Hin

4th april 2024 soul sustenance telugu

April 4, 2024

మన ఆశీర్వాదాలతో ప్రపంచాన్ని బాగు చేద్దాం (పార్ట్ 2)

ప్రపంచంలోని ప్రతి వ్యక్తి నుండి శాంతి, ప్రేమ మరియు ఆనందం యొక్క ఆశీర్వాదాలు ప్రపంచానికి అవసరం. దీవెనలు సానుకూల మానసిక వైబ్రేషన్లు లేదా ఒక నిర్దిష్ట కారణానికి అనుకూలంగా మనస్సు ద్వారా ప్రసారం చేయబడిన సానుకూల ఆలోచన యొక్క శక్తి. అలాంటి శక్తి ప్రపంచంలో ఎక్కడైనా ఉన్న వ్యక్తికి లేదా బృందా నికి ప్రయోజనం చేకూరుస్తుంది.

నిశ్శబ్దంగా కూర్చుని, ప్రతిరోజూ కొన్ని నిమిషాల పాటు సానుకూల స్పృహ బటన్‌ను ఆన్ చేయండి. అంటే ఇలా సానుకూల ఆలోచనలను సృష్టించండి –

 

  1. నేను భృకుటి మధ్యలో శాంతియుతమైన చైతన్య జ్యోతిని, శాంతి స్వరూపాన్ని …. నేను ప్రపంచంలోని వారందరికీ శాంతి కిరణాలను వ్యాపింపచేస్తాను … నేను ప్రపంచ గ్లోబ్ ను నా ముందు అనుభవం చేసుకొని నేను పూర్తి గ్రహానికి మరియు దానిపై నివసించే వారందరికీ శాంతిని ప్రసరిస్తాను….
  2. నేను ప్రపంచ సేవకు బాధ్యత వహించే ఆత్మను … నేను చాలా శక్తివంతమైన ఆత్మను మరియు ప్రపంచం లోని వారందిరికీ శక్తిని ఇస్తాను…. ఈ దుఃఖ సమయాల్లో వారందిరికి ఆధ్యాత్మిక పోషణను అందించే బాధ్యత నాకు ఉంది….

 

  1. నేను ప్రేమతో నిండిన ఆత్మను; నేను ప్రపంచానికి మరియు ప్రకృతికి ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను…. నేను ఆనందంతో నిండిన ఆత్మను; ప్రపంచం బాధలు మరియు దుఃఖం లేకుండా ఉండాలనే అంతర్గత కోరిక నాకు ఉంది, దానిని నేను నా శుభాకాంక్షలతో నెరవేరుస్తున్నాను.

 

  1. నేను ఆధ్యాత్మిక శక్తికి ఆధారం. శక్తి మరియు ప్రోత్సాహంతో నిండిన నా ఆలోచనల ద్వారా ప్రపంచానికి వారు ఎదుర్కొనే కష్టాల నుండి నేను ఉపశమనాన్ని అందిస్తాను….

 

  1. నేను శాంతి మరియు ప్రేమ యొక్క ప్రకాశాన్ని ప్రసరింపజేసే ఏంజెల్ ను; ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా సోదర-సోదరీలకు, నా ఆధ్యాత్మిక కుటుంబానికి నేను శాంతి, ప్రేమ అనుభవాన్ని కలిగిస్తున్నాను….

 

  1. నేను ప్రపంచ సేవకుడను…. నేను ఆనంద సాగరుడైన పరమాత్మునితో అనుసంధానం అయి ఉన్నాను…. వారిలో ఉన్న ఆనందాన్ని నేను గ్రహించి సంపూర్ణ ప్రపంచానికి దానం చేస్తాను …

 

(సశేషం …)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

30th april 2025 soul sustenance telugu

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితంలోని వివిధ లక్ష్యాలను సాధించేటప్పుడు మనం ఎంత వినయంగా మరియు నిజాయితీగా ఉన్నాము అనేదే మన విజయం. నమ్రత అన్నింటికంటే గొప్ప

Read More »
29th april 2025 soul sustenance telugu

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు విజయం అంటే మన జీవతపు క్వాలిటి పెరగడం. మనం ఖరీదైన కారు,  ఖరీదైన బట్టలు కొనుగోలు చేసి  గర్వపడతాము. కొన్నిసార్లు ఈ

Read More »
28th april 2025 soul sustenance telugu

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనమందరం మనకు మరియు ఇతరులకు సాధ్యమైనంత ఉత్తమమైన రీతిలో ప్రయోజనం చేకూర్చే పనులు చేసే ప్రత్యేకమైన వారము. ఉద్యోగంలో, మార్కెట్‌కు వెళ్లేటప్పుడు,

Read More »