Hin

31st dec 2023 soul sustenance telugu

December 31, 2023

మానసిక కల్లోలాలను నివారించడం

రోజంతటిలో చిన్న చిన్న పరిస్థితులకే మీరు హఠాత్తుగా భావోద్వేగ పటంలో ఈ కొన నుండి ఆ కొనకు మారే మూడ్ ను అనుభవం చేస్తున్నారా? ఎల్లప్పుడూ పరిస్థితులను నియంత్రించలేము కానీ  ప్రతి అనుకోని సంఘటన వలన  ప్రభావితం కాకుండా  మన మానసిక స్థితిని ఎల్లప్పుడూ నియంత్రించవచ్చు.  

మీ మానసిక స్థితిని సంతోషంగా, శాంతియుతంగా ఉంచుకునే  ప్రావీణ్యత పొందటానికి ఈ క్షణం తీసుకోండి.

 

సంకల్పం 

నేను సంతోషకరమైన వ్యక్తిని. ప్రతి మూడ్‌కి నేనే సృష్టికర్తను. వ్యాయామాలు, మెడిటేషన్, ఆధ్యాత్మిక అధ్యయనం, ఆహారం, విశ్రాంతి మరియు నిద్రతో నేను నా మనస్సు మరియు శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటాను. నా మనస్సు మరియు శరీరం ఒత్తిడి లేకుండా ఉన్నాయి. పరిస్థితులు మరియు వ్యక్తుల ప్రవర్తనతో సంబంధం లేకుండా… అడుగడుగునా క్షణం ఆగి, నాకు ఎలా అనిపిస్తుందో,  నా మానసిక స్థితిని చెక్ చేసుకుంటాను… కొంత అసౌకర్యం ఉన్నా, సన్నివేశం యొక్క ప్రభావం నుండి నేను అంతర్గతంగా దూరంగా ఉంటాను…  సన్నివేశం నా మానసిక స్థితిని తాకకుండా, ప్రతికూలతను ప్రేరేపించకుండా చూసుకుంటాను. నేను నా మనస్సును సైలెంట్ చేసి నా అంతరాత్మ చెప్పేది  వింటాను. నా వర్తమానం మరియు భవిష్యత్తు కోసం సరైన ప్రతిస్పందనను నేను నిర్ణయించుకుంటాను. నేను స్థిరత్వంతో సన్నివేశానికి  ప్రతిస్పందిస్తాను…నేను నా శాంతియుత, సంతోషకరమైన మానసిక స్థితిని అలాగే ఉంచుతాను. ప్రతి సందర్భంలోనూ…   ఇతరులు నాతో న్యాయంగా లేకపోయినా… అనారోగ్యంతో బాధపడుతున్నా… కుటుంబంలో సంక్షోభం ఏర్పడినా… కార్యాలయంలో ఏదైనా సమస్య ఎదురైనా నా మానసిక స్థితిని అలాగే ఉంచుకుంటాను. ఈ రోజు పరిస్థితి ఎలా ఉన్నా, నేను ప్రశాంతంగా ఉంటాను. నా మనసులో ఎవరూ ఉండరు మరియు నేను దేనిచేత ప్రభావితం కాను. నేను మనసులో  పెట్టుకున్న బాధ, అసౌకర్యాన్ని నేను నిరంతరం వదిలేస్తూ ఉంటాను. నేను అసౌకర్య అలవాట్లను విడిచిపెడతాను. నా స్థిరత్వం నన్ను స్పష్టంగా ఆలోచించడానికి మరియు ఏదైనా సమస్యను పరిష్కరించడానికి అనుమతిస్తుంది. నా మానసిక స్థితికి నేను యాజమానిని.

 

మీ బాహ్య ప్రపంచంలోని సంఘటనల వల్ల మీ అంతర్గత ప్రపంచం ప్రభావితం కాకుండా చూసుకోవడానికి ఈ సంకల్పాన్ని కొన్ని సార్లు రిపీట్ చేయండి. మీ నిరంతర స్థిరత్వం, మంచి మానసిక స్థితి మీ ఆనందం, ఆరోగ్యం మరియు సామరస్యాన్ని మెరుగుపరుస్తాయి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

23rd april 2025 soul sustenance telugu

జీవితంలోని ప్రతి రంగంలో మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు   మంచి కర్మలు మరియు చెడు కర్మలు రెండూ ఈ సమాజంలో ఉన్నాయి. మన జీవితంలో అనేక కర్మలు చేస్తూ ఉంటాము,

Read More »
22nd april 2025 soul sustenance telugu

జీవితంలోని ప్రతి రంగంలో మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు   మంచి కర్మలు మరియు చెడు కర్మలు అనేవి జీవితమనే నాణానికి ఉన్న రెండు వైపుల వంటివి.  మన కర్మలు ఎంత

Read More »
21st april 2025 soul sustenance telugu

జీవితంలోని ప్రతి రంగంలో మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితం అనేది అనేక మలుపులు మరియు మార్పులతో కూడిన ఒక అందమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో వచ్చే అనేక దృశ్యాలు మనలోని

Read More »