Hin

28th feb 2025 soul sustenance telugu

February 28, 2025

మన సంబంధాలను మంచిగా మార్చుకోవడానికి 5 మార్గాలు (పార్ట్ 1)

మనమందరం ఒక సన్నిహిత ప్రపంచంలో జీవిస్తున్నాము, ఇక్కడ సంబంధాలు మనందరినీ దగ్గరగా కలిపే ముఖ్యమైన జీవిత మాధ్యమం. నేడు, దురదృష్టవశాత్తుగా సంబంధాలు గతంలో ఉన్నంత లోతైనవి మరియు అర్ధవంతమైనవిగా లేవు. త్వరగా విడాకులు మరియు స్నేహంలో, కార్యాలయంలో లేదా కుటుంబంలో లేదా కుటుంబం వెలుపల, అనేక ఇతర రకాల సంబంధాలలో ప్రియమైనవారితో అకస్మాత్తుగా విడిపోవడం గురించి మనం సాధారణంగా వింటున్నాము. మనం ఎక్కడికి వెళుతున్నాం? ఈ రోజుల్లో సంబంధాలు ఎందుకు ఇంత బలహీనంగా ఉన్నాయి? సంబంధాలు ఉన్నప్పటికీ, వాటి వలన  కలిగే సంతోషం తక్కువగా ఉంటుంది. మనుషులు మునుపటి కంటే ఒకరితో ఒకరు తక్కువ సంతృప్తి చెందుతున్నారు మరియు మునుపటి కంటే చాలా ఎక్కువగా సంబంధాల చుట్టూ కోపం, అహం, అసూయ, స్వాధీనత మరియు అభద్రత ఉన్నాయి. ఇతరులతో తమ సంబంధ సమస్యలను బహిర్గతం చేయలేక నిశ్శబ్దంగా బాధపడుతున్న వ్యక్తులు కూడా ఉన్నారు. మన సంబంధాలను బలోపేతం చేయడానికి మరియు స్థిరమైన శాంతి, ప్రేమ, ఆనందం యొక్క సరైన పునాదిపై ఆధారపడిన కొన్ని ప్రాథమిక పద్ధతులను చూద్దాం –

 

  1. అందమైన ధృవీకరణల ద్వారా మిమ్మల్ని మీరు శాంతి, ప్రేమ మరియు ఆనందంతో నింపుకోవడానికి ప్రతిరోజూ కొన్ని నిమిషాలు ఇవ్వండి. శాంతి, ప్రేమ మరియు ఆనందంతో నిండిన మీ స్వభావం గురించి క్రమం తప్పకుండా మిమ్మల్ని మీరు ధృవీకరించుకోవడం ఆ స్వభావాన్ని మరింత బలోపేతం చేస్తుంది. మీ సంస్కారాలు ఈ మూడు సుగుణాలతో ఎంత ఎక్కువగా ఉన్నాయో, మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యలు కూడా ఈ సుగుణాలతో అంత ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా, మీ సంబంధాలు కూడా ఈ సుగుణాల ప్రతిబింబంగా మారతాయి. సంబంధాలు కూలిపోవడానికి అత్యంత ముఖ్యమైన కారణం అంతర్గత శూన్యత మరియు ఈ సుగుణాలను అవతలి వ్యక్తితో పంచుకోలేకపోవడం. అన్ని సంబంధాలలో చాలా సమస్యలకు ఆపేక్షలే విత్తనాలు. శాంతి, ప్రేమ మరియు ఆనందం యొక్క సుగుణాలు మనుషుల లోపల తగినంతగా లేనందున అన్ని ఆపేక్షలు ఉన్నాయి.

(సశేషం…)

రికార్డు

28th march 2025 soul sustenance telugu

సోషల్ మీడియా లైక్‌లు ముఖ్యమా?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఆధారిత సమాజంలో, మనం పోస్ట్ చేసే దానిపై ప్రజల ఆమోదం పొందడం మన స్వీయ-విలువ మరియు కీర్తికి కొలమానంగా

Read More »
27th march 2025 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు

Read More »
26th march 2025 soul sustenance telugu

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను చాలా బిజీగా ఉన్నాను…నాకు సమయం లేదు అని తరచుగా అంటూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వం మనల్ని సమయానికి ప్రాధాన్యత ఇవ్వనివ్వదు.

Read More »