Manam bhagavantuni hrudayaanni geluchukunnaamaa

September 11, 2023

మనం భగవంతుని హృదయాన్ని గెలుచుకున్నామా?

జన్మజన్మలుగా భగవంతుడే మనకు అతి సన్నిహితుడు మరియు అత్యంత ప్రియమైనవాడు. మన మనసును ఎంత స్వచ్ఛంగా పెట్టుకున్నాము, చేసే ప్రతి దానిలో ఎంత నిజాయితీగా ఉన్నాము అన్నదానిబట్టే భగవంతుడు మనల్ని ఇష్టపడతాడు. ఇదే భగవంతుడి హృదయంలో స్థానం సంపాదించుకోవడానికి ఆధారం. దీనినిబట్టే భగవంతుడు మనల్ని ప్రేమ, గౌరవాలతో చూస్తారు. ఇది తెలిసీ మనం తప్పుగా ఆలోచిస్తాము, మాట్లాడుతాము, పనులు చేస్తుంటాము.  తప్పుడు కర్మలు మనల్ని భగవంతుడితో కనెక్ట్ అవ్వనివ్వవు, పైగా జీవితంలో బాధ మిగులుతుంది. ఎందుకంటే ఆ సమయంలో మనం కర్మ సిద్ధాంతానికి విరుద్ధంగా వెళ్తూ పరమాత్మ దీవెనలకు దూరమవుతున్నాము. నిజాయితీ మరియు పవిత్రత లేని కర్మలను చేయడం వలన మనం ఆత్మ గౌరవాన్ని, ఇతరులిచ్చే గౌరవాన్ని, ముఖ్యంగా భగవంతుడిచ్చే గౌరవాన్ని కోల్పోతున్నాము. ఇతరులకు ఎంత సంతోషాన్నిచ్చాము అనే దానిబట్టే మనకు భగవంతుని ప్రేమ లభిస్తుంది, వారి హృదయంలో స్థానం లభిస్తుంది ఎందుకంటే ఇతరులను నిరంతరం ప్రేమించే వారిని, ఇతరుల గురించి నెగిటివ్ ఆలోచించకుండా, మాట్లాడకుండా, వారితో నెగిటివ్‌గా వ్యవహరించకుండా ఉండేవారినే భగవంతుడు ప్రేమిస్తాడు.

             ఉదయాన్నే రోజూ భగవంతుని ప్రేమను మనసులో నింపుకున్నప్పుడు వారి బోధనలను గౌరవించాలన్న జాగ్రత్త, వారి చెప్పిందే చేయాలన్న ఆలోచన మనలో రోజంతా ఉంటాయి. భగవంతునికి అప్రియమైన వాటిని చేస్తున్నానా అని జాగ్రత్తగా స్వయాన్ని అలర్టుగా పరిశీలించుకుంటూ ఉండాలి. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే దానిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. ఇది ఎంతగా దృఢంగా చేస్తుంటామో, అంతగా మన జీవితం దోషరహితంగా, సమస్యారహితంగా ఉంటుంది. మన ఆలోచనలు, మాటలు మరియు చేతలతో మనం చేసే తప్పులే మన బాధలకు కారణం అని మనకు తెలుసు. మనల్ని భగవంతుడికి దగ్గరగా చేర్చి, వారి హృదయంలో స్థానం సంపాదించేలా చేసే మరో అంశం – ప్రతి కర్మలో వారిని స్మృతి చేస్తూ వారిచ్చిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆలోచనలో, మాట మరియు కర్మలో ఉపయోగించడమే. అలాగే, పరమాత్మ ఇచ్చిన జ్ఞానాన్ని, సుగుణాలను మరియు శక్తులను మనం ఎంతమందికి పంచాము, ఎంతమందిని భగవంతునికి దగ్గరగా తీసుకువచ్చాము అన్నదానిపై కూడా భగవంతుని హృదయంలో మన స్థానం ఆధారపడి ఉంటుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

3rd oct 2023 soul sustenance telugu

   మీ శరీరాన్ని గౌరవించే కళ

మన భౌతిక వస్త్రము అయిన మన శరీరం తరచుగా మన లేదా ఇతరుల అంచనాలకు, విమర్శ లేదా తిరస్కరణకు గురవుతుంది. మన శరీరం జీవితాంతం మనకు ఎన్నో రకాలుగా పని చేసినందుకు అది కృతజ్ఞతలు

Read More »
2nd oct 2023 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు నేను ఎలా భావిస్తున్నాను అనేది జీవితంలో పురోగతికి చాలా ముఖ్యం. అలాగే,

Read More »
1st oct 2023 soul sustenance telugu new

ఇవి ప్రపంచ నాటకం యొక్క చివరి క్షణాలు

ప్రపంచ నాటకం అనేది భూమిపై ఆత్మలందరూ ఆడే ఒక నాటకం, ఇందులో నాలుగు దశలు ఉన్నాయి – సత్యయుగం లేదా స్వర్ణయుగం, త్రేతాయుగం లేదా వెండి యుగం, ద్వాపరయుగం లేదా రాగి యుగం మరియు

Read More »