Hin

11th march 2025 soul sustenance telugu

March 11, 2025

మన జీవితంలో ఆధ్యాత్మికత ఎందుకు అవసరం?

ఆధ్యాత్మికత అనేది ఆత్మ, భగవంతుడు మరియు మన జీవితంలోని వివిధ విషయాల యొక్క జ్ఞానాన్ని పరిచయం చేసేది. జీవితంలోని వివిధ విషయాలంటే – సరైన చర్యలు ఏమిటి మరియు తప్పు ఏమిటి, ఆత్మిక స్మృతి యొక్క నమ్మకాల ఆధారంగా చర్యల యొక్క సరైన ఎంపికతో  మన కోసం ఒక అందమైన విధిని ఎలా తయారు చేసుకోవటం, భగవంతునితో సానుకూల సంబంధాన్ని మన రోజువారీ జీవితంలో ఎలా భాగం చేసుకోవాలనే వంటివి. మన ప్రస్తుత జీవితంలో ఆధ్యాత్మికత ఎందుకు అవసరమో, అది ఎలా మార్పు తెస్తుందో తెలుసుకుందాం.

  1. మనం ప్రపంచంలో, మన జీవితంలో ప్రతికూల పరిస్థితుల సంఖ్య వేగంగా పెరుగుతున్న సమయంలో మరియు అదే సమయంలో ఆత్మ శక్తి తగ్గడం వల్ల వాటిని ఎదుర్కోవటానికి మన అంతర్గత స్థితిస్థాపకత లేదా శక్తి తగ్గుతున్న సమయంలో ఉన్నాము. ఈ రెండు అంశాలు మన ఒత్తిడి స్థాయిలను పెంచుతూ మన జీవితాలను మరింత కష్టతరం చేస్తున్నాయి. మన జీవితంలో మన ఒత్తిడి స్థాయిలను తగ్గించి, మన జీవితాలను సులభతరం చేయగల ఏకైక పరిష్కారం ఆధ్యాత్మికత.
  2. అలాగే, మనం మన జీవితాలను వేగంగా గడుపుతున్నందున, మన ఆలోచనలు, ఆరోగ్యం, సంపద, సంబంధాలు మరియు పాత్రల నాణ్యత తగ్గింది. ఈ ఐదు కోణాలకు మళ్లీ మళ్లీ మన దృష్టి అవసరం కాబట్టి మనం ఆందోళన మరియు దుఃఖంలో ఉన్నాము. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వినడం, ధ్యానాన్ని సాధన చేయడం మాత్రమే ఈ కోణాలన్నింటినీ పరిష్కరించగలదు మరియు వారిని అన్ని సమస్యల నుండి విముక్తి చేయగలదు.
  3. భగవంతుడు ఇచ్చిన అనాది ప్రపంచ నాటకం యొక్క జ్ఞానం ప్రకారం, ప్రస్తుతం ఆత్మలైన మనం అనేక జన్మల ప్రయాణం చివరిలో ఉన్నాము. ఆత్మ, సుదీర్ఘ ప్రయాణం తరువాత, దాని జ్ఞానం, సుగుణాలు, శక్తులు మరియు నైపుణ్యాలను కోల్పోయి అంత స్వచ్ఛంగా, సానుకూలంగా మరియు శక్తివంతంగా లేని సమయంలో ఉన్నాము. భగవంతునితో అనుసంధానం కావడం ద్వారా, మనం వీటన్నింటితో మనల్ని మనం నింపుకొని కొద్ది కాలం పాటు పరంధామానికి తిరిగి వచ్చిన తరువాత మళ్ళీ అనేక జన్మల కొత్త ప్రయాణాన్ని ప్రారంభించగలం. .
  4. నేడు, మనం మన భౌతిక గుర్తింపుతో ఎంతగా ముడిపడి ఉన్నామంటే కామం, కోపం, దురాశ, మోహం, అహం, అసూయ, ద్వేషం మరియు భయం వంటి బలహీనతలు మన సహజ స్వభావంగా మారాయి.  అలాగే, మనం ఆధ్యాత్మిక స్వయంతో  మరియు భగవంతుడు-పరమాత్మతో మన అంతర్గత సంబంధాన్ని కోల్పోయాము. ఆధ్యాత్మికత మాత్రమే ఆత్మను శుద్ధి చేసి, ఈ ఆధ్యాత్మిక రుగ్మతలు లేదా అనారోగ్యాల నుండి విముక్తి చేయగలదు.

రికార్డు

28th march 2025 soul sustenance telugu

సోషల్ మీడియా లైక్‌లు ముఖ్యమా?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఆధారిత సమాజంలో, మనం పోస్ట్ చేసే దానిపై ప్రజల ఆమోదం పొందడం మన స్వీయ-విలువ మరియు కీర్తికి కొలమానంగా

Read More »
27th march 2025 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు

Read More »
26th march 2025 soul sustenance telugu

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను చాలా బిజీగా ఉన్నాను…నాకు సమయం లేదు అని తరచుగా అంటూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వం మనల్ని సమయానికి ప్రాధాన్యత ఇవ్వనివ్వదు.

Read More »