Hin

Maanasika alasatanu adhigaminchdaaniki 5 chitkaalu (part 2)

November 10, 2024

మానసిక అలసటను అధిగమించడానికి 5 చిట్కాలు (పార్ట్  2)

  1. తప్పనిసరి అయితేనే ఇతరుల గురించి ఆలోచించండి – అవసరం లేనప్పుడు, ముఖ్యమైనది కానప్పుడు కూడా ఇతరుల గురించి ఆలోచించడం అనేది మనందరికీ ఉన్న ఒక సాధారణ అలవాటు. మీ కార్యాలయంలోని ఒక వ్యక్తి తన అవసరమైన సామర్థ్యానికి అనుగుణంగా బాగా పని చేయలేదని, అతని పని సామర్థ్యం మీ కంపెనీ పనితీరును నేరుగా ప్రభావితం చేస్తుందని అనుకుందాం. అతన్ని సరిదిద్దడం, కంపెనీలోని సరైన వ్యక్తులతో అతని పని గురించి మాట్లాడటం కూడా సాధారణమే. మీరు అలా చేసిన తర్వాత, మీరు అతన్ని చూసిన ప్రతిసారీ అతని గురించి ప్రతికూలంగా ఆలోచించాలా లేదా కంపెనీలోని ప్రతి వ్యక్తితో అతని గురించి ప్రతికూలంగా మాట్లాడటం కొనసాగించాలా, దీనిని వ్యర్థమైన లేదా  అనవసరమైన చర్చ అని అంటారు. మన జీవితంలో ఇలాంటి వారు చాలా మంది ఉంటారు. ప్రతి కుటుంబ సభ్యుడు, స్నేహితుడు మరియు కార్యాలయ సహోద్యోగి గురించి ప్రతికూలతతో నిండిన భారీ ఆలోచనలు మనలో ఉంటే, అది అలసటగా ఉండదా? కాబట్టి పూర్తి విరామాన్ని ఇవ్వండి. అనవసరమైన ప్రశ్నార్ధకాలాను, ఆశ్చర్యార్థాకాలను మీ ఆలోచనలలో కూడా విడిచిపెట్టండి. మీ ఆలోచనలను తక్కువగా ఉంచండి. ఇతరుల గురించి ప్రతికూల ఆలోచనలకు బదులు వారి ప్రత్యేకతలు, గుణాలు మరియు నైపుణ్యాలతో పాటు సానుకూల వ్యక్తిత్వ సుగుణాల ఆలోచనలతో భర్తీ చేయండి. తద్వారా మీరు అలసిపోయి మానసిక అలసటను అనుభవించరు.
  2. మీ అహంభావాన్ని విడిచిపెట్టి స్వేచ్ఛగా జీవించండి – మనలో కొందరు మన భావోద్వేగ మనస్సులపై మోస్తున్న చాలా పెద్ద భారం మన సూక్ష్మ అహం. ఈ ఉదయం నా కళాశాలలో లేదా నా కార్యాలయంలో నా సహోద్యోగి నేను ధరించిన దుస్తులపై ప్రతికూలంగా వ్యాఖ్యానించింది. ఆమె వ్యాఖ్యానించింది, ఆ తరువాత రోజంతా నేను ఆమెను చూడలేదు, కానీ నేను ఆమె వ్యాఖ్యను నా మనస్సులో, హృదయంలో పెట్టుకుంటాను. అదేదో నన్ను ఇంతకు ముందు ఎవరూ అంతగా అవమానించనట్లుగా. మితిమీరిన అహం ఉన్న చోట, చాలా అవమాన భావన ఉంటుంది. ఎందుకు? ఎందుకంటే నేను నా సానుకూల ప్రతిరూపంతో చాలా అతుక్కుని ఉంటూ ఎవరైనా ఆ ప్రతిరూపాన్ని కొంచెం కూడా అగౌరవపరచడాన్ని నేను సహించలేను. కాబట్టి మధురంగా, వినయంగా మరియు దయతో ఉండండి. ఇతరుల వ్యాఖ్యల వల్ల ప్రతికూలంగా ప్రభావితం కాకుండా ప్రతి ఒక్కరినీ ప్రేమించే వ్యక్తిగా ఉండండి. వంగి, వినయంగా ఉంటే మీ రోజువారీ పరస్పర చర్యలలో అవమానకరమైన భావన యొక్క మీ మితిమీరిన ఆలోచనలు ఆగిపోతాయి. మీ మనస్సును తేలికగా ఉంచుతాయి. 

(సశేషం…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

[drts-directory-search directory="bk_locations" size="lg" style="padding:15px; background-color:rgba(0,0,0,0.15); border-radius:4px;"]

రికార్డు

11th july 2025 soul sustenance telugu

చెడు శకునాలు మరియు మూఢనమ్మకాల ప్రభావం నుండి అతీతంగా అవ్వండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు కొన్ని గ్రహాలు, ప్రదేశాలు, సంఖ్యలు, రంగులు, వస్తువులు, వ్యక్తులు మరియు భౌతిక శరీరాల వెలుపల సూక్ష్మ శరీరాలలో ఉండే కొన్ని ఆత్మల

Read More »
10th july 2025 soul sustenance telugu

నా భాగ్యానికి ఎవరు బాధ్యులు?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలామంది భగవంతుడు మన భాగ్యాన్ని వ్రాస్తాడని నమ్ముతాము. ఈ నమ్మకం గురించి  మనం ఆలోచించి ఆత్మపరిశీలన చేసుకోవాలి. భగవంతుడు మన

Read More »
9th july 2025 soul sustenance telugu

ఆరోగ్యకరమైన వర్క్-లైఫ్ బ్యాలన్స్ ను సాధించడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితం ఒక ప్రవాహంవంటిది, కనుక, మనం మన బాధ్యతల ప్రాధాన్యతలను మారుస్తూ ఉండాలి, మనకు మద్దతు ఇచ్చే జీవితంలోని అన్ని అంశాల

Read More »