Hin

1st march 2025 soul sustenance telugu

March 1, 2025

మన సంబంధాలను మంచిగా మార్చుకోవడానికి 5 మార్గాలు (పార్ట్ 2)

  1. స్వయం కొరకు ధృవీకరణలను చేసుకోవడంతో పాటు, సంబంధాలను బలోపేతం చేసి, మరింత మంచిగా చేసే చాలా ముఖ్యమైన గుణం ఇతరులను గౌరవించడం.  ఈ రోజుల్లో సంబంధాలలో లోతైన గౌరవం లేకపోవడం లేదా అది ఉన్నప్పటికీ, ఎల్లప్పటికీ ఎందుకు ఉండటం లేదు?  వ్యక్తులు ఎందుకు అంత అహంభావంగా మారారు మరియు ఒక చిన్న ప్రతికూల పరిస్థితి కూడా ఇద్దరు వ్యక్తుల మధ్య పంచుకునే గౌరవాన్ని మరచిపోయేలా చేస్తుంది.  ఈ రోజు, ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు ఎంతో గౌరవించుకోవడాన్ని మీరు చూస్తారు మరియు ఒకటి లేదా రెండు సంవత్సరాల తరువాత, వారు ఒకరినొకరు చూసుకోరు.  సంబంధాల్లో ఏం సరిగా జరగడం లేదు?  ఇతరులకు, ఇతరుల సంస్కారాలకు, ఇతరుల ఆసక్తులకు, ఇతరుల అభిప్రాయాలకు, ఇతరుల జీవనశైలికి, ఇతరుల పని విధానాలకు గౌరవం ఇవ్వడం మరియు స్వయం గురించి మాత్రమే ఆలోచించకుండా ఉండటం సంబంధాలను ప్రియంగా చేస్తూ ఎక్కువ కాలం నిలుపుకునేలా చేస్తాయి. తనను తాను గౌరవించుకునేవాడు లేదా మంచి సానుకూల ఆత్మగౌరవం ఉన్నవాడు, ఇతరులను ఎక్కువగా గౌరవించేవాడు అని గుర్తుంచుకోండి. మంచి సంబంధానికి మొదటి అడుగు ప్రతి ఉదయం సానుకూల స్వీయ ధృవీకరణ – నేను ఈ ప్రపంచంలో ప్రత్యేకమైన మరియు విశేషమైనవాడిని అలాగే ఇతరులు కూడా. నన్ను నేను గౌరవించుకుంటాను, మరొకరిని గౌరవిస్తాను.  నేను ఇతరులను తమంతట తాముగా ఉండటాన్ని అంగీకరిస్తాను.  అదే నిజమైన గౌరవం.
  2. ఈ ప్రపంచంలో ప్రతి ఆత్మ యొక్క ఒక మంచి గుణం  ప్రేమ. ప్రతి మానవుడికి సంబంధాలు ప్రేమను ఇవ్వడానికి, తీసుకోవడానికి ఒక మాధ్యమం. కొన్నిసార్లు కొందరి ప్రేమ షరతులతో కూడుకున్నది మరియు స్వార్థపూరిత కోరికలపై ఆధారపడి ఉంటుంది.  వారి కోరికలు నెరవేరినంత కాలం, వారు మరొకరి పట్ల ప్రేమతో నిండి ఉంటారు.  అవతలి వ్యక్తి వారి కోరికలను నెరవేర్చలేకపోయిన క్షణం, వారు ప్రతీకారంగా మరియు చేదుగా మారవచ్చు.  ఇది అబద్ధపు ప్రేమ.  కాబట్టి, నిజమైన మరియు బేషరతు ప్రేమతో నిండి ఉండటం దీర్ఘకాలిక సానుకూల సంబంధాలకు కీలకం. ఈ రకమైన ప్రేమను పంచుకోవడం ఇతరులతో విభేదాలను పరిష్కరిస్తుంది మరియు మిమ్మల్ని వారితో ఎల్లప్పుడూ ఐక్యంగా, దృఢంగా అనుసంధానిస్తుంది.

(సశేషం…)

రికార్డు

20th march 2025 soul sustenance telugu

సంబంధాల్లో కలిగే బాధ నుండి విముక్తిని పొందడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితంలోని వివిధ రంగాలలో వేర్వేరు సంబంధాలలోకి వచ్చినప్పుడు, కొన్నిసార్లు మన అంతర్గత ప్రపంచంలోకి మరొక ఆత్మను అనుమతించినప్పుడు, మనల్ని వారు అర్థం

Read More »
19th march 2025 soul sustenance telugu

జీవితంలోని వివిధ దృశ్యాలలో సాకులు చెప్పడం మానుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలా మంది మన విశ్వసనీయతను కాపాడుకోవడానికి, ఇతరులపై లేదా పరిస్థితులపై నిందలు వేయడానికి సాకులు చెబుతారు. కొన్నిసార్లు మనకు, మన

Read More »
18th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు అంతర్గత బలం యొక్క సానుకూల సంస్కారాలను సృష్టించడానికి, మనం ముందుగా పట్టుదల యొక్క మొదటి అడుగు వేయాలి. పట్టుదల అంటే నేను

Read More »