HI

Mana jeevitaalalo aadhyaatmikata enduku avasaram

September 3, 2023

మన జీవితాలలో ఆధ్యాత్మికత ఎందుకు అవసరం?

ఆధ్యాత్మికత అనేది ఆత్మను, పరమాత్మను మరియు మన జీవితంలోని విభిన్న కోణాలను పరిచయం చేస్తుంది. విభిన్న కోణాలు అంటే ఏవి  సరైన పనులు, ఏవి సరైనవి కావు అన్న అవగాహన; ఆత్మ అభిమాన స్థితిలో ఉండి సరైన కర్మలను ఎంచుకోవడం ద్వారా మనకు మనం అందమైన విధిని ఎలా ఏర్పరచుకోవచ్చు; మన దైనందిన జీవితంలో దేవునితో సానుకూల సంబంధాన్ని ఎలా ఏర్పరచుకోవచ్చు అనేవి. మన ప్రస్తుత జీవితాల్లో మనకు ఆధ్యాత్మికత ఎందుకు అవసరమో, అది ఎలా మార్పు తీసుకురాగలదో తెలుసుకుందాం.

  1. ఒక్కోసారి మన జీవితాలలో అనేక ప్రతికూల పరిస్థితులు వచ్చేస్తాయి. ఆ సమయంలో ఆత్మ శక్తి తగ్గి ఉన్న కారణంగా మనలోని ఆంతరిక సామార్థ్యము, కష్టాలను ఎదుర్కునే శక్తి తగ్గిపోతాయి. ఈ రెండు అంశాలు మనలోని ఒత్తిడి స్థాయిలను పెంచేసి మన జీవితాలను మరింత కష్టంగా మారుస్తాయి. మన ఒత్తిడి స్థాయిలను తగ్గించి, మన జీవితాలను సులభతరం చేసే ఏకైక పరిష్కారం ఆధ్యాత్మికత.
  2. అలాగే, మనం మన జీవితాలను ఉరుకులు, పరుగులతో జీవిస్తున్నందున మన ఆలోచనలు, ఆరోగ్యం, సంపద, సంబంధాలు మరియు పాత్రల నాణ్యత తగ్గిపోయాయి. ఆందోళన మరియు దుఃఖంలో ఉన్నాము. ఈ ఐదు కోణాలపై మనం మళ్లీ మళ్లీ శ్రద్ధ పెట్టడం అవసరం. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వినడం మరియు మెడిటేషన్ చేయడం మాత్రమే వీటిని పరిష్కరించగలవు మరియు అన్ని సమస్యల నుండి విముక్తి కలిగించగలవు.
  3. పరమాత్మ ఇచ్చిన జ్ఞానం అనుసారంగా, ఈ విశ్వ నాటక రంగంలో ఆత్మ అనేక జన్మలు తీసుకుని తన చివరి దశలో ఉంది. ఈ సుదూర ప్రయాణం తర్వాత ఆత్మ తన జ్ఞానాన్ని, సుగుణాలను, శక్తులను, కళలను కోల్పోయి పవిత్రతను, పాజిటివిటీను, శక్తిని కోల్పోయింది. పరమాత్మతో కనెక్ట్ అవ్వడం ద్వారా మనం మనలను వీటన్నిటితో తిరిగి నింపుకుని, కొంత సమయం ఆత్మల ప్రపంచంలో సేద తీరాక తిరిగి క్రొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తాము.
  4. ఈరోజు మనం మన భౌతిక అస్తిత్వంపై ఎంతగా మమకారాన్ని పెంచుకున్నామంటే కామము, క్రోధము, లోభము, మోహము, అహంకారము, అసూయ, ద్వేషము మరియు భయము వంటి బలహీనతలు మన నిజ స్వభావాలుగా అయిపోయాయి. మనలోని ఆత్మతో మరియు ఆత్మిక తండ్రి అయిన పరమాత్మతో మనకున్న సంబంధాన్ని మనం కోల్పోయాము. ఆధ్యాత్మికత మాత్రమే ఆత్మను శుద్ధి చేస్తుంది మరియు ఆత్మలోని బలహీనతలను మరియు రుగ్మతులను విముక్తి చేస్తుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

19th feb 2024 soul sustenance telugu

గతం నుండి నేర్చుకుందాం

మీరు మీ జీవితంలో వెనక్కి తిరిగి చూసినప్పుడల్లా నిజాయితీగా గతంలో చేసిన పొరపాట్ల నుండి ఏమైనా నేర్చుకున్నారా లేక కేవలం గతంలోనే ఆగిపోతున్నారా? చివరకు గతాన్ని వృధాగా తలుచుకుంటూ చాలా తక్కువ నేర్చుకోవడం జరుగుతుందా?

Read More »
18th feb 2024 soul sustenance telugu

ఆపేక్షలను విడిచిపెట్టండి

మీ సహోద్యోగి సమయానికి ప్రాజెక్టును పూర్తి చేయడంలో మీరు ఎప్పుడూ సహాయం చేస్తూనే వచ్చారు, కానీ ఒక్కసారి మీరు అతడిని సహాయం అడిగితే అతను నిరాకరించాడు. మీరు ఇంటికి చేరుకునేసరికి బాగా అలసిపోయారు. మీ

Read More »
17th feb 2024 soul sustenance telugu

దూకుడు స్పందనలను సమర్థించవద్దు

కొన్ని సందర్భాలలో మన మాటలను, ప్రవర్తనను నియంత్రించుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది, అలాంటప్పుడు మనం దూకుడుగా స్పందించేస్తుంటాం. అప్పుడు మన పొరపాటును అంగీకరించకపోగా, తరచూ మన స్పందనను సమర్థించుకుంటూ ఉంటాము. ఈరోజుల్లో మన పాత్రలు

Read More »