Hin

9th march 2025 soul sustenance telugu

March 9, 2025

మనం ఎమోషనల్‌గా ఉండాలా వద్దా (పార్ట్ 3)

మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తే, ఇది వ్యక్తులు, పరిస్థితులు, వస్తువులు మరియు మనం అప్పుడప్పుడూ ఎదుర్కొనే వివిధ రకాల సమస్యల అనంత మిశ్రమం. కొన్నిసార్లు ఆనందం మరియు ప్రేమలో, మరికొన్నిసార్లు దుఃఖం మరియు అసంతృప్తితో ఎమోషనల్ అవ్వడం లేదా ఏడవడం సహజమే అని చాలామంది వాదిస్తుంటారు. అలాగే, విభిన్న ప్రతికూల మరియు సానుకూల పరిస్థితులలో మీ ప్రియమైనవారి కోసం మీరు కన్నీళ్ళు పెట్టుకోవడం అన్నది ఎప్పటినుండో ఉనికిలో ఉందని కూడా అంటారు.  అయితే ఇది నిజం కాదు. మనిషిలోని జీవి లేదా ఆత్మ జననాలు మరియు పునర్జన్మల మెట్లు దిగుతూ, కొంత కాలానికి బలహీనంగా మారింది. ప్రపంచంలో తన పాత్రను పోషించడం ప్రారంభించినప్పుడు ఆత్మ శక్తివంతంగా ఉంటుంది. దాని చుట్టూ ఉన్నవాటితో ఆత్మకు అంతగా మమకారం ఉండేది కాదు. తత్ఫలితంగా, ఆత్మ తక్కువ భావోద్వేగంగా ఉంటూ ఎక్కువ సంతోషంగా ఉండేది. ఆత్మ బలహీనంగా అవ్వడంతో అది ఎక్కువ ఎమోషనల్‌గా, తక్కువ ఆనందంగా మారింది. వింతగా అనిపించినాగానీ ఇదే నిజం.

దీని నుండి విముక్తి పొందడానికి ముఖ్యమైన విషయమేమిటంటే, అతిగా ఎమోషనల్‌గా అవ్వకుండా ఉండటం అంటే ఏమీ భావనలు లేకుండా ఉండటం అని అర్థం కాదు. ఈ విషయాన్ని మనం గత రెండు రోజుల సందేశాల ద్వారా తెలుసుకున్నాం. ఆలోచనలలో మార్పు తీసుకురావడమే మనం వేయవలసిన తర్వాతి అడుగు. పాజిటివ్ ఆలోచనలను ఆలోచిస్తూ వాటిని రోజంతా గుర్తుంచుకుంటూ మీ కర్మలలోకి కూడా తీసుకురండి. ఒక చక్కని ఉదాహరణ – నేను ప్రకాశ స్వరూపాన్ని, శక్తితో నిండిన ఆత్మిక సత్తాను. నా చుట్టూ ఉన్నవాటిని నేను నా కళ్ళు అనే కిటికీల ద్వారా చూస్తున్నాను. నా ఎదురుగా వచ్చే ప్రతి దృశ్యానికి, ప్రతి వ్యక్తికి, ప్రతి వస్తువుకు నేను ఆత్మిక శక్తిని మరియు ఆనందాన్ని వ్యాప్తి చేస్తున్నాను. వాటినుండి తీసుకుని నేను నిండుగా అవ్వాలనే ఆధారపడే గుణం ఇప్పుడు నాలో లేదు. నేను సర్వ ప్రాప్తి స్వరూప ఆత్మను. మరో ఉదాహరణ – నేను అనంతమైన ప్రేమ స్వరూప ఆత్మను. నేను విశాల హృదయంతో అందరినీ, అన్నిటినీ ప్రేమిస్తున్నాను, కానీ వాటిపై నాకు మోహం లేదు. కనుక నేను ప్రేమలో ఎప్పుడూ గాయపడను. జీవితంలో వచ్చే ప్రతి నెగిటివ్ పరిస్థితికి నేను సానుకూల శక్తిని అందించే ఆధార స్తంభాన్ని. కనుక నేను బాధలో, తిరస్కారంలో మనసును గాయపరచుకోను.

రికార్డు

11th july 2025 soul sustenance telugu

చెడు శకునాలు మరియు మూఢనమ్మకాల ప్రభావం నుండి అతీతంగా అవ్వండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు కొన్ని గ్రహాలు, ప్రదేశాలు, సంఖ్యలు, రంగులు, వస్తువులు, వ్యక్తులు మరియు భౌతిక శరీరాల వెలుపల సూక్ష్మ శరీరాలలో ఉండే కొన్ని ఆత్మల

Read More »
10th july 2025 soul sustenance telugu

నా భాగ్యానికి ఎవరు బాధ్యులు?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలామంది భగవంతుడు మన భాగ్యాన్ని వ్రాస్తాడని నమ్ముతాము. ఈ నమ్మకం గురించి  మనం ఆలోచించి ఆత్మపరిశీలన చేసుకోవాలి. భగవంతుడు మన

Read More »
9th july 2025 soul sustenance telugu

ఆరోగ్యకరమైన వర్క్-లైఫ్ బ్యాలన్స్ ను సాధించడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితం ఒక ప్రవాహంవంటిది, కనుక, మనం మన బాధ్యతల ప్రాధాన్యతలను మారుస్తూ ఉండాలి, మనకు మద్దతు ఇచ్చే జీవితంలోని అన్ని అంశాల

Read More »