Hin

9th-nov-2023-soul-sustenance-telugu

November 9, 2023

మార్పులో స్థిరంగా ఉండటానికి 5 మార్గాలు

స్వయంతో మాట్లాడుతూ ఆత్మపరిశీలన చేసుకోండి – మన జీవితంలో ఏ రకమైన మార్పును చూసినా, మార్పు యొక్క విభిన్న దృశ్యాల ద్వారా ప్రభావితం కాకుండా, ఆంతరికంగా చూసుకోవాలి, మన సానుకూలత యొక్క రిజర్వాయర్‌ను ఉపయోగిస్తూ స్థిరత్వం, శాంతి యొక్క ఆలోచనలతో  ఆ పరిస్థితిలో సర్దుకోవడానికి కావలసిన కర్మలు చేయాలి.

ప్రస్తుత పరిస్థితిని మించి చూడండి – మన జీవితంలో, మన ఆరోగ్యం, సంపద, కుటుంబం లేదా పనిలో ఆకస్మిక మార్పులు వచ్చినప్పుడు, ఏమి జరిగింది, ఎందుకు జరిగింది మరియు మార్పును ఎలా ఎదుర్కోవాలో అని చింతించడం ప్రారంభిస్తాము. దానికి బదులుగా మనం వివేకంతో మార్పును భిన్నంగా చూడాలి మరియు మార్పులో ప్రయోజనాన్ని కనుగొనాలి.

మార్పుతో ప్రవహించడానికి చర్యలు తీసుకోండి – కొన్నిసార్లు మార్పు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది, మార్పును ప్రతిఘటిస్తూ మార్పు జరగకుండా నిరోధించడం వల్ల మనం జీవితంలో మన మార్గాన్ని కోల్పోతాము. అయితే మార్పు అనేది మన జీవితంలో సహజమైన భాగమని, అది ఎప్పుడూ జరుగుతుందని మనం తెలుసుకోవాలి. మనం దానితో ఎంత ఎక్కువ ప్రవహించి, దానికి అనుగుణంగా మారితే, మన ఆలోచనలు తగ్గుతాయి మరియు మనం సమయాన్ని, మానసిక శక్తిని కూడా ఆదా చేస్తాము.

స్వయం లో మార్పు తెచ్చుకొని ముందుకు సాగండి – ఒక మార్పులో, మిమ్మల్ని మీరు మార్చుకొని, మీ శక్తిని పెంచుకోండి, మీ సంపూర్ణతకు దగ్గర కండి. మనలోని శాంతి, ప్రేమ, ఆనందం,  శక్తి,  సంకల్పాలు, సమయం యొక్క సంపదల సహాయంతో, మనకు మరియు ఇతరులకు ఒకే సమయంలో ప్రయోజనం చేకూర్చే కొత్త మరియు అందమైన పరిస్థితులను మనం సృష్టించగలమని మార్పు మనకు సందేశాన్ని ఇస్తుంది.

భగవంతుడిని మీతో ఉంచుకొని వారి సలహాను అడగండి – కొందరు వ్యక్తులు తమ జీవితంలో కష్టమైన మార్పును ఎదుర్కొన్నప్పుడు భగవంతుడిని ఎక్కువగా గుర్తు చేసుకుంటారు. అయితే భగవంతుడిని నిరంతరం స్మరించుకోవడం చాలా తెలివైన పని. భగవంతుడితో ఎంత లోతైన అనుబంధం ఉంటే అంత త్వరగా వారు మనకు దిశానిర్దేశం చేసి, పరిస్థితుల నుండి మనల్ని రక్షించి నడిపిస్తారు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

24th jan 2025 soul sustenance telugu

ఇతరుల సంతోషాన్ని ఆనందించడం

ఇతరులు మీ కంటే మెరుగ్గా పనిచేస్తున్నప్పుడు, మీరు ఇంకా అక్కడికి చేరుకోనప్పుడు మీరు వారి కోసం నిజంగా సంతోషిస్తారా లేదాపై పైన సంతోషిస్తారా  లేదా అస్సలు సంతోషించరా? లోలోపల  మీరు సంతోషంగా ఉండాలని కోరుకున్నా

Read More »
23rd jan 2025 soul sustenance telugu

పరీక్షలను ఎదుర్కోవడంలో విజయానికి 8 సూత్రాలు (పార్ట్ 3)

పరీక్షలను ఎదుర్కొంటున్నప్పుడు, చదివే సమయంలో దృష్టి కేంద్రీకరించే మీ సామర్థ్యాన్ని మరియు ఏకాగ్రతని ఎల్లప్పుడూ తనిఖీ చేయండి. నేను అధ్యయనం పూర్తి చేయడానికి లేదా నా కోర్సులో ఒక అధ్యాయాన్ని సవరించడానికి చాలా సమయం

Read More »
22nd jan 2025 soul sustenance telugu

పరీక్షలను ఎదుర్కోవడంలో విజయానికి 8 సూత్రాలు (పార్ట్ 2)

పరీక్షల సమయంలో  లేదా జీవితంలో ఏదైనా సవాలును ఎదుర్కొంటున్నప్పుడు స్థిరంగా ఉండటానికి చాలా ముఖ్యమైన మార్గం అంతర్గత శాంతి, శక్తి , స్థిరత్వంతో నిండిన కొన్ని సానుకూల ఆలోచనలను చేస్తూ రోజులో కొన్ని సార్లు

Read More »