Hin

6th mar 2024 soul sustenance telugu

March 6, 2024

మహా శివరాత్రి నాడు భగవంతుని సందేశం (పార్ట్ 2)

మీరు చాలా కాలంగా ప్రపంచ వేదికపై మీ పాత్రను పోషిస్తున్నందున, మీ స్వచ్ఛత మరియు శక్తి నెమ్మదిగా క్షీణించాయి. మీరు మీ ఆత్మిక స్వభావాన్ని మరచిపోయి మీరు ధరించిన భౌతిక శరీరమే మీరు అని భావించారు.  కామం, క్రోధం, లోభం, మోహం  మరియు అహంకారం మీ పరస్పర చర్యల్లోకి వచ్చాయి. ప్రేమ మరియు సామరస్యం కోల్పోయి మీరు ఒకరినొకరు మోసం చేసుకోవడం,  గొడవ పడడం ప్రారంభించారు. మీకు  బాధ మరియు నొప్పి కలిగినప్పుడు నన్ను పిలవడం, వెతకడం మొదలుపెట్టారు, నేను, మీ తండ్రిని, పరంధామంలో ఉంటానని మర్చిపోయి ఈ భౌతిక ప్రపంచంలో నన్ను వెతకడం ప్రారంభించారు. నేను మీ లాగే  ఆధ్యాత్మిక జ్యోతిర్బిందువునని మీకు నిర్బల స్మృతి ఉంది, కాబట్టి మీరు దేవాలయాలను నిర్మించి, నన్ను గుర్తుంచుకోవడానికి నా బిందువు రూపాన్ని చిహ్నంగా చేసారు.

 

బాధ మరియు సంఘర్షణతో మీ దుఖం పెరిగింది. అబ్రహం, గౌతమ బుద్ధుడు, జీసస్ క్రైస్ట్, మహమ్మద్, మహావీర్, శంకరాచార్య, గురునానక్ వంటి నా స్వచ్ఛమైన పిల్లలలో కొందరు మీకు మార్గనిర్దేశం చేసేందుకు మీ ప్రపంచానికి వచ్చారు. వాళ్లందరూ మీకు సరైన జీవన విధానాన్ని నేర్పడానికి వచ్చారు. వారిలో కొందరు నా గురించి నేను, పరమాత్మనని, ఆధ్యాత్మిక జ్యోతిర్బిందువునని, స్వచ్ఛత మరియు ప్రేమసాగరుడను అని,  మీ తండ్రినైన నేను పరంధామంలో పైన నివసిస్తానని మీకు గుర్తు చేశారు. వారు మిమ్మల్ని నాకు కనెక్ట్ చేయడానికి వచ్చారు, కానీ మీరు వారిలో నన్ను వెతకడం ప్రారంభించారు.

 

కాలం గడిచేకొద్దీ మీరు మతం, జాతీయాలు, కులం మరియు మతం పేరుతో విభజించబడ్డారు. మీరు, నా ముద్దుబిడ్డలు, నా పేరు మీద యుద్ధాలు ప్రారంభించారు. మీరు మీ పూర్వీకులైన, స్వర్ణ మరియు వెండి యుగం (లేదా స్వర్గం)లో మీ ప్రపంచంలో నివసించిన దైవిక ఆత్మలు – శ్రీ రాధే కృష్ణ, శ్రీ లక్ష్మీ నారాయణ్, శ్రీ రామ సీతలను కీర్తించడానికి దేవాలయాలను నిర్మించారు.  వాటిలో నన్ను వెతకడం ప్రారంభించారు. మీదుఖం  ఎక్కువవుతున్న కొద్దీ నా కోసం మీ వెతుకులాట మరింత ఎక్కువైంది. మీరు  ప్రకృతి లో నా కోసం వెతికారు. నేను అందరిలో ఉన్నానని కూడా మీరు అనుకున్నారు. మీలో కొందరు నా కోసం వెతకడానికి మీ జీవితాన్ని అంకితం చేసారు, కానీ ఇప్పటికీ నన్ను కనుగొనలేకపోయారు. మీలో కొందరు మీ సైన్స్ మరియు టెక్నాలజీ ప్రపంచంలో చిక్కుకుపోయారు, నేను ఉనికిలో లేను అని కూడా మీరు నమ్ముతున్నారు. ఇది మరో 2500 సంవత్సరాల పాటు కొనసాగిన రాగి యుగం (ద్వాపరయుగం) మరియు ఇనుప యుగం (కలియుగం).

 

(సశేషం)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

17th june2024 soul sustenance telugu

పోటీ పడటం మానండి… ఈ క్షణాన్ని ఆస్వాదించండి (పార్ట్ 1)

ప్రతి ఆత్మ సంతోషాన్ని కోరుకుంటుంది. సంతోషంగా ఉండటం కోసం సంతోషాన్ని వెతుకుతుంటాము. ఆరోగ్యం, అందం, ధనము, పాత్ర వంటి ఇతర గమ్యాలు కూడా విలువైనవే ఎందుకంటే అవి మనకు సంతోషాన్నిస్తాయి అని మనం భావిస్తాము.

Read More »
16th june2024 soul sustenance telugu

 దేవీ దేవతల 36 దివ్య గుణాలు

నిన్నటి సందేశంలో, దేవీ దేవతలలో ఉన్న 36 దివ్య గుణాలను ప్రస్తావించాము. మనం పరిపూర్ణంగా, స్వచ్ఛంగా మరియు ప్రశంసనీయంగా తయారవ్వటానికి మనలో ప్రతి గుణం చెక్ చేసుకొని ధారణ చేద్దాము. ఈ గుణాలన్నింటినీ మనం

Read More »
15th june2024 soul sustenance telugu

దేవి దేవతల 5 అర్హతలు

కలియుగం (ఇనుప యుగం) చివరిలో మరియు సత్యయుగం (స్వర్ణయుగం) ప్రారంభానికి ముందు, మానవాళికి రాత్రి మరియు మానవాళికి పగలు మధ్య ఉన్న ప్రస్తుత సంగమయుగంలో భగవంతుడు మానవులను దేవీ దేవతలుగా మారుస్తున్నారు. దేవీ దేవతలకు

Read More »