Hin

24th november 2024 soul sustenance telugu

November 24, 2024

మన ఆలోచనలు మన విధిని ఎలా సృష్టిస్తాయి (పార్ట్ 2)

మన ఆలోచనలు మన భావాలకు ఎలా దారితీస్తాయో, మన భావాలు మన వైఖరిగా ఎలా అవుతాయో  నిన్న మనం చూశాము. ఈ రోజు ఈ ప్రక్రియ యొక్క మిగిలిన దశలను చూద్దాం.

  1. నా వైఖరి నన్ను చర్యలోకి తీసుకువస్తుంది.

నా వైఖరి వ్యక్తులు, పరిస్థితుల పట్ల నా దృక్పథం, ప్రవర్తన మరియు ప్రతిస్పందనను నిర్దేశిస్తుంది. కాబట్టి నా వైఖరి నా చర్యలను నడిపిస్తుంది. నిన్నటి ఉదాహరణను ఉపయోగిస్తూ – నేను ఒక ఉద్యోగిని, నా కార్యాలయం పట్ల నాకు, నేను కార్యాలయానికి చెందిన వాడిని అనే వైఖరి ఉంటుంది. ఈ వైఖరి నన్ను చర్యలోకి తీసుకువస్తుంది. నేను నా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాను. నేను ఉత్సాహంగా పని చేస్తూ నా కంపెనీ లక్ష్యాలకు అనుగుణంగా ఉంటాను.

  1. పునరావృతమయ్యే చర్యలు నా అలవాట్లను ఏర్పరుస్తాయి.

ఏదైనా చర్యను రెండు, మూడు లేదా పది సార్లు చేయడం వల్ల అది అలవాటుగా మారుతుంది. నేను అధిక పనితీరు గల ఉద్యోగిగా ఉన్నప్పుడు, నేను దానికి సంబంధించిన ప్రయోజనాలన్నీ పొందుతాను. ఇది నా సంతోషాన్ని పెంచి తదుపరి పనిలో, తరువాత తదుపరి పనిలో మెరుగ్గా చేయడానికి నన్ను ప్రేరేపిస్తుంది. కాబట్టి సంతోషంగా ఉండటం, ప్రదర్శించడం మరియు విజయవంతం అవ్వటమనేది నాకు ఒక అలవాటుగా  అవుతుంది.

  1. అలవాట్లు నా వ్యక్తిత్వాన్ని నిర్వచిస్తాయి.

నేను పదే పదే ఏదైతే చేస్తానో అదే అవుతాను. కాబట్టి నా అలవాట్లన్నీ కలిసి నా వ్యక్తిత్వాన్ని రూపొందిస్తాయి. అవి నా జీవితంలో అంతర్భాగమవుతాయి. నా ప్రవర్తనలోకి వచ్చేసి నా జీవితాన్ని  మార్గనిర్దేశం చేస్తాయి. నేను సంతోషకరమైన ఉద్యోగి అయితే, అది నా వ్యక్తిత్వంలోకి వచ్చేస్తుంది. ఈ విధంగా నా సంతోషం నా పని ప్రదేశానికి మాత్రమే పరిమితం కాదు. నేను చేసే ప్రతి పనిలో దాని ముద్రను వేస్తూ ప్రతిచోటా నాతో పాటు ఉంటుంది.

  1. చర్యలో ఉన్న వ్యక్తిత్వం నా విధిని సృష్టిస్తుంది.

నా వ్యక్తిత్వం ఎలా ఉంటుందో, నా ప్రతి చర్య కూడా అలాగే ఉంటుంది. నా చర్య ఎలా ఉంటుందో, చర్య యొక్క ఫలితం కూడా అలాగే ఉంటుంది. ఆ ఫలితమే నా విధి.

సారాంశంః ఈ విధంగా అన్ని అంశాలు కలుస్తాయి – నా ఆలోచనలు భావాలను సృష్టిస్తాయి, భావాలు నా వైఖరిని తయారుచేస్తాయి, వైఖరి అమలులోకి వస్తుంది, పదేపదే చేసే చర్యలు అలవాట్లను పెంపొందిస్తాయి, అలవాట్లు నా వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తాయి, నా వ్యక్తిత్వం నా విధిని నిర్దేశిస్తుంది. అందువల్ల నేను రోజంతా, నా జీవితమంతా ఎలా అనుభూతి చెందాలనుకుంటున్నానో ఎంచుకుంటాను. నేను ఉపయోగించాల్సిన మరియు నివారించాల్సిన భావోద్వేగాల లిస్ట్ ను నిర్ణయించుకుంటాను. నాకు నచ్చిన విధిని వ్రాసే అధికారం నాకు ఉంది. కాబట్టి నేను సానుకూల ఆలోచనను సృష్టించినప్పుడు, అది సంతోషకరమైన విధిని సృష్టిస్తుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

28th march 2025 soul sustenance telugu

సోషల్ మీడియా లైక్‌లు ముఖ్యమా?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఆధారిత సమాజంలో, మనం పోస్ట్ చేసే దానిపై ప్రజల ఆమోదం పొందడం మన స్వీయ-విలువ మరియు కీర్తికి కొలమానంగా

Read More »
27th march 2025 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు

Read More »
26th march 2025 soul sustenance telugu

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను చాలా బిజీగా ఉన్నాను…నాకు సమయం లేదు అని తరచుగా అంటూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వం మనల్ని సమయానికి ప్రాధాన్యత ఇవ్వనివ్వదు.

Read More »