Manam emotional gaa undaala vaddaa

September 8, 2023

మనం ఎమోషనల్‌గా ఉండాలా వద్దా (పార్ట్ 3)

మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తే, ఇది వ్యక్తులు, పరిస్థితులు, వస్తువులు మరియు మనం అప్పుడప్పుడూ ఎదుర్కొనే వివిధ రకాల సమస్యల అనంత మిశ్రమం. కొన్నిసార్లు ఆనందం మరియు ప్రేమలో, మరికొన్నిసార్లు దుఃఖం మరియు అసంతృప్తితో ఎమోషనల్ అవ్వడం లేదా ఏడవడం సహజమే అని చాలామంది వాదిస్తుంటారు. అలాగే, విభిన్న ప్రతికూల మరియు సానుకూల పరిస్థితులలో మీ ప్రియమైనవారి కోసం మీరు కన్నీళ్ళు పెట్టుకోవడం అన్నది ఎప్పటినుండో ఉనికిలో ఉంది కూడా అంటారు.  అయితే ఇది నిజం కాదు. మనిషిలోని జీవి లేదా ఆత్మ జననాలు మరియు పునర్జన్మల మెట్లు దిగుతూ, కొంత కాలానికి బలహీనంగా మారింది. ప్రపంచంలో తన పాత్రను పోషించడం ప్రారంభించినప్పుడు ఆత్మ శక్తివంతంగా ఉంటుంది. దాని చుట్టూ ఉన్నవాటితో ఆత్మకు అంతగా మమకారం ఉండేది కాదు.  తత్ఫలితంగా, ఆత్మ తక్కువ భావోద్వేగంగా ఉంటూ ఎక్కువ సంతోషంగా ఉండేది. ఆత్మ బలహీనంగా అవ్వడంతో అది ఎక్కువ ఎమోషనల్‌గా, తక్కువ ఆనందంగా మారింది. వింతగా అనిపించినాగానీ ఇదే నిజం.

                 దీని నుండి విముక్తి పొందడానికి ముఖ్యమైన విషయమేమిటంటే, అతిగా ఎమోషనల్‌గా అవ్వకుండా ఉండటం అంటే ఏమీ భావనలు లేకుండా ఉండటం అని అర్థం కాదు. ఈ విషయాన్ని మనం గత రెండు రోజుల సందేశాల ద్వారా తెలుసుకున్నాం.  ఆలోచనలలో మార్పు తీసుకురావడమే మనం వేయవలసిన తర్వాతి అడుగు. పాజిటివ్ ఆలోచనలను ఆలోచిస్తూ వాటిని రోజంతా గుర్తుంచుకుంటూ మీ కర్మలలోకి కూడా తీసుకురండి. ఒక చక్కని ఉదాహరణ – నేను ప్రకాశ స్వరూపాన్ని, శక్తితో నిండిన ఆత్మిక సత్తాను. నా చుట్టూ ఉన్నవాటిని నేను నా కళ్ళు అనే కిటికీల ద్వారా చూస్తున్నాను. నా ఎదురుగా వచ్చే ప్రతి దృశ్యానికి, ప్రతి వ్యక్తికి, ప్రతి వస్తువుకు నేను ఆత్మిక శక్తిని మరియు ఆనందాన్ని వ్యాప్తి చేస్తున్నాను. వాటినుండి తీసుకుని నేను నిండుగా అవ్వాలి అనే ఆధారపడే గుణం ఇప్పుడు నాలో లేదు. నేను సర్వ ప్రాప్తి స్వరూప ఆత్మను. మరో ఉదాహరణ – నేను అనంతమైన ప్రేమ స్వరూప ఆత్మను. నేను విశాల హృదయంతో అందరినీ, అన్నిటినీ ప్రేమిస్తున్నాను, కానీ వాటిపై నాకు మోహం లేదు. కనుక నేను ప్రేమలో ఎప్పుడూ గాయపడను. జీవితంలో వచ్చే ప్రతి నెగిటివ్ పరిస్థితికి నేను సానుకూల శక్తిని అందించే ఆధార స్తంభాన్ని. కనుక నేను బాధలో, తిరస్కారంలో మనసును గాయపరచుకోను.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

3rd oct 2023 soul sustenance telugu

   మీ శరీరాన్ని గౌరవించే కళ

మన భౌతిక వస్త్రము అయిన మన శరీరం తరచుగా మన లేదా ఇతరుల అంచనాలకు, విమర్శ లేదా తిరస్కరణకు గురవుతుంది. మన శరీరం జీవితాంతం మనకు ఎన్నో రకాలుగా పని చేసినందుకు అది కృతజ్ఞతలు

Read More »
2nd oct 2023 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు నేను ఎలా భావిస్తున్నాను అనేది జీవితంలో పురోగతికి చాలా ముఖ్యం. అలాగే,

Read More »
1st oct 2023 soul sustenance telugu new

ఇవి ప్రపంచ నాటకం యొక్క చివరి క్షణాలు

ప్రపంచ నాటకం అనేది భూమిపై ఆత్మలందరూ ఆడే ఒక నాటకం, ఇందులో నాలుగు దశలు ఉన్నాయి – సత్యయుగం లేదా స్వర్ణయుగం, త్రేతాయుగం లేదా వెండి యుగం, ద్వాపరయుగం లేదా రాగి యుగం మరియు

Read More »