Hin

3rd april 2024 soul sustenance telugu

April 3, 2024

మన ఆశీర్వాదాలతో ప్రపంచాన్ని బాగు చేద్దాం (పార్ట్ 1)

మనందరి మధ్యలో ఉండే ప్రత్యేక సంబంధం ఏమిటంటే, ఒకరితో ఒకరు ఆనందం, ప్రేమను పంచుకోవడం, ఇది మనల్ని శక్తితో నింపుతుంది మరియు రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది. జీవిత ప్రయాణంలో మనతో పాటు వచ్చే వ్యక్తులు వారి ఆశీర్వాదాలతో మన జీవితాలను నింపుతారు, ఇది మనల్ని  తేలికపరిచి కష్టాలను దాటడానికి సహాయపడుతుంది. మన స్వంత ఆధ్యాత్మిక శక్తితో పాటు, వ్యక్తులు మరియు వారి ప్రేమ కూడా మనలో శక్తిని నింపుతాయి. ప్రేమపూర్వకమైన ఆశీర్వాదాలు పర్వతాలను కదిలించగలవు అని సాధారణంగా అంటూ ఉంటారు, అయితే ఆధ్యాత్మిక శక్తితో నిండిన ఆశీర్వాదాలు మొత్తం గ్రహాన్ని కూడా మార్చగలవు. బాధ్యతగా ప్రపంచంలోని వారందరి సహాయంతో మనం చేయవలసినది ఇదే – ప్రపంచానికి ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను అందించడం ద్వారా ప్రపంచ దుఃఖపు వాతావరణాన్ని మార్చడం. మార్పు కోసం అందరి పట్ల స్వచ్ఛమైన, సానుకూల సంకల్పాలతో కూడిన శుభ భావనలు పెట్టుకోవడమే  ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను అందించడం.

మనం వార్తాపత్రికలు చదివినప్పుడు లేదా టెలివిజన్‌లో వార్తలను వింటున్నప్పుడు లేదా మన దైనందిన జీవితంలో చూసినప్పుడు, హింస, హత్యలు, కామించే ప్రభావితమైన అపరిశుభ్రమైన చర్యలు, ప్రమాదాలు, బలహీనమైన శారీరక మరియు మానసిక ఆరోగ్యం, ప్రకృతి వైపరీత్యాలు వంటి వేలాది దృశ్యాలు ఉన్నాయి. భూకంపాలు, వరదలు, కరువులు, సునామీలు, అగ్నిపర్వతాలు మొదలైనవి మరియు అడవి మంటలు వంటి ఇతర విపత్తులు. పేదరికం, వాతావరణ మార్పు, గ్లోబల్ వార్మింగ్ మరియు వ్యక్తుల మధ్య సంబంధాలలో విభేదాలు వంటి అనేక ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో యుద్ధాలు జరుగుతున్నాయి, వాటి కారణంగా విపరీతమైన భయం కూడా ఉంది. ఈ సంఘటనలన్నీ చాలా దిగ్భ్రాంతికరమైనవి, ఎప్పటికప్పుడు ప్రపంచం యొక్క భావోద్వేగాలను కలిగించే లెక్కలేనన్ని బాధాకరమైన  చిత్రాలు, ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలోని వారు చాలా కష్టాలను ఎదుర్కొంటున్న దుఃఖపు ప్రపంచంలో మనం ఎలా జీవిస్తున్నామో అవి మన దృష్టికి తీసుకువస్తాయి. లక్షలాది మంది మౌనంగా బాధపడుతున్నారు.  వారికి భౌతిక స్థాయిలోనే కాకుండా సానుకూల, అదృశ్య ఆధ్యాత్మిక శక్తి స్థాయిలో కూడా మన నుండి చాలా సహాయం మరియు ఆధారం అవసరం.

(సశేషం … )

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

12th november 2024 soul sustenance telugu

ప్రశంసలలో స్థిరంగా ఉండటం

మన విశేషతలు వాలనో లేదా  మనం సాధించిన విజయానికో ఇతరులు మనల్ని మెచ్చుకున్నప్పుడు, వారు మన గురించి చెప్పేది నిజానికి మన గురించి కాదు. మనలో మంచితనాన్ని చూడగలిగే వారి సుగుణాన్ని వారు కనబరుస్తారు.

Read More »
11th november 2024 soul sustenance telugu

మానసిక అలసటను అధిగమించడానికి 5 చిట్కాలు (పార్ట్  3)

పరిస్థితుల భారం లేకుండా జీవితాన్ని ఒక అందమైన ప్రయాణంగా జీవించండి – భారం లేకుండా జీవితాన్ని జీవించడానికి చాలా ముఖ్యమైన అభ్యాసం ప్రయాణాన్ని ఆస్వాదించడం. సైడ్ సీన్లు లేని ప్రయాణాన్ని మీరు ఎప్పుడైనా చూశారా?

Read More »
Maanasika alasatanu adhigaminchdaaniki 5 chitkaalu (part 2)

మానసిక అలసటను అధిగమించడానికి 5 చిట్కాలు (పార్ట్  2)

తప్పనిసరి అయితేనే ఇతరుల గురించి ఆలోచించండి – అవసరం లేనప్పుడు, ముఖ్యమైనది కానప్పుడు కూడా ఇతరుల గురించి ఆలోచించడం అనేది మనందరికీ ఉన్న ఒక సాధారణ అలవాటు. మీ కార్యాలయంలోని ఒక వ్యక్తి తన

Read More »