Hin

7th mar 2024 soul sustenance telugu

March 7, 2024

మహా శివరాత్రి నాడు భగవంతుని సందేశం (పార్ట్ 3 )

నేను మీ భాగ్యాన్ని నిర్ణయిస్తానని మీరు అనుకున్నారు, మీకు సమస్య వచ్చినప్పుడల్లా నన్ను నిందించి, దాన్ని పరిష్కరించమని నన్ను ప్రార్థించారు. మధురమైన పిల్లలు, నేను మీ  ఆత్మిక తండ్రిని, నేను మీకు ఎప్పుడైనా అనారోగ్యం, పేదరికం, సంఘర్షణ మరియు ప్రకృతి వైపరీత్యాలు ఇవ్వగలనా? మీ ప్రపంచంలోని ప్రతిదీ కర్మ సిద్ధాంతం ప్రకారం పనిచేస్తుంది, మీరు చేసిన దానికి మాత్రమే మీరు తిరిగి పొందుతారు. మీరే మీ భాగ్య విధాతలు.  అద్భుతమైన భాగ్యాన్ని తయారు చేసుకోవడానికి నేను మీకు జ్ఞానం మరియు శక్తిని ఇవ్వగలను. కానీ దాని కోసం మీరు నాతో కనెక్ట్ అవ్వాలి మరియు నేను ఇచ్చే  జ్ఞానాన్ని అధ్యయనం చేయాలి.

పిల్లలూ, నా కోసం మీ అన్వేషణ ఇప్పుడు ముగిసింది. ఇన్నాళ్లూ నేను మీ లోకంలో లేనందున మీరు  నన్ను కనుగొనలేకపోయారు. నేను ఇన్నాళ్లూ పరంధామంలో ఉన్నాను. కానీ ఇప్పుడు, మీకు వాగ్దానం చేసినట్లు, నేను మీ ప్రపంచంలోకి మిమల్ని శుద్ధి చేయడానికి వచ్చాను. మీరు  ఎవరో, నేనెవరినో గుర్తు చేయడానికే నేను మీ  ప్రపంచంలోకి వచ్చాను.

నా ప్రియమైన పిల్లలూ, మీలాగే నేను కూడా జ్యోతిర్బిందువుని మాత్రమే. నేను స్వచ్ఛత, ప్రేమ మరియు జ్ఞాన సాగరుడను. మీరు నన్ను చాలా పేర్లతో పిలిచారు. నేను మీ సర్వోన్నత తండ్రిని, శిక్షకుడను మరియు గురువును. పిల్లలైన మీరు శరీరాన్ని తీసుకొని జనన-మరణ చక్రంలోకి వచ్చారు, నేను శరీరాన్ని తీసుకోను. నేను సైలెన్స్ మరియు స్వచ్ఛత యొక్క ధామం అయిన పరంధామంలో నివసిస్తాను. మీకు జ్ఞానం, ప్రేమ మరియు శక్తిని ఇవ్వడానికి నేను మీ భౌతిక ప్రపంచంలోకి వచ్చాను.

 

(సశేషం)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

20th july 2024 soul sustenance telugu

ప్రతి ఒక్కరికీ పట్ల మీ దృష్టిని నిష్పాక్షికంగా, ఆధ్యాత్మికంగా మార్చుకోండి

గౌరవం మరియు వినయం అనే మీ వాస్తవిక లక్షణాల ద్వారా ఇతరులతో కనెక్ట్ అవ్వండి. మీ లక్షణాలు మీవే, వాటిని ప్రతి ఒక్కరితో, ప్రతి పరిస్థితిలో మరియు ప్రతిసారీ ఉపయోగించుకోండి. మీరు ఒక వ్యక్తితో

Read More »
19th july 2024 soul sustenance telugu

జీవితంలోని ప్రతి దృష్టాంతంలో ఓపికగా ఉండటం

వేగం మరియు హడావిడి  మన జీవిత లక్షణాలుగా మారినప్పటి నుండి మనం అసహనంతో ఉన్నాము. సహనం ఫలిస్తుందని, అసహనం బాధిస్తుంది అని జ్ఞానం చెబుతుంది. కానీ కొన్నిసార్లు మనం దేనినైనా వేగవంతం చేయాలనుకున్నప్పుడు, మనకు

Read More »
18th july 2024 soul sustenance telugu

నా మూల స్థితి అయిన మంచితనానికి తిరిగి రావడం (పార్ట్ 3)

మన అసలైన మంచితన స్థితికి తిరిగి రావాలంటే, మనం ఆధ్యాత్మిక శక్తి మరియు సానుకూలత యొక్క ఉన్నత మూలం వైపు చూడాలి. ఇతరుల నుండి ప్రేమ, ఆనందం కోసం అడగడం అనేది కస్తూరి జింక

Read More »