17th sept 2023 soul sustenance telugu - brahma kumaris | official

September 17, 2023

మన నమ్మకాలను మార్చుకోవడంతో ఆందోళనను అధిగమించవచ్చు (పార్ట్ 2)

నిన్నటి సందేశంలో, ఆందోళన అనేది ఎలా మనస్సు, బుద్ధి యొక్క  పాజిటివ్ మరియు నిర్మాణాత్మక సామర్థ్యాన్ని తప్పుగా ఉపయోగించడం అవుతుందని వివరించాము. మరోవైపు, సాధ్యమయ్యే పాజిటివ్ ఫలితాలను ఊహించడం వల్ల నెగిటివ్ ఫలితాలను మన నుండి దూరంగా ఉంచడమే కాకుండా (అవి సంభవించే అవకాశం ఉన్నప్పటికీ), పాజిటివ్ ఫలితాలను మన వైపుకు ఆకర్షిస్తాయి. కానీ ఈ రెండు ప్రక్రియలు జరిగేలా చూసుకోవడానికి, మీ మనస్సు, బుద్ధి లో కొంచం కూడా నెగిటివ్ ఫలితాలను జోడించకుండా ఉండటం ముఖ్యం. లేకపోతే, పాజిటివ్ భవిష్యత్తు వాస్తవికతగా మారే సంభావ్యత తగ్గుతుంది. ఆందోళన అనేది ఈ అటాచ్‌మెంట్ ప్రక్రియకు మరో పదం.

ఆందోళన అనేది ఒక రకమైన మానసిక అలవాటు, ఇది ఆందోళన చెందడం మంచిదనే నమ్మకం నుండి పుడుతుంది. ఈ నమ్మకం మన చిన్నతనంలోనే అలవడుతుంది. ఆపై అది మన జీవిత అనుభవాలతో బలపడుతుంది. మనము ఈ నమ్మకంతో ప్రారంభిస్తాము. ఇది నెగిటివ్ పరిస్థితులను ఆకర్షిస్తుంది. ఫలితంగా, నమ్మకం మరింత బలపడుతుంది, ఎందుకంటే మనం జీవితంలో చాలా నెగిటివ్ పరిస్థితులతో నిండినందున, నెగిటివ్ ఫలితాల గురించి ముందే ఆలోచించడం చాలా ముఖ్యం అని అనిపిస్తుంది. మొదట ఈ నమ్మకం కారణంగానే, ఈ నెగిటివ్ పరిస్థితులు సంభవించాయని  మనము గ్రహించలేము. మనం నెగిటివ్ పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు, మనం ఆ నమ్మకాన్ని కలిగి ఉన్నందున మళ్లీ ఆందోళన చెందుతాము. మళ్ళీ, ఇది అదే ఫలితం. ఈ విధంగా, మనము ఒక విష చక్రంలో చిక్కుకుంటాము. ఈ చక్రం నుండి మనం ఎలా బయటపడాలి? ఈ నమ్మకాన్ని ఇలా మార్చడం ద్వారా – ఆందోళన చెందడం మంచిది కాదు. ఒకసారి మనం అలా చేస్తే, మన జీవితంలో నెగిటివ్ పరిస్థితులు పూర్తిగా ఆగిపోతాయని ఎటువంటి హామీ లేదు, ఎందుకంటే మనం గతంలో (ఈ జన్మలో లేదా గత జన్మలలో) నెగిటివ్ చర్యలను చేసాము, వాటిని మన వర్తమానంలో తీర్చుకోవాలి, కానీ నెగిటివ్ పరిస్థితుల పరిధి తగ్గుతుంది. మరియు అవి వచ్చినప్పటికీ, మనకు చింత లేని మనస్థితి ఉంటే, అవి  త్వరగా వెళ్లిపోతాయి. 

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

26th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 2)

నిన్నటి సందేశంలో ఆధ్యాత్మిక జ్ఞానం అనే మొదటి అద్దం గురించి చర్చించుకున్నాం. ఈ అద్దం మీకు పరమాత్మను కూడా చూపుతుంది, వారి సద్గుణాలను , పదాలు మరియు చర్యలను గురించి మీకు గుర్తు చేస్తుంది.

Read More »
25th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 1)

మన బాహ్య రూపాన్ని లేదా పరిశుభ్రతను చెక్ చేయడానికి, మనం ప్రతిరోజూ అద్దంలోకి చూస్తాము. కానీ మానసిక, భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక స్థాయిలో, మీ అంతర్గత ముఖం లేదా ఆధ్యాత్మిక స్వయంలో ఏదైనా తప్పు

Read More »
24th-sept-2023-soul-sustenance-telugu

నెగిటివ్ పరిస్థితుల్లో పాజిటివ్ గా ఉండటానికి 5 మార్గాలు

మన జీవితంలో ఏదైనా పరిస్థితి నెగిటివ్ ఫలితాన్ని కలిగి ఉండవచ్చు. కానీ చాలా సార్లు  మనము నెగిటివ్ ఫలితం గురించి ఆలోచించడం ప్రారంభిస్తాము ఇంకా అది జరగడానికి ముందే భయపడతాము. వివేకంతో నిండిన బుద్ధి

Read More »