Hin

5th mar 2024 soul sustenance telugu

March 5, 2024

మహా శివరాత్రి నాడు భగవంతుని సందేశం (పార్ట్ 1)

మనమందరం మన ప్రార్థనలలో … శ్లోకాలు … మరియు ఆచారాలలో భగవంతునితో మాట్లాడతాము. వారు మనకు ఇచ్చిన ప్రతిదానికీ మనం కృతజ్ఞతలు తెలుపుతాము … వారి శక్తులను స్తుతిస్తాము … వారి సహాయం కోరుతాము … మన పాపాలను క్షమించమని వేడుకుంటాము … ప్రతిరోజూ వారితో మాట్లాడుతాము … కానీ వారు చెప్పేది ఆగి వినడానికి మనకు సమయం లేదు. మహా శివరాత్రి లేదా శివ జయంతి (మార్చి 8) నాడు భగవంతుని ఈ సందేశం మీరు వెతుకుతున్న దానితో మిమ్మల్ని కనెక్ట్ చేయగలదు… మీరు కోరుకున్నవన్నీ మీకు అందించగలదు… వారి మాట విందాం…

 

నా మధురమైన పిల్లలు, మీరు నన్ను మరచిపోయారు, ఎందుకంటే మనం చాలా కాలం నుండి కలుసుకోలేదు. మీరందరూ నా గురించి విన్నారు, చదివారు. కానీ మీరు వెతుకుతున్న సత్యత గురించి చెప్పడానికి ఇప్పుడు నేను మీతో నేరుగా మాట్లాడాల్సిన సమయం వచ్చింది. నేను నా గురించి చెప్పే ముందు, మీ గురించి మీకు గుర్తు చేస్తాను. మధురమైన పిల్లలు,  మీరు మీరనుకునే  మీ పేరు, మతం, వృత్తి, సంబంధం… కాదు, మీరు చూసే ఈ శరీరం కూడా కాదు. మీరు స్వచ్ఛమైన చైతన్య జీవి, ఆధ్యాత్మిక సూక్ష్మ బిందువు, అనేక పాత్రలను పోషించడానికి శరీరాన్ని ఉపయోగించే ఆత్మ. మీరు స్వచ్ఛమైన, శాంతియుతమైన, ప్రేమగల మరియు శక్తివంతమైన ఆత్మ.

 

సుమారు 5000 సంవత్సరాల క్రితం, మీరందరూ నాతో మన సంపూర్ణ శాంతి మరియు స్వచ్ఛతల ఇళ్లయిన … పరంధామంలో … నివసించారు. కానీ మీరు, ఈ భూమిపై మీ పాత్రను పోషించవలసి వచ్చింది, దాని కోసం మీరు నన్ను మరియు మీ ఆధ్యాత్మిక ఇంటిని విడిచిపెట్టి ఈ ప్రపంచంలోకి వచ్చారు. మీరు ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు మీరు సంపూర్ణంగా, పరిపూర్ణంగా మరియు దివ్య గుణాలతో ఉండే వారు. మీరు  మీ పాత్రను పోషించడానికి పరిపూర్ణమైన భౌతిక శరీరంతో ఒక పరిపూర్ణ ప్రపంచం … పరడైస్, హెవెన్ , స్వర్గం, జన్నత్, బహిస్ట్ గా పిలువబడే దైవత్వం, ప్రేమ కలిగిన  సంపన్న ప్రపంచంగా ఉండేది. శరీరం వృద్ధాప్యానికి చేరుకున్నప్పుడు  మీరు కొత్త భౌతిక శరీరం అనే దుస్తులను ధరించి మీ పాత్రను కొనసాగిస్తారు. పరంధామం నుండి చాలా మంది పిల్లలు ఈ భౌతిక ప్రపంచంలో మీతో చేరారు. స్వర్ణయుగం (సత్యయుగం) మరియు వెండి యుగం (త్రేతాయుగం) అని పిలువబడే ఈ ఆనంద ప్రపంచాన్ని మీరందరూ దాదాపు 2500 సంవత్సరాలు అనుభవించారు.

(సశేషం)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

9th sep 2024 soul sustenance telugu

గందరగోళం కాకుండా స్పష్టత కలిగి ఉండండి

శాంతి మరియు స్థిరత్వంతో కూడిన జీవితాన్ని గడపడానికి స్పష్టత కలిగి ఉండటం కీలకం. కానీ ఎలా ఉండాలి, ఏం చేయాలి లేదా ఏ దిశలో అడుగు పెట్టాలి అని మనం తరచుగా ఆలోచిస్తూ ఉంటాము.

Read More »
8th sep 2024 soul sustenance telugu

గణేష్ చతుర్థి యొక్క దివ్యత మరియు ఆధ్యాత్మికత (పార్ట్ 2)

శ్రీ గణేషుని పెద్ద ఉదరము ఇముడ్చుకునే శక్తిని సూచిస్తుంది. వ్యక్తుల బలహీనతలు మరియు వారి తప్పుడు చర్యల గురించి మనం ఇతరులతో మాట్లాడకూడదు. శ్రీ గణేషుని చేతిలో గొడ్డలి, తాడు మరియు కమలం చూపిస్తారు,

Read More »
7th sep 2024 soul sustenance telugu

గణేష్ చతుర్థి యొక్క దివ్యత మరియు ఆధ్యాత్మికత (పార్ట్ 1)

ఈ సంవత్సరం గణేష్ చతుర్థిని సెప్టెంబర్ 7 నుండి 17 వరకు జరుపుకుంటారు. శ్రీ గణేషుని జననం యొక్క నిజమైన అర్ధాన్ని మనం అర్థం చేసుకుంటాము. శ్రీ పార్వతీ దేవి స్నానం చేయాలనుకొని గేటు

Read More »