచనల భారాన్ని మోసుకెళ్లే మన మనస్సులు. ఆలోచనలు ఎంత తక్కువగా, తేలికగా ఉంటే, మన మనస్సులు అంత తేలికగా, ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటాయి. మన మనస్సులను తేలికగా మరియు ఎల్లప్పుడూ ఆనందంతో ఎగురుతూ ఉంచడానికి ఐదు పద్ధతులను చూద్దాం :

  1. ఒక సమయంలో ఒక ఆలోచనను సృష్టించండి – ఆత్రుతగా, భయంతో నిండిన మనస్సు ఆ సమయంలో అవసరమైన దానికంటే ఎక్కువగా, వేగంగా ఆలోచిస్తుంది. అటువంటి మనస్సు కొన్నిసార్లు ప్రతికూల మరియు తప్పుడు భవిష్యత్ వాస్తవాలను సృష్టిస్తుంది. ఇంకా సంభవించని సమస్యలను పరిష్కరించడానికి ఊహిస్తూ ఆలోచనల సంఖ్యను పెంచుతుంది. కానీ అవి సంభవించవచ్చని మనస్సు భయపడుతుంది. ఇది మనం సాధారణంగా ప్రతికూలంగా ఆలోచించే విషయం. మరోవైపు, సానుకూల ఆలోచన అంటే పూర్తి ఆశ మరియు దృఢత్వంతో భవిష్యత్తు కోసం సానుకూల దృశ్యాలను విజువలైజ్ చేయడం. మనం అన్ని రకాల పరిస్థితులలో క్రమం తప్పకుండా ఇలా చేసినప్పుడు, మన మనస్సు నెమ్మదిస్తూ ప్రతి ఆలోచన ఒక చిన్న అణువు లాగా ఉంటుంది. ఇది మనస్సు లోపల కూర్చుని మనల్ని ప్రశాంతంగా, హాయిగా, ఎటువంటి భారం లేకుండా ఉంచుతుంది.

(సశేషం…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

5th dec 2024 soul sustenance telugu

ప్రతి కర్మపై ధ్యాస పెట్టడం

మన ప్రతి ఆలోచన, మాట మరియు చర్య మనం ప్రపంచానికి పంపే శక్తి, ఇది మన కర్మ. పరిస్థితులు, వ్యక్తుల ప్రవర్తనలు అనేవి తిరిగి వచ్చే శక్తి, ఇది మన విధి. ప్రతి కర్మ

Read More »
4th dec 2024 soul sustenance telugu

ప్రతికూల పరిస్థితులను 3 దశల్లో పరిష్కరించడం (పార్ట్ 3)

స్టెప్ 3 – పరిష్కారానికి సానుకూల చర్యలు తీసుకోవడం – మూడవ దశ మరియు చాలా ముఖ్యమైనది పరిస్థితిని సరిచేయడానికి భౌతిక స్థాయిలో సానుకూలంగా ఏదైనా చేయడం. కొన్నిసార్లు, మనం సానుకూలంగా ఆలోచించి భగవంతుడిని

Read More »
3rd dec 2024 soul sustenance telugu

ప్రతికూల పరిస్థితులను 3 దశల్లో పరిష్కరించడం (పార్ట్ 2)

స్టెప్ 2 – సానుకూలమైన మరియు శక్తివంతమైన మానసిక స్థితిని సృష్టించడం – ఏదైనా ప్రతికూల పరిస్థితిని పరిష్కరించడంలో తదుపరి దశ ఆధ్యాత్మిక ధృవీకరణలు లేదా ఆంతరిక శక్తి, దృఢత్వంతో నిండిన ఆలోచనల సహాయంతో

Read More »