Hin

28th august 2024 soul sustenance telugu

August 28, 2024

మన విధి నిర్ణయించబడి ఉంటుందా లేదా మనం దానిని మార్చగలమా?

వేలాది సంవత్సరాలుగా అందరూ అడిగే చాలా సాధారణ ప్రశ్న ఏమిటంటే, మన విధి నిర్ణయించబడే ఉంటుందా లేదా మన విధిని మార్చగలమా? మన జీవితంలో మనం కష్టమైన పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడల్లా, ఇది మన గత చర్యల ఫలితమా అని మనం తరచుగా ఆశ్చర్యపోతాము. మన ప్రస్తుత జన్మలో, గత జన్మల యొక్క ఈ ప్రతికూల చర్యల ప్రభావాన్ని తిప్పికొట్టవచ్చా లేదా ఆపవచ్చా అని కూడా మనం అనుకుంటాము. కాబట్టి, మనం ఏమి చేయాలి, ఎక్కడ ప్రారంభించాలి? అన్నింటిలో మొదటిది, మానవ ఆత్మలందరూ వారి వేర్వేరు జన్మలలో సానుకూల చర్యలతో పాటు కొన్ని ప్రతికూల చర్యలను చేసారని మనం చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. కానీ గమనించదగ్గ చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, కొందరు తక్కువ ప్రతికూల చర్యలను చేసారు, మరికొందరు వాటిని ఎక్కువ చేసారు. కాబట్టి, దీని ఫలితంగా, ఈ రోజు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో ఒక ప్రతికూల పరిస్థితిని లేదా పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మన విధిని భగవంతుడు సృష్టించి వ్రాసారని, మన జీవితంలో జరుగుతున్న ప్రతిదీ-మంచి లేదా చెడు అయినా, భగవంతుడు నిర్ణయిస్తాడని ప్రపంచంలో ఒక సాధారణ నమ్మకం ఉంది. కానీ భగవంతుడు ఇచ్చిన ఆధ్యాత్మిక జ్ఞానం ప్రకారం, ఇది సరైన నమ్మకం కాదు. భగవంతుడు మన జీవిత పరిస్థితులను నిర్ణయించడు. మన జీవితంలో ఏదైనా మంచి జరిగినప్పుడల్లా, అది ఎల్లప్పుడూ గతంలోని మన మంచి చర్యల ఫలితంగా ఉంటుంది. అలాగే భగవంతుని సహాయం వల్ల, ఇది కొన్ని పరిస్థితులలో ఉంటుంది, కానీ అన్నింటిలో ఉండదు. మరోవైపు, మన జీవితంలో ఏదైనా ప్రతికూలంగా జరిగినప్పుడల్లా, అది గతంలోని మన తప్పుడు చర్యల ఫలితం మాత్రమే. మన ప్రతికూల చర్యలకు భగవంతుడు మనలను శిక్షించడు.

కాబట్టి, మన గత చర్యల ఆధారంగా మనందరికీ ఒక విధి ఉంటుంది. కానీ, అదే సమయంలో భగవంతుని మార్గదర్శకత్వం, వారు ఇచ్చిన ఆధ్యాత్మిక జ్ఞానం ప్రకారం, ప్రస్తుతం మన విధిని మార్చుకోవడానికి మూడు మార్గాలు ఉన్నాయి – 1. ధ్యానంలో భగవంతుడిని గుర్తు చేసుకోండి, వారి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వినండి, ఇది ఆత్మను శుద్ధి చేస్తుంది. ఆత్మలోని ప్రతికూల గత చర్యల భారాన్ని తొలగిస్తుంది. 2. ఆత్మను శాంతి, ఆనందం, ప్రేమ, సుఖం, స్వచ్ఛత, శక్తి మరియు జ్ఞానం అనే ఏడు ప్రాథమిక సుగుణాలతో నింపే అనేక సానుకూల చర్యలను చేయండి. అవి ఇతరులలో కూడా ఆ సుగుణాలను పెంచుతాయి. 3. ఆలోచనల్లో, మాటల్లో, చేతల్లో 5 ప్రధాన దుర్గుణాలు – కామం, కోపం, దురాశ, మొహం మరియు అహం నుండి విముక్తి పొంది స్వచ్ఛమైన జీవనశైలిని గడపండి. మనం ఈ మూడింటినీ చేసినప్పుడు ఆత్మ శుద్ధి అవుతుంది. మంచితనం, ఇచ్చేటువంటి యొక్క సానుకూల సంస్కారాలను కూడా సృష్టిస్తుంది. ఆత్మ లోపల ఈ మార్పులు దాని విధిని మార్చి జీవితంలో మరింత సానుకూల, అందమైన పరిస్థితులను ఆకర్షిస్తుంది.  దాని ప్రతికూల పరిస్థితులను సానుకూల పరిస్థితులకు మారుస్తాయి. అవి ఆత్మ యొక్క భవిష్యత్ జన్మలను సానుకూలత మరియు విజయాలతో నింపుతాయి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

[drts-directory-search directory="bk_locations" size="lg" style="padding:15px; background-color:rgba(0,0,0,0.15); border-radius:4px;"]

రికార్డు

11th july 2025 soul sustenance telugu

చెడు శకునాలు మరియు మూఢనమ్మకాల ప్రభావం నుండి అతీతంగా అవ్వండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు కొన్ని గ్రహాలు, ప్రదేశాలు, సంఖ్యలు, రంగులు, వస్తువులు, వ్యక్తులు మరియు భౌతిక శరీరాల వెలుపల సూక్ష్మ శరీరాలలో ఉండే కొన్ని ఆత్మల

Read More »
10th july 2025 soul sustenance telugu

నా భాగ్యానికి ఎవరు బాధ్యులు?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలామంది భగవంతుడు మన భాగ్యాన్ని వ్రాస్తాడని నమ్ముతాము. ఈ నమ్మకం గురించి  మనం ఆలోచించి ఆత్మపరిశీలన చేసుకోవాలి. భగవంతుడు మన

Read More »
9th july 2025 soul sustenance telugu

ఆరోగ్యకరమైన వర్క్-లైఫ్ బ్యాలన్స్ ను సాధించడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితం ఒక ప్రవాహంవంటిది, కనుక, మనం మన బాధ్యతల ప్రాధాన్యతలను మారుస్తూ ఉండాలి, మనకు మద్దతు ఇచ్చే జీవితంలోని అన్ని అంశాల

Read More »