Hin

26th April 2025 Soul Sustenance Telugu

April 26, 2025

మనకు మనమే ఎమోషనల్ డిటాక్స్ చేసుకోవాలి

ప్రతి కొన్ని నిమిషాలకు వివిధ మీడియా నుండి వచ్చే సందేశాలను చదవడానికి మీ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌ని చెక్ చేసే అలవాటు మీకు ఉందా? ఆ సమాచారం యొక్క క్వాలిటీని మీరు తెలుసుకోగలుగుతున్నారా? మీరు వచ్చే ప్రతిదాన్ని వింటున్నారా, చదువుతున్నారా మరియు చూస్తున్నారా? ఆహారం శరీరానికి పోషణనిచ్చినట్లే, సమాచారం మనసుకు పోషణనిస్తుంది. మనం తెలుసుకునే ప్రతి సమాచారం మన ఆలోచనలకు మూలం. ఈ రోజు మన ఫోన్‌లే కాదు, మన మనస్సు కూడా సమాచారంతో నిండిపోయింది. వార్తలు మరియు వినోదం పేరుతో మనము హింస, ద్వేషం, అపహాస్యం మరియు కుతంత్రలు వినియోగిస్తున్నాము. కాబట్టి మన ఆలోచనలు కోపం, భయం మరియు ఒత్తిడి యొక్క ఛాయలను ప్రతిబింబిస్తాయి. మనం చదివేది, చూసేది, వినేది ఎలా ఉంటుందో అలానే ఉంటాము. మన ఆలోచనలను స్వచ్ఛంగా మరియు పాజిటివ్ గా ఉంచడానికి, మనం తీసుకునే సమాచారాన్ని ఫిల్టర్ చేయాలి. మరో సారి మనకు ఏదైనా సందేశం వచ్చినప్పుడు, నేను ఎమోషనల్ డైట్‌లో ఉన్నాను అనే దృఢ సంకల్పాన్ని  చేద్దాము. నేను తీసుకునే మరియు ఇతరులతో పంచుకునే సమాచారం స్వచ్ఛమైనది, సానుకూలమైనది మరియు శక్తివంతమైనది. నాలో ఆనందం, సామరస్యం, దయ, పంచుకోవడం మరియు శ్రద్ధలను నింపుతుంది. నేను నెగిటివ్ మెసేజ్‌లను చూడకుండానే తొలగిస్తాను. నేను నా మనస్సు, బుద్ధిని ఎల్లప్పుడూ పాజిటివ్ గా మరియు శుభ్రంగా ఉంచుకుంటాను. 

 

మనలో కొంతమందికి వాస్తవ ప్రపంచంతో మళ్లీ కనెక్ట్ కావటానికి డిజిటల్ ప్రపంచం సవాలుగా మార్చేసింది. మీడియా మన గాడ్జెట్‌లను నింపడంతో, మనందరికీ సమాచార డోస్ ఎక్కువ అవుతుంది. చాలా సందేశాలు నెగిటివ్ కథనాలపై దృష్టి సారిస్తాయి, వ్యక్తులు, విషయాలు మరియు ప్రపంచం గురించి నెగిటివ్ అభిప్రాయాన్ని తెలియజేస్తాయి, మన మనసులలో నెగిటివిటీ స్థాయిలను పెంచుతాయి.  మీ రోజువారీ మీడియాను మీరు  ఎలా నియంత్రిస్తున్నారో చూసుకోండి. పాజిటివ్ ఆలోచనలు, భావాలను మాత్రమే రచించడానికి, మీరు పాజిటివ్ సమాచారాన్ని మాత్రమే తీసుకోవాలి, ఇది మీ మనస్సుకు ముడి పదార్థం. వినోదం లేదా అన్నీ తెలిసి ఉండాలి అనే పేరుతొ గాసిప్ చేయడం, అంచనాలు వేయడం మరియు అవమాన పరుస్తూ ఉంటాము. వీటిని నివారించగలిగితే, మనకు మనమే చాలా సహాయం చేసుకోగలం. తక్కువ అలజడి  మరియు ఎక్కువ సమయంతో, మీ రోజులు మరింత ఉత్పాదకంగా మరియు రిలాక్స్‌గా ఉంటాయి. కాబట్టి ఆన్‌లైన్‌లో మీ సమయాన్ని ఎంజాయ్ చేయండి, కానీ ఎప్పుడూ మీరు తీసుకునే వాటిపై అంతర్గతంగా అవగాహన కలిగి ఉండండి.

రికార్డు

22nd May 2025 Soul Sustenance Telugu

భోజనం చేసే ముందు భగవంతునికి ఆహారాన్ని అర్పించడం వల్ల కలిగే 7 ప్రయోజనాలు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన ఆధ్యాత్మిక జీవితంలో మనం అలవర్చుకోవల్సిన ఒక అందమైన అలవాటు, భగవంతుని ధ్యానంలో ప్రతి భోజనాన్ని వండడం. అలాగే, ఒక రోజులో

Read More »
21st May 2025 Soul Sustenance Telugu

మీ వాస్తవిక సత్య గుణానికి తిరిగి వెళ్లడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సత్యం మన వాస్తవిక గుణం, కానీ ఎప్పటికప్పుడు మన సౌలభ్యం కోసం లేదా స్వల్పకాలిక లాభాల కోసం అబద్ధాలు చెబుతాము. ఆసక్తికరమైన

Read More »
20th May 2025 Soul Sustenance Telugu

మీ పిల్లలతో తగినంత సమయం గడపకపోవడంపై అపరాధ భావాన్ని అధిగమించండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు వివిధ రకాల వ్యక్తిగత మరియు వృత్తిపరమైన నిబద్ధతలను గౌరవించేటప్పుడు, చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు తగినంత నాణ్యమైన సమయాన్ని ఇవ్వకపోవడం

Read More »