Hin

5th april 2024 soul sustenance telugu

April 5, 2024

మన ఆశీర్వాదాలతో ప్రపంచాన్ని బాగు చేద్దాం (పార్ట్ 3)

ఇతరుల కోసం సానుకూల ఆలోచనలను సృష్టించడం అనేది మనం రోజులో ఏ సమయంలోనైనా చేయగలిగే పని. మనం చాలా బిజీగా ఉన్నప్పుడు కూడా, మధ్యలో సమయం తీసుకోగలిగినప్పుడు మరియు కొన్ని నిమిషాల చిన్న విరామం తీసుకోగలిగినప్పుడు చేయవచ్చు. ప్రపంచం పట్ల మన బాధ్యత. ప్రతి ఒక్కరి జీవితంలో అప్పుడప్పుడు క్లిష్ట పరిస్థితులు వస్తాయని మనకు తెలుసు. ఈరోజు మనం ఇతరులను బాధలో చూస్తూ ఉండవచ్చు. రేపు మనం కూడా అదే అనుభవించవచ్చు. కాబట్టి ప్రపంచంలోని ఏదో ఒక మూలలో ఉన్న సంక్షోభానికి మనకు ఏమి సంబంధం అని మనం ఎప్పుడూ ఆలోచించకూడదు. కానీ వారు సహాయం అవసరమైన నా సోదర-సోదరీలు అని మీకు మీరు గుర్తు చేసుకోండి. మనం ప్రపంచంలోని ప్రతి మూలకు భౌతికంగా వెళ్లలేము కానీ బాధల నుండి మెడిటేషన్ ద్వారా ఉపశమనం కలిగించడానికి మనం ప్రతిరోజూ కొన్ని నిమిషాలు వారి కోసం వెచ్చించవచ్చు.

కాబట్టి, దయాసాగరుడైన భగవంతుడి దయగల పిల్లలుగా, మనం ప్రపంచంలోని ముఖ్యమైన మరియు పరిష్కారం అవసరమయ్యే ఒక సమస్యను ఎంచుకోవచ్చు. ఇక, కొన్ని రోజుల పాటు, మనము శాంతి, ప్రేమ, ఆనందం మరియు శక్తితో నిండిన ఆశీర్వాదాల శక్తిని ప్రపంచంలోని ఆ ప్రాంతానికి లేదా ఆ వ్యక్తుల బృందానికి మెడిటేషన్ చేయడం ద్వారా పంపవచ్చు. ఇది ఒక వ్యక్తిగా లేదా స్నేహితుల సమూహంలో లేదా మీ కుటుంబం లేదా కార్యాలయంలో మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులతో చేయవచ్చు. అటువంటి ప్రతికూల వాతావరణంలో, మన ఆశీర్వాదాలు మాత్రమే వారికి సహాయపడతాయి. ఆశీర్వాదాలు అందరి బాధాకరమైన హృదయాలను నయం చేస్తాయి మరియు ముఖ్యంగా మనలో చాలా మంది కలిసి ఇలాంటి ఆలోచనలను సృష్టించినప్పుడు చాలా శక్తివంతంగా ఉంటుంది. అందరి సమస్యలను పరిష్కరించడంలో మరియు వారికి ఉపశమనం, సహాయం, ఆధారాన్ని అందించడంలో అద్భుతాలు చేసే ఇలాంటి సామూహిక కృషి అవసరం. బ్రహ్మా కుమారీల వద్ద, నెలలో ప్రతి మూడవ ఆదివారం ప్రత్యేకంగా ప్రపంచానికి ఆశీర్వాదాలు లేదా సానుకూల వైబ్రేషన్లను ప్రసరింపజేయడానికి ఉంచబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్రహ్మా కుమారీల సభ్యులందరూ సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు ప్రపంచం కోసం మెడిటేషన్ చేస్తారు. దీనినే వరల్డ్ మెడిటేషన్ అవర్ అంటారు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

24th jan 2025 soul sustenance telugu

ఇతరుల సంతోషాన్ని ఆనందించడం

ఇతరులు మీ కంటే మెరుగ్గా పనిచేస్తున్నప్పుడు, మీరు ఇంకా అక్కడికి చేరుకోనప్పుడు మీరు వారి కోసం నిజంగా సంతోషిస్తారా లేదాపై పైన సంతోషిస్తారా  లేదా అస్సలు సంతోషించరా? లోలోపల  మీరు సంతోషంగా ఉండాలని కోరుకున్నా

Read More »
23rd jan 2025 soul sustenance telugu

పరీక్షలను ఎదుర్కోవడంలో విజయానికి 8 సూత్రాలు (పార్ట్ 3)

పరీక్షలను ఎదుర్కొంటున్నప్పుడు, చదివే సమయంలో దృష్టి కేంద్రీకరించే మీ సామర్థ్యాన్ని మరియు ఏకాగ్రతని ఎల్లప్పుడూ తనిఖీ చేయండి. నేను అధ్యయనం పూర్తి చేయడానికి లేదా నా కోర్సులో ఒక అధ్యాయాన్ని సవరించడానికి చాలా సమయం

Read More »
22nd jan 2025 soul sustenance telugu

పరీక్షలను ఎదుర్కోవడంలో విజయానికి 8 సూత్రాలు (పార్ట్ 2)

పరీక్షల సమయంలో  లేదా జీవితంలో ఏదైనా సవాలును ఎదుర్కొంటున్నప్పుడు స్థిరంగా ఉండటానికి చాలా ముఖ్యమైన మార్గం అంతర్గత శాంతి, శక్తి , స్థిరత్వంతో నిండిన కొన్ని సానుకూల ఆలోచనలను చేస్తూ రోజులో కొన్ని సార్లు

Read More »