Hin

7th march 2025 soul sustenance telugu

March 7, 2025

మనం ఎమోషనల్‌గా ఉండాలా వద్దా (పార్ట్ 1)

మలుపులు, కుదుపులతో నిండిన జీవితాన్ని జీవిస్తున్న మనకు, చుట్టూ జరిగె దృశ్యాలతో ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వడం సహజమే. ఒక్కోసారి నిరాశ, మరోసారి దుఃఖం, ఇంకోసారి ఆనందంతో నిండిన భావోద్వేగం. అన్నీ నార్మల్ ఎమోషన్లే. ఇలాగే కదా మనం ఆలోచిస్తాం! రోడ్డుపై జరిగిన ప్రమాదాన్ని చూసినప్పుడు బాధపడటంలో తప్పేముంది? భావోద్వేగాలతో నిండిన సినిమాను చూసినప్పుడు ఏడుపు రావడంలో తప్పేముంది? ఈ రెండు అనుభవాలను మీరు జీవితం నుండి తీసివేయగలమా? ఇలా ఉండటం కరెక్టే అని మనకు ప్రపంచం నేర్పించింది. మనం పెరుగుతున్నప్పుడు మనం ఎన్నోసార్లు ఏడ్చాము, అది బాధతో కావచ్చు, ఆనందంతో కావచ్చు. మీ స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్ళి బాగా ఎమోషనల్‌గా, అతి ఆనందపడ్డారా! మీ తమ్ముడికో చెల్లెలికో బాగా జ్వరంవస్తే వారి బాధను చూడలేక ఏడ్చేసారా? భావోద్వేగ ఆనందం మరియు భావోద్వేగ దుఃఖం యొక్క మిశ్రమ ఛాయలు జీవితం యొక్క పెయింటింగ్‌ను తయారు చేస్తాయి అని, జీవితమంటే ఇదే అని మన తల్లిదండ్రులు మనకు నేర్పించారు, నిజానికి, వారు తమ ప్రాపంచిక విధులలో అలా చేయడం చూసి మనం పెరిగాము, అదే సరైనది అని మనం భావించాము. ఇప్పుడు! ఆగండి! నేను ఈ ఎమోషనల్ రోలర్ కోస్టర్‌పై పదే పదే కూర్చోవడాన్ని ఇష్టపడతానా? నన్ను నేను ఎలా విడిపించుకోగలను?

                 మనమందరం జీవితంలోని దృశ్యాలను జీవితం నుండి ఏదైనా స్వీకరించే లేదా తీసుకునే వైఖరితో చూస్తాము. జీవిత సన్నివేశాలకు ఇవ్వడం గురించి మనం చాలా అరుదుగా ఆలోచిస్తాము. ప్రకృతిలో సూర్యుని ఉదాహరణ తీసుకోండి. సూర్యుని గుణం ఇవ్వడం, అది స్వీకరించడానికి లేదా తీసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించదు. సూర్యుడు ప్రకృతిలోని శక్తివంతమైన శక్తి. మనలోని ఈ సుగుణాన్ని వెలికితీద్దాం. అది మనల్ని మానసికంగా శక్తివంతం చేస్తుంది మరియు జీవితంలోని విభిన్న పరిస్థితుల్లో మనం తేలికగా, సంతోషంగా మరియు సంతృప్తిగా ఉంటాము. కాబట్టి ఈ రోజు నుండి జీవితంలోని విభిన్న దృశ్యాలకు ఇవ్వడానికి ప్రయత్నించండి; ఆ దృశ్యాలను ప్రాథమిక సుగుణాలైన శాంతి, ప్రేమ మరియు ఆనందంతో నింపడానికి చూడండి. అదే, ఈ గుణాలను వ్యక్తుల నుండి మరియు పరిస్థితుల నుండి తీసుకుని మనల్ని మనం నింపుకోవడానికి ప్రయత్నిస్తే మనం మానసికంగా బలహీనంగా అవుతాము.

 

(సశేషం…)

రికార్డు

28th march 2025 soul sustenance telugu

సోషల్ మీడియా లైక్‌లు ముఖ్యమా?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఆధారిత సమాజంలో, మనం పోస్ట్ చేసే దానిపై ప్రజల ఆమోదం పొందడం మన స్వీయ-విలువ మరియు కీర్తికి కొలమానంగా

Read More »
27th march 2025 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు

Read More »
26th march 2025 soul sustenance telugu

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను చాలా బిజీగా ఉన్నాను…నాకు సమయం లేదు అని తరచుగా అంటూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వం మనల్ని సమయానికి ప్రాధాన్యత ఇవ్వనివ్వదు.

Read More »