మన నమ్మకాలను మార్చుకోవడం తో ఆందోళనను అధిగమించవచ్చు (పార్ట్ 1)

September 16, 2023

మన నమ్మకాలను మార్చుకోవడం తో ఆందోళనను అధిగమించవచ్చు (పార్ట్ 1)

ఆందోళనకు మంచి నిర్వచనం ఏమిటి? ఆందోళన అనేది ఒక నిర్దిష్ట పరిస్థితిలో అతి ఘోరమైన పరిణామం లేదా ఫలితం లేదా భవిష్యత్తును ఊహించుకొని మీ మనసులో అది నిజంగా జరిగినట్లుగా చిత్రాన్ని సృష్టించడం. ఇక ఆ నెగిటివ్ చిత్రం యొక్క శక్తిని ఉపయోగిస్తూ మీ మనసులో దానిని ప్రవహించేలా చేయటం. తద్వారా అది మిమ్ముల్ని ఆధ్యాత్మికంగా, భౌతికంగా బలహీన పరిచి భయాన్ని కలిగిస్తుంది.

ఈ ప్రక్రియ గురించి అడిగినప్పుడు, ఈ ప్రక్రియతో ముడిపడి ఉన్న మరియు రోజంతా వివిధ రకాల పరిస్థితులలో చాలా క్రమం తప్పకుండా ఈ ప్రక్రియలో ఉన్న వ్యక్తి, ఒక అలవాటుగా చింతించే వ్యక్తి ఇలా స్పందిస్తాడు – ఆందోళన చెందడం ముఖ్యం, ఇది మంచిది. మనము వివిధ నెగిటివ్  ఫలితాల గురించి ఆలోచించకపోతే, మనం వాటి కోసం ఎలా తయారుగా ఉంటాము? చింతించడం ద్వారా, భవిష్యత్తులో జరిగే చెడు కోసం మనం సిద్ధంగా ఉంటామనే నమ్మకం తప్పు అని గ్రహించడం ముఖ్యం. చింత కేవలం తప్పుడు, ఫలించని సృష్టి అనే సత్యాన్ని ఈ నమ్మకం మనల్ని  గ్రహించనివ్వదు. ఇది మన మనస్సు, బుద్ధి యొక్క పాజిటివ్, నిర్మాణాత్మక మరియు ఊహాత్మక సామర్థ్యాన్ని తప్పుగా ఉపయోగించడం అవుతుంది. ఇది మనస్సు మరియు బుద్ధిని శక్తివంతం చేయడానికి బదులుగా, వాటిని బలహీనపరుస్తుంది. భవిష్యత్తు కోసం సిద్ధపడడం చాలా ముఖ్యం మరియు అవసరం, కానీ అలా చేస్తున్నప్పుడు, మనం చింతించటం ప్రారంభిస్తాము, అది మనల్ని ఓడిస్తుంది లేదా బలహీనపరుస్తుంది. ఒకవైపు ముందుగానే అవసరమైన ప్రిపరేషన్ చేసుకోవడం మరోవైపు చింత చేయడం – ఈ రెండింటి మధ్య చాలా సన్నని గీత ఉంది.  మనస్సులో నెగిటివ్ ఫలితాలను అధిక సంఖ్యలో సృష్టించకుండా ఈ ప్రిపరేషన్ చేసుకోవచ్చు.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

3rd oct 2023 soul sustenance telugu

   మీ శరీరాన్ని గౌరవించే కళ

మన భౌతిక వస్త్రము అయిన మన శరీరం తరచుగా మన లేదా ఇతరుల అంచనాలకు, విమర్శ లేదా తిరస్కరణకు గురవుతుంది. మన శరీరం జీవితాంతం మనకు ఎన్నో రకాలుగా పని చేసినందుకు అది కృతజ్ఞతలు

Read More »
2nd oct 2023 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు నేను ఎలా భావిస్తున్నాను అనేది జీవితంలో పురోగతికి చాలా ముఖ్యం. అలాగే,

Read More »
1st oct 2023 soul sustenance telugu new

ఇవి ప్రపంచ నాటకం యొక్క చివరి క్షణాలు

ప్రపంచ నాటకం అనేది భూమిపై ఆత్మలందరూ ఆడే ఒక నాటకం, ఇందులో నాలుగు దశలు ఉన్నాయి – సత్యయుగం లేదా స్వర్ణయుగం, త్రేతాయుగం లేదా వెండి యుగం, ద్వాపరయుగం లేదా రాగి యుగం మరియు

Read More »