Hin

23rd november 2024 soul sustenance telugu

November 23, 2024

మన ఆలోచనలు మన విధిని ఎలా సృష్టిస్తాయి (పార్ట్ 1)

సంతోషం అనేది మన విజయాలు, ఆస్తులు మరియు సంబంధాల మీద ఆధారపడదని ఆధ్యాత్మిక జ్ఞానం మనకు బోధిస్తుంది. అయినప్పటికీ, కొన్ని రోజులు మనకు ఆహ్లాదకరంగా, కొన్ని రోజులు ఆందోళనగా అనిపిస్తాయి. కొన్ని రోజులు ఉత్సాహంగా, కొన్ని రోజులు నీరసంగా ఉంటాము. దీని అర్థం కొన్నిసార్లు మన భావాలు మన నియంత్రణలో ఉండవు. వాస్తవం ఏమిటంటే, మనలో ప్రతి ఒక్కరూ మన ఆలోచనా శక్తిని ఉపయోగించి మనం ఎంచుకున్న భావాలను మరియు విధిని సృష్టించవచ్చు. నా ఆలోచనలు నా విధిని ఎలా సృష్టిస్తాయి? దీనికి సమాధానం అనేది మన ఆలోచనల నుండి భావాలు, వైఖరి, చర్యలు, అలవాట్లు, వ్యక్తిత్వం మరియు విధి వరకు ఒక క్రమంలో ముందుకు సాగే సరళమైన పరంపరలా ఉంటుంది. అవి ఎలా పని చేస్తాయో అర్థం చేసుకుందాం.

  1. నా ప్రతి ఆలోచన నా భావాలను సృష్టిస్తుంది.

ఆలోచనలు నా సృష్టి. ప్రతి ఆలోచన ఒక అనుభూతిని కలిగిస్తుంది, నేను ఎలా భావిస్తున్నానో నా ఆలోచన యొక్క నాణ్యత ద్వారా నిర్ణయించబడుతుంది. కాబట్టి నేను ఉద్దేశపూర్వకంగా స్వచ్ఛమైన, సానుకూల ఆలోచనను సృష్టిస్తే, నేను సంతోషంగా ఉంటాను. సంతోషం అనేది ఒక అనుభూతి, ఒక భావోద్వేగం మరియు అనుభవం. అదే విధంగా నేను శాంతి, ప్రేమ, బాధ, కోపం వంటి భావాలను కూడా అనుభూతి చేసుకుంటాను. నేను ఒక ఆలోచనను సృష్టించానని అనుకుందాం – నేను ఈ కార్యాలయంలో పనిచేయడం ఆనందిస్తాను. ఇది సానుకూల భావోద్వేగాన్ని సృష్టిస్తుంది మరియు నేను సంతోషపడతాను. దీనికి విరుద్ధంగా, నేను ఒక ఆలోచనను సృష్టిస్తే – నేను ఇక్కడ పనిచేయడానికి ఇష్టపడను, అది ప్రతికూల భావోద్వేగాన్ని సృష్టిస్తుంది ఇక నేను నిరాశకు గురవుతాను. నా ఆంతరిక శక్తి క్షీణిస్తుంది కాబట్టి నేను బలహీనపడుతున్న కొద్దీ నా ఉద్యోగం మరింత కఠినంగా అనిపిస్తుంది. బదులుగా, నేను ఇలా అనుకుంటే – నాకు కార్యాలయంలో సవాళ్లు ఉన్నాయి కానీ నేను వాటిని ఎదుర్కొంటాను. అప్పుడు నా సానుకూలత వాటిని అధిగమించడానికి నాకు సహాయపడుతుంది.

  1. నా భావాలు నా వైఖరిని పెంపొందిస్తాయి.

నా ఆలోచనలు ప్రతి క్షణం భావాలను సృష్టిస్తాయి అది నా సంబంధాలలో కావచ్చు, కార్యాలయంలో లేదా షాపింగ్ మాల్లో కావచ్చు. ప్రతి ఒక్కరూ వారు వారే, ప్రతీదీ అది అదే. కానీ కొంత కాలానికి వ్యక్తులు మరియు పరిస్థితుల గురించి నేను ఎలా భావిస్తాను అనేది వారి పట్ల నా వైఖరిని అభివృద్ధి చేస్తుంది, నేను వాటిని అంగీకరిస్తానా, గౌరవిస్తానా లేదా తిరస్కరిస్తానా అని నిర్ణయిస్తుంది. కాబట్టి నేను కొంత కాలం పాటు ఈ కార్యాలయంలో పనిచేయడం ఆనందిస్తాను అని ఈ ఒక ఆలోచనను సృష్టిస్తే ఫలితంగా వచ్చే ఆ సంతోషం నా కార్యాలయం గురించి నా వైఖరిని నిర్వచిస్తుంది.

రేపు మనం మన విధిని సృష్టించడానికి దారితీసే మిగిలిన వరుసక్రమము లోకి వెళ్తాము.

(సశేషం…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

28th march 2025 soul sustenance telugu

సోషల్ మీడియా లైక్‌లు ముఖ్యమా?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఆధారిత సమాజంలో, మనం పోస్ట్ చేసే దానిపై ప్రజల ఆమోదం పొందడం మన స్వీయ-విలువ మరియు కీర్తికి కొలమానంగా

Read More »
27th march 2025 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు

Read More »
26th march 2025 soul sustenance telugu

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను చాలా బిజీగా ఉన్నాను…నాకు సమయం లేదు అని తరచుగా అంటూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వం మనల్ని సమయానికి ప్రాధాన్యత ఇవ్వనివ్వదు.

Read More »