Hin

11th May 2025 Soul Sustenance Telugu

May 11, 2025

మన పోజిటివిటీ కవచాన్ని బలంగా చేసుకోవటం

మనమందరం కఠినమైన సమయాలను ఎదురవుతున్నాము మరియు జీవితం మనపై వివిధ నెగెటివ్  పరిస్థితుల బాణాలను మళ్లీ మళ్లీ విసురుతుంది. మనందరికీ పాజిటివిటీ అనే కవచం ఉంది. ఈ విభిన్న నెగెటివ్ పరిస్థితుల నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి ఆ కావచాన్ని ఉపయోగిస్తాము. కొన్నిసార్లు మన కవచం తగినంత బలంగా ఉండదు మరియు జీవితపు యుద్ధభూమిలో కొన్ని బాణాలు మనల్ని బలంగా తాకుతాయి. దాని ఫలితంగా మనం మానసికంగా గాయపడతాము. ఈ సందేశంలో మనం మన పాజిటివ్ కవచాన్ని ఎలా పటిష్టం చేసుకోవాలో చూద్దాం –

 

  1. రోజంతా ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క పాజిటివ్ ఆలోచనను ఎల్లప్పుడూ మీ స్మృతిలో ఉంచండి. ఖాళీ మనస్సు మన పాజిటివిటీ కవచాన్ని బలహీనపరుస్తుంది.

 

  1. అడుగడుగునా భగవంతుని తోడును మీతో ఉంచుకోండి. భగవంతుడు శాంతి, ఆనందం, ప్రేమ, స్వచ్ఛత, శక్తి మరియు సత్యతా సాగరులు. ఈ సద్గుణాలు మీ పాజిటివిటీ కవచాన్ని బలంగా చేస్తాయి.

 

  1. కఠిన పరిస్థితులు సవాలు చేసినప్పుడు ఫుల్ స్టాప్ పెట్టండి. పెద్ద సంఖ్యలో నెగెటివ్ మరియు వ్యర్థ ఆలోచనలను చేసి పరిస్థితిని పెద్దగా చేయవద్దు.

 

  1. ఆందోళన నెగెటివ్ శక్తి అని మీకు మీరే చెప్పుకోండి. జీవితం మీపై విసిరే నెగెటివ్ బాణాలు, చింతించటం ద్వారా మీ నుండి ప్రయోజనం పొంది మిమ్మల్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి.

 

  1. నెగెటివ్ పరిస్థితి ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి. ఇలా మీరు ఎంత ఎక్కువ చేస్తే, అంత మీ ఆత్మ శక్తి వృధా అవ్వదు మరియు మీరు బలంగా ఉంటారు.

 

  1. మీ లోపల ఎదుర్కొనే శక్తిని ఎమర్జ్ చేయండి. మీరు ఓటమి అంగీకరించనంత వరకు యుద్ధంలో  గెలవగలరని గుర్తుంచుకోండి. ఇది పరిష్కారాలను ఆకర్షిస్తుంది మరియు బాణాలు మిమ్మల్ని తాకని భద్రతకు తీసుకెళ్తుంది.

 

  1. ఇవ్వడం అనేది పాజిటివ్ మరియు స్వచ్ఛమైన చర్యలను ప్రదర్శించే అందమైన కళ. గుణాలు మరియు శక్తులను ఇతరులతో పంచుకోవడం ద్వారా, మనం జీవితపు యుద్ధభూమిలో పాజిటివిటీ యొక్క బాణాలను పంపుతాము మరియు అవి నెగెటివ్ బాణాలను తగ్గిస్తాయి.

 

  1. అంతర్ముఖత అనే కళను అభ్యసించండి. తాబేలు దాని పెంకు లోపలికి వెళ్లినట్లే, మీ కర్మేంద్రియాల నుండి మీకు మీరు వేరు అయ్యి, మీ చేతనాన్ని అనుభూతి చేయండి అప్పుడు మీ కవచం మిమ్మల్ని బాగా రక్షిస్తుంది.

రికార్డు

15th June 2025 Soul Sustenance Telugu

వ్యక్తులు మీపై ఆధారపడేలా చేయవద్దు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు కొంతమందికి లేదా కొన్ని పరిస్థితులకు మనమే ఎంతో ముఖ్యమని, మనం లేకుండా వారు జీవితాన్ని గడపలేరనే నమ్మకంతో మనం తరచుగా జీవిస్తుంటాము.

Read More »
14th June 2025 Soul Sustenance Telugu

భగవంతుడు – ఈ సృష్టి యొక్క ఆది బిందువు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు భగవంతుడు సర్వ శక్తివంతుడు. వారు ఉంటేనే ఈ ప్రపంచం ఉంటుంది, ఎందుకంటే ఈ ప్రపంచంలో  మంచితనం మరియు దైవత్వం క్షీణించిన ప్రతిసారీ

Read More »
13th June 2025 Soul Sustenance Telugu

మిమ్మల్ని మీరు ఎలా ఆశీర్వదించుకోవాలి?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన జీవితంలో సాధువులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కుటుంబం మరియు స్నేహితుల ఆశీర్వాదాల శక్తిని మనమందరం పొందాము. ఆశీర్వాదం అంటే వారందరూ మన

Read More »