Hin

17th-oct-2023-soul-sustenance-telugu

October 17, 2023

మనకి మనమే ఎమోషనల్ డిటాక్స్ చేసుకోవాలి

ప్రతి కొన్ని నిమిషాలకు వివిధ మీడియా నుండి వచ్చే సందేశాలను చదవడానికి మీ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌ని చెక్ చేసే అలవాటు మీకు ఉందా? ఆ సమాచారం యొక్క క్వాలిటీని మీరు తెలుసుకోగలుగుతున్నారా? మీరు వచ్చే ప్రతిదాన్ని వింటున్నారా, చదువుతున్నారా మరియు చూస్తున్నారా? ఆహారం శరీరానికి పోషణనిచ్చినట్లే, సమాచారం మనసుకు పోషణనిస్తుంది. మనం తెలుసుకునే ప్రతి సమాచారం మన ఆలోచనలకు మూలం. ఈ రోజు మన ఫోన్‌లే కాదు, మన మనస్సు కూడా సమాచారంతో నిండిపోయింది. వార్తలు మరియు వినోదం పేరుతో మనము హింస, ద్వేషం, అపహాస్యం మరియు కుతంత్రలు వినియోగిస్తున్నాము. కాబట్టి మన ఆలోచనలు కోపం, భయం మరియు ఒత్తిడి యొక్క ఛాయలను ప్రతిబింబిస్తాయి. మనం చదివేది, చూసేది, వినేది ఎలా ఉంటుందో అలానే ఉంటాము. మన ఆలోచనలను స్వచ్ఛంగా మరియు పాజిటివ్ గా ఉంచడానికి, మనం తీసుకునే సమాచారాన్ని ఫిల్టర్ చేయాలి. మరో సారి మనకు ఏదైనా సందేశం వచ్చినప్పుడు, నేను ఎమోషనల్ డైట్‌లో ఉన్నాను అనే దృఢ సంకల్పాన్ని  చేద్దాము. నేను తీసుకునే మరియు ఇతరులతో పంచుకునే సమాచారం స్వచ్ఛమైనది, సానుకూలమైనది మరియు శక్తివంతమైనది. నాలో ఆనందం, సామరస్యం, దయ, పంచుకోవడం మరియు శ్రద్ధలను నింపుతుంది. నేను నెగిటివ్ మెసేజ్‌లను చూడకుండానే తొలగిస్తాను. నేను నా మనస్సు, బుద్ధిని ఎల్లప్పుడూ పాజిటివ్ గా మరియు శుభ్రంగా ఉంచుకుంటాను.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

22nd march 2025 soul sustenance telugu

మెడిటేషన్ అనే బ్రహ్మ ముడి (పార్ట్ 1)

మెడిటేషన్ అనే బ్రహ్మ ముడి (భాగం 1) మీ ప్రతిరోజును ప్రకాశవంతంగా ప్రారంభించడానికి మీ వ్యక్తిగత, వృత్తిపరమైన మరియు సామాజిక జీవితంలో దిన చర్యను సెట్ చేసుకోవాలి. దానితో పాటు, మనస్సు మరియు బుద్ధి

Read More »
20th march 2025 soul sustenance telugu

సంబంధాల్లో కలిగే బాధ నుండి విముక్తిని పొందడం (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనం బాధపడినప్పుడు, కొన్నిసార్లు ఇతరులను క్షమించడం మనకు కష్టమవుతుంది. క్షమాపణ మాత్రమే ప్రతికూలతను కరిగించడానికి సహాయపడుతుందని మనం గుర్తుంచుకుంటే, అది జీవితంలో

Read More »
20th march 2025 soul sustenance telugu

సంబంధాల్లో కలిగే బాధ నుండి విముక్తిని పొందడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితంలోని వివిధ రంగాలలో వేర్వేరు సంబంధాలలోకి వచ్చినప్పుడు, కొన్నిసార్లు మన అంతర్గత ప్రపంచంలోకి మరొక ఆత్మను అనుమతించినప్పుడు, మనల్ని వారు అర్థం

Read More »