Hin

19th May 2025 Soul Sustenance Telugu

May 19, 2025

మార్పులో స్థిరంగా ఉండటానికి 5 మార్గాలు

  1. స్వయంతో మాట్లాడుతూ ఆత్మపరిశీలన చేసుకోండి – మన జీవితంలో ఏ రకమైన మార్పును చూసినా, మార్పు యొక్క విభిన్న దృశ్యాలకు ప్రభావితం కాకుండా, ఆంతరికంగా చూసుకోవాలి, మన సానుకూలత యొక్క రిజర్వాయర్‌ను ఉపయోగిస్తూ స్థిరత్వం, శాంతి యొక్క ఆలోచనలతో ఆ పరిస్థితిలో సర్దుకోవడానికి కావలసిన కర్మలు చేయాలి.
  2. ప్రస్తుత పరిస్థితిని మించి చూడండి – మన జీవితంలో, మన ఆరోగ్యం, సంపద, కుటుంబం లేదా పనిలో ఆకస్మిక మార్పులు వచ్చినప్పుడు, ఏమి జరిగింది, ఎందుకు జరిగింది మరియు మార్పును ఎలా ఎదుర్కోవాలో అని చింతించడం ప్రారంభిస్తాము. దానికి బదులుగా మనం వివేకంతో మార్పును భిన్నంగా చూడాలి మరియు మార్పులో ప్రయోజనాన్ని కనుగొనాలి.
  3. మార్పుతో ప్రవహించడానికి చర్యలు తీసుకోండి – కొన్నిసార్లు మార్పు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది, మార్పును ప్రతిఘటిస్తూ మార్పు జరగకుండా నిరోధించడం వల్ల మనం జీవితంలో దారి తప్పుతాము. అయితే మార్పు అనేది మన జీవితంలో సహజమైన భాగమని, అది ఎప్పుడూ జరుగుతుందని మనం తెలుసుకోవాలి. మనం దానితో ఎంత ఎక్కువ ప్రవహించి, దానికి అనుగుణంగా మారితే, మన ఆలోచనలు తగ్గుతాయి మరియు మనం సమయాన్ని, మానసిక శక్తిని కూడా ఆదా చేస్తాము.
  4. స్వయం లో మార్పు తెచ్చుకొని ముందుకు సాగండి – ఒక మార్పులో, మిమ్మల్ని మీరు మార్చుకొని, మీ శక్తిని పెంచుకోండి, మీ సంపూర్ణతకు దగ్గర కండి. మనలోని శాంతి, ప్రేమ, ఆనందం, శక్తి, సంకల్పాలు, సమయం యొక్క సంపదల సహాయంతో, మనకు మరియు ఇతరులకు ఒకే సమయంలో ప్రయోజనం చేకూర్చే కొత్త మరియు అందమైన పరిస్థితులను మనం సృష్టించగలమని మార్పు మనకు సందేశాన్ని ఇస్తుంది.
  5. భగవంతుడిని మీతో ఉంచుకొని వారి సలహాను అడగండి – కొందరు వ్యక్తులు తమ జీవితంలో కష్టమైన మార్పును ఎదుర్కొన్నప్పుడు భగవంతుడిని ఎక్కువగా గుర్తు చేసుకుంటారు. అయితే భగవంతుడిని నిరంతరం స్మరించుకోవడం చాలా తెలివైన పని. భగవంతుడితో ఎంత లోతైన అనుబంధం ఉంటే అంత త్వరగా వారు మనకు దిశానిర్దేశం చేసి, పరిస్థితుల నుండి మనల్ని రక్షించి నడిపిస్తారు.

రికార్డు

15th June 2025 Soul Sustenance Telugu

వ్యక్తులు మీపై ఆధారపడేలా చేయవద్దు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు కొంతమందికి లేదా కొన్ని పరిస్థితులకు మనమే ఎంతో ముఖ్యమని, మనం లేకుండా వారు జీవితాన్ని గడపలేరనే నమ్మకంతో మనం తరచుగా జీవిస్తుంటాము.

Read More »
14th June 2025 Soul Sustenance Telugu

భగవంతుడు – ఈ సృష్టి యొక్క ఆది బిందువు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు భగవంతుడు సర్వ శక్తివంతుడు. వారు ఉంటేనే ఈ ప్రపంచం ఉంటుంది, ఎందుకంటే ఈ ప్రపంచంలో  మంచితనం మరియు దైవత్వం క్షీణించిన ప్రతిసారీ

Read More »
13th June 2025 Soul Sustenance Telugu

మిమ్మల్ని మీరు ఎలా ఆశీర్వదించుకోవాలి?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన జీవితంలో సాధువులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కుటుంబం మరియు స్నేహితుల ఆశీర్వాదాల శక్తిని మనమందరం పొందాము. ఆశీర్వాదం అంటే వారందరూ మన

Read More »