Hin

Manam emotional gaa undaala vaddaa

September 7, 2023

మనం ఎమోషనల్‌గా ఉండాలా వద్దా (పార్ట్ 2)

నిన్నటి సందేశాన్ని కొనసాగిద్దాం, ఇస్తూ ఉంటే భావోద్వేగ శక్తి వస్తుంది. తీసుకోవడమే మన లక్ష్యంగా పెట్టుకుంటే భావోద్వేగ బలహీనత వస్తుంది. జీవితంలో మన ముందుకు వచ్చే దృశ్యాలు, పరిస్థితులు, వ్యక్తుల ఆలోచనలు, మాటలు మరియు వారి కర్మల నుండి మనం చాలా గ్రహిస్తుంటాము. కొన్నిసార్లు అది సాధికారత కలిగించే అనుభవంగా భావిస్తాము. కానీ గుర్తుంచుకోండి, మీరు మంచిని గ్రహిస్తే, మీరు చెడును కూడా గ్రహిస్తారు ఎందుకంటే మీ మనస్తత్వం అదే. ఇది వాక్యూమ్ క్లీనర్ లాంటిది. మీరు దానితో మీ కార్పెట్‌ను శుభ్రం చేస్తున్నారు. ఇది దుమ్మును గ్రహిస్తుంది. ఒకవేళ మీ ఉంగరం కార్పెట్‌పై పడి ఉంటే, దానిని కూడా వాక్యూమ్ క్లీనర్ లోపలకు తీసేసుకుంటుంది. అలాగే, ఇవ్వడమే స్వీకరించడం. మనం ఇచ్చే ప్రతి సానుకూల భావోద్వేగం, అదే సమయంలో మనలో పెరుగుతుంది, అది మనలో నుండి ప్రతి ఒక్కరికీ మరియు మన చుట్టూ ఉన్న ప్రతిదానికీ ప్రవహిస్తుంది.

                 ఈ సిద్ధాంతం ఆధారంగా, ఒక పాజిటివ్ దృశ్యం నుండి మనం తీసుకోవాలని చూస్తే, మనం ఎమోషనల్‌గా ఆనందంగా ఉంటాము. అలాగే ఒక నెగిటివ్ దృశ్యం నుండి కూడా మనం ఎమోషనల్‌గా బాధను తీసుకుంటాము. ఎంతగా మన ఎమోషనల్ ప్రపంచాన్ని మనం బాహ్య పరిస్థితులపై ఆధారపడేలా చేస్తామో అంతగా మన ప్రతిస్పందనలు వాటి ప్రభావంలో ఉంటాయి. అతిగా ఎమోషనల్‌గా ఉంటే, అది ఆనందం కావచ్చు బాధ కావచ్చు, ఇది ఆధారపడే స్వభావానికి గుర్తు. అంటే ఏ ఎమోషన్లు లేకుండా బోరింగుగా ఉంటూ జీవితంలో వచ్చే అందమైన క్షణాలను ఆస్వాదించవద్దు అని అర్థం కాదు. నిజానికి, మనం అందరినీ ప్రేమిస్తూ అవసరమైన చోట మన సానుభూతిని కూడా వ్యక్తపరుస్తూ ఉండాలి. అయితే జీవితాన్ని చూసే సమయంలో కొద్దిగా నిర్లిప్తత కూడా ఉండాలి. క్రీడలు జరుగుతున్నప్పుడు అది ప్రత్యక్షంగా చూసే ప్రేక్షకుడు తనకిష్టమైన టీమ్ లేదా ఆటగాడు ఆడుతుంటే ఎమోషన్ల రోలర్ కోస్టర్ (మలుపులు తిరిగే ట్రాక్‌పై చేసే వినోద యాత్ర) పై ప్రయాణిస్తూ ఉంటాడు. అంటే, ఒక్కోసారి చాలా ఆనందం, మరోసారి చాలా బాధ. ఆత్మిక స్థితిలో ఉండి చూసే ప్రేక్షకుడు తన టీమ్ లేక ఆటగాడి ఆటకు అతిగా ప్రభావితం కాడు. ఇతడు విజయాలను, వైఫల్యాల క్షణాలను రెండింటినీ ఎమోషన్లలోకి రాకుండా ఆస్వాదిస్తాడు. ఇది బోరింగ్ స్థితి కాదు, పైగా మరింత శక్తివంతమైన స్థితి. ఇది జీవితంలో వచ్చే అన్ని పరిస్థితులకు వర్తిస్తుంది.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

[drts-directory-search directory="bk_locations" size="lg" cache="1" style="padding:15px; background-color:rgba(0,0,0,0.15); border-radius:4px;"]

రికార్డు

14th June 2025 Soul Sustenance Telugu

భగవంతుడు – ఈ సృష్టి యొక్క ఆది బిందువు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు భగవంతుడు సర్వ శక్తివంతుడు. వారు ఉంటేనే ఈ ప్రపంచం ఉంటుంది, ఎందుకంటే ఈ ప్రపంచంలో  మంచితనం మరియు దైవత్వం క్షీణించిన ప్రతిసారీ

Read More »
13th June 2025 Soul Sustenance Telugu

మిమ్మల్ని మీరు ఎలా ఆశీర్వదించుకోవాలి?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన జీవితంలో సాధువులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కుటుంబం మరియు స్నేహితుల ఆశీర్వాదాల శక్తిని మనమందరం పొందాము. ఆశీర్వాదం అంటే వారందరూ మన

Read More »
12th June 2025 Soul Sustenance Telugu

ఒత్తిడి మరియు ఆందోళన లేని ప్రపంచాన్ని సృష్టించడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు ప్రతి రోజును ఆధ్యాత్మిక ఆనందంతో ఆస్వాదించండి మరియు దానిని ఇతరులతో పంచుకోండి ఇతరులను శక్తివంతం చేసి వారిని సంతోషపెట్టడానికి చాలా ముఖ్యమైన

Read More »